తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం/ అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లోని ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. అనంతరం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారి.. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి.. ఆదివారం మధ్యాహ్నం ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ వెల్లడించింది.
► తీరందాటే సమయంలో బలహీనపడి వాయుగుండంగా మారనుంది.
► శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
► సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 70 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. 3 రోజుల పాటు మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment