సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కృష్ణుని జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తున్నాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment