సాక్షి,టెక్కలి రూరల్( శ్రీకాకుళం): అక్కున చేర్చుకోవాల్సి కూమార్తె తల్లిని కాదుపొమ్మంటూ బయటకు నెట్టివేసిన ఘటన కోటబొమ్మాళి పంచాయతీ పరిధి ప్రకాష్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది. భర్త మృతి చెందిన కొంత కాలం తర్వాత ప్రకాష్ నగర్‌లో స్థలం కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నానని రొక్కం దమయంతి తెలిపారు. వితంతు పింఛన్‌పైనే ఆధారపడి జీవిస్తున్నానని చెప్పారు.
తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, అందరికీ వివాహాలు చేశామన్నారు. మూడో కుమార్తె నెట్టం చాయాకుమారి శ్రీకాకుళంలో నివాసం ఉంటుందన్నారు. రెండు రోజులు క్రింత ఇంటికి వచ్చిందని, అప్పటి నుంచి ఈ ఇల్లు తనదంటూ గొడవ పెట్టిందన్నారు. తాను అంగీకరించకపోవడంతో ఈ ఇంట్లో నువ్వు ఉండటానికి వీలులేదని సామగ్రీ బయటకు విసిరేందన్నారు. అనంతరం తనను నెట్టివేసిందన్నారు. ఈ ఇల్లు తానే నిర్మించుకున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు దమయంతి పోలీసులను ఆశ్రయించారు.
చదవండి: 7 నెలలకే భర్త పరార్.. అత్తవారింటి మెట్లపైన కోడలి పూజలు
Comments
Please login to add a commentAdd a comment