సాక్షి, విశాఖపట్నం: జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకుడు రాఘవరావు వేధింపుల పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా నగరానికి చెందిన ఓ మైనర్ బాలికను రాఘవరావు వేధింపులకు గురిచేస్తున్నాడు. చినవాల్తేర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న ఆ బాలికకు వాట్సాప్‌లో అసభ్య మెసేజ్‌లు పెట్టడంతో పాటు ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం ఆ బాలిక నివాసం ఉంటున్న ప్లాట్‌కు మద్యం సేవించి వెళ్లిన రాఘవరావు మరోసారి ప్రేమ పేరుతో హల్ చల్ చేశాడు. ప్లాట్‌లో నుంచి బయటకు రావాలని ఆ బాలికను వేధించాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వారించే ప్రయత్నం చేశారు. అయితే వారిపైనా తిట్ల పురాణంతో బెదిరింపులకు దిగాడు.
అతని ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నువ్ ఏం చేస్తున్నావ్ నీకు తెలుస్తుందా, నీ మనమరాలి వయసున్న నాతో ప్రేమేంటి, చెప్పు తీసుకొని కొట్టమంటావా అంటూ మాట్లాడిన వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ బాలిక ప్లాట్‌కు వచ్చిన క్రమంలో రాఘవరావు మద్యం సేవించి ఉండటంతో పాటు జేబులో చాకు పెట్టుకుని వచ్చిన విషయాన్ని స్నేహితులు గుర్తించి అతని నుంచి ఆ చాకును లాక్కున్నారు.
ఈ ఘటనపై బాలిక తరపువారు పోలీసులను కూడా ఆశ్రయించినట్లు తెలిసింది. అయితే రాఘవరావు పలుకుబడి కారణంగా తమకు హాని కలుగుతుందనే భయంతో వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసేందుకు సంకోచించినట్లు సమాచారం.
చదవండి: (టీడీపీ నేతలపై కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి ఆగ్రహం)
Comments
Please login to add a commentAdd a comment