vras protest
-
వీఆర్ఏలపై కూటమి ప్రభుత్వ నిర్బంధం..ధర్నాను అడ్డుకునేందుకు యత్నం
సాక్షి,విజయవాడ:వీఆర్ఏల ధర్నాను అడ్డుకోవడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడికక్కడ వీఆర్ఏల నాయకులను హౌజ్ అరెస్టులు చేయిస్తోంది. ఎలాగైనా వారిని సోమవారం(నవంబర్18) మంగళగిరి సీసీఎల్ఏ వద్ద జరిగే ధర్నాకు హాజరుకాకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోంది.న్యాయమైన డిమాండ్లతో వీఆర్ఏలు శాంతియుతంగా ధర్నా తలపెట్టారు. వీఆర్ఏలు ధర్నాకు వెళితే కేసులు పెడతామని అధికారులు ఇప్పటికే బెదిరిస్తున్నారు.తమపై నిర్బంధం పెడితే ఉద్యమం మరింత ఉదృతం అవుతుందని వీఆర్ఏల సంఘం నాయకులు హెచ్చరిస్తున్నారు.4నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం,రెవెన్యూ మంత్రికి చెప్పిన పట్టించుకోలేదని వీఆర్ఏ సంఘం నేతలు వాపోతున్నారు. -
జీవో 81ను సవరణ చేయాలని వీఆర్ఏల డిమాండ్
-
కేటీఆర్‌తో వీఆర్ఏల భేటీ.. మీటింగ్‌పై ఉత్కంఠ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తమకు పే స్కేల్ పెంచాలని వీఆర్ఏలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కాగా, ఉద్రిక్తతల నేపథ్యంలో అసెంబ్లీ హాల్లో మంత్రి కేటీఆర్ వీఆర్ఏలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఏలు కేటీఆర్‌ను కోరారు. ఇక, అంతకుముందు భారీ సంఖ్యలో వీఆర్ఏలు, వివిధ సంఘాలు నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేశారు. -
వీఆర్ఏల ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
హన్మకొండ అర్బన్ : సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో ఆందోళన చేస్తున్న తమ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వీఆర్ఏ(డీఆర్)ల సంఘం జిల్లా అధ్యక్షులు కరుణాకర్ అన్నారు. ఈనెల 2వ తేదీ నుంచి హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద ఆందోళన చేస్తున్న వీఆర్ఏలు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. తొలుత కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ పార్ట టైం ఉద్యోగులుగా నియమితులైన తమతో ఫుల్ టైం పనులు చేయిస్తున్నారని అన్నారు. అయినా సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. అనంతరం డీఆర్వోకు వినతిపత్రం అందజేశారు. కాగా, వీఆర్ఏల ఆందోళనకు డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు నాయకులు ఈ.వీ.శ్రీనివాస్, బత్తిని శ్రీనివాస్ తదితరులు సంఘీభావం తెలిపారు.