
మంత్రికి వ్యాక్సిన్ వేస్తున్న డాక్టర్ సతీష్‌కుమార్
గుడివాడ టౌన్: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో శ్రమిస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు (నాని) అన్నారు. శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్ వార్డు సచివాలయంలో మంత్రి మొదటి విడత కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ ఒక్కటే వ్యాధి నివారణకు, వైరస్‌ను అరికట్టడానికి మార్గంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ అనుమానాలు వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తిగా కోవిడ్ కేంద్రాలుగా మార్చామన్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కె.సతీష్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment