సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్న గుంటూరు విద్యార్థిని సుమిత్ర
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత సొమ్ము విడుదల చేసింది. ఈ సందర్భంగా గుంటూరు నుంచి విద్యా దీవెన లబ్ధిదారు అయిన బీటెక్ విద్యార్థిని సుమిత్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్‌తో మాట్లాడింది. విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపింది. ఎంతో ధైర్యంగా.. ఏమాత్రం తడబాటు లేకుండా.. పూర్తిగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ.. అక్కడున్నవారందరిని ఆశ్చర్యపరిచింది. సీఎం జగన్ ప్రశంసలు పొందింది.
ఈ సందర్భంగా సుమిత్ర మాట్లాడుతూ.. ‘‘విద్యా దీవెన, వసతి దీవెన కార్యక్రమాలు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉన్నత విద్య అభ్యసించాలనుకునేవారికి ఈ పథకాలు ఎంతో మేలు చేస్తాయి. గతంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ కింద కేవలం 33 వేల రూపాయాలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు మీరు పూర్తిగా వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. అది కూడా విద్యార్థుల తల్లుల ఖాతాలోనే జమ చేయడం ఎంతో బాగుంది. వసత దీవెన వల్ల మేం తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా మా కోర్సులకు సంబంధించిన ఎక్స్‌ట్రా స్కిల్స్ అందిస్తూ.. ఉద్యోగ సాధనలో ఎంతో మేలు చేస్తున్నారు. మా కోసం ఇన్ని చేస్తున్న మీరు మరిన్ని ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. థాంక్యూ సోమచ్ మావయ్య’’ అంటూ ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment