kanakadasa
-
కనకదాసు చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ జగన్
-
సీఎం జగన్‌కు కలిసిన కర్నాటక కనకదాసు పీఠాధిపతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కర్నాటక కాగినెలె కనకదాసు గురపీఠ పీఠాధిపతి జగద్గురు నిరంజనానందపురి మహాస్వామి, కర్నాటక పురపాలక శాఖ మంత్రి ఎం.టి.బి.నాగరాజు, మాజీ మంత్రి హెచ్.ఎం.రేవణ్ణ, బీసీ కులాల ఫెడరేషన్ ప్రెసిడెంట్ బి.కే.రవి కలిశారు. ఈ సందర్భంగా తిరుమలలో కనకదాసు గురుపీఠం మఠం నిర్మించేందుకు అవసరమైన ఒక ఎకరా భూమిని కేటాయించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అలాగే, తిరుమల క్షేత్రంలో తమ కురబ సామాజికి వర్గానికి ఇప్పటి వరకు మఠం లేదని, లక్షలాది మంది స్వామి వారి భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారని సీఎం జగన్‌కు వివరించారు. అంతేకాకుండా శ్రీవారి కీర్తనలు, ప్రసస్ధ్యానికి తమ పీఠానికి ఉన్న చరిత్రను ముఖ్యమంత్రి జగన్‌తో పంచుకున్నారు. ఇక, ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీచరణ్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి సహా తదితరులు వారి వెంట ఉన్నారు. -
విద్యతోనే కురుబల అభ్యున్నతి
∙ఐక్యంగా హక్కులను సాధించుకుందాం ∙కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం పిలుపు ∙ఘనంగా కనకదాస జయంతి అనంతపురం రూరల్: విద్యతోనే కురుబల ప్రగతి సాధ్యమవుతుందని , ఆదిశగా ప్రతి కురుబ కులస్తుడు తమ పిల్లలను ఉన్నత చదువు చదివించాలని కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగే పరశురాం సూచించారు. ఆదివారం కురుబ యువత ఆధ్వర్యంలో భక్త కనకదాస 529 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జయంతి వేడుకలకు పెద్ద ఎత్తున తరలివచ్చిన కురుబలు వివిధ వేషధారణలతో అనంతపురం ఆర్‌్ట్స కళాశాల మైదానం నుంచి ర్యాలీగా గుత్తిరోడ్డులోని కనకదాస విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాగే పరుశురాం మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో సైతం కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఇందుకు చదువు లేకపోవడమే కారణమన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం కురుబలేనన్నారు. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ప్రభుత్వాలపై పోరాటం చేసి సాధించు కొవాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కురుబల కార్పొరేష¯ŒS ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కురుబలు రాజకీయంగా అభివృద్ధి చెందారంటే ఒక్క విద్యతోనే సాధ్యం అయిందన్నారు. కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బత్తలపల్లి ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, రాప్తాడు సర్పంచ్ వెంకటరాముడు మా ట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లు కురుబలకు 7 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీష్, బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కురుబల హక్కుల సాధన.. ఐక్య పోరాటలతోనే సాధ్యం అవుతాయన్నారు.