
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సామ్రాజ్యలక్ష్మి చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఒక్కోక్యాంపస్‌లో పీయూసీ ద్వితీయ సంవత్సరానికి చెందిన 1,000 మంది హాజరవుతారని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రొటోకాల్‌ను పక్కాగా అమలుచేస్తూ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.