
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్, రాజేందర్‌లు కలిశారని, ఆ రెండు పార్టీలు కలిసి హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. భిన్న ధ్రువాలైన కాంగ్రెస్, బీజేపీలు హుజూరాబాద్ ఎన్నికలో ఎలా కలిసి పనిచేస్తాయని ప్రశ్నిం చారు.
శనివారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధీభవన్‌లో గాడ్సేలకు స్థానం లేదని, కాంగ్రెస్ భావజాలం ఉన్నవారే గాంధీభవన్‌లో ఉంటా రని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత ఈటలకాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం ఊహాగానమేనని కొట్టిపారేశారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కలిసే హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయించాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment