ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాగే పరుశురాం మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో సైతం కురుబలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారన్నారు. ఇందుకు చదువు లేకపోవడమే కారణమన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న ఏకైక కులం కురుబలేనన్నారు. హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు ఐక్యంగా ప్రభుత్వాలపై పోరాటం చేసి సాధించు కొవాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కురుబల కార్పొరేష¯ŒS ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు.
పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో కురుబలు రాజకీయంగా అభివృద్ధి చెందారంటే ఒక్క విద్యతోనే సాధ్యం అయిందన్నారు. కనకదాస జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. బత్తలపల్లి ఎంపీపీ కోటి సూర్యప్రకాష్‌బాబు, రాప్తాడు సర్పంచ్ వెంకటరాముడు మా ట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీ లు కురుబలకు 7 అసెంబ్లీ సీట్లను కేటాయించాలని డి మాండ్ చేశారు. సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీష్, బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కురుబల హక్కుల సాధన.. ఐక్య పోరాటలతోనే సాధ్యం అవుతాయన్నారు.