
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తమకు పే స్కేల్ పెంచాలని వీఆర్‌ఏలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. కాగా, ఉద్రిక్తతల నేపథ్యంలో అసెంబ్లీ హాల్‌లో మంత్రి కేటీఆర్ వీఆర్‌ఏలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏలు కేటీఆర్‌ను కోరారు. ఇక, అంతకుముందు భారీ సంఖ్యలో వీఆర్‌ఏలు, వివిధ సంఘాలు నేతలు, కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో, పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలోనే పలువురిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment