సాక్షి,విజయవాడ:వీఆర్‌ఏల ధర్నాను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడికక్కడ వీఆర్‌ఏల నాయకులను హౌజ్ అరెస్టులు చేయిస్తోంది. ఎలాగైనా వారిని సోమవారం(నవంబర్18) మంగళగిరి సీసీఎల్‌ఏ వద్ద జరిగే ధర్నాకు హాజరుకాకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది.
న్యాయమైన డిమాండ్లతో వీఆర్‌ఏలు శాంతియుతంగా ధర్నా తలపెట్టారు. వీఆర్‌ఏలు ధర్నాకు వెళితే కేసులు పెడతామని అధికారులు ఇప్పటికే బెదిరిస్తున్నారు.తమపై నిర్బంధం పెడితే ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని వీఆర్‌ఏల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.4నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం,రెవెన్యూ మంత్రికి చెప్పిన పట్టించుకోలేదని వీఆర్‌ఏ సంఘం నేతలు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment