సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కర్నాటక కాగినెలె కనకదాసు గురపీఠ పీఠాధిపతి జగద్గురు నిరంజనానందపురి మహాస్వామి, కర్నాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, బీసీ కులాల ఫెడరేషన్ ప్రెసిడెంట్ బి.కే.రవి కలిశారు.
ఈ సందర్భంగా తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అలాగే, తిరుమల క్షేత్రంలో తమ కురబ సామాజికి వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాది మంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాకుండా శ్రీవారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీచరణ్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి సహా తదితరులు వారి వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment