Sri Krishna Janmashtami celebrations
-
Nishka: వెన్నదొంగగా మారిన బుల్లితెర నటి చైత్ర గారాలపట్టి.. (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు (ఫొటోలు)
-
శ్రీ కృష్ణ జన్మాష్టమి నేపథ్యంలో మందిరాల్లో ప్రత్యేక అలంకరణ
-
తెలుగు ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: మంత్రి రోజా
-
తిరుపతి నగరంలో వేడుకగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
-
Srikrishna Janmashtami 2022 : ముద్దు లొలికిస్తున్న ‘చిన్ని కృష్ణులు’ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహిస్తున్నారు. కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే, ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ కృష్ణుని జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ భక్తికి ప్రత్యేకమైన ఇస్కాన్ ఆలయాలలో సంబరాలు అంబరాన్ని తాకాయి. అత్యంత భక్తిభావంతో చిన్ని కృష్ణయ్యకు నిర్వహించే పూజలు, సేవలు ప్రతి ఒక్కటి విశేషంగా నిలుస్తున్నాయి. గోపాలుడి దేవాలయాల్లో గ్రామోత్సవం, గీతాపఠనం, ఉట్టి కొట్టడం లాంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. -
భక్తులతో కిటకిట లాడుతున్న శ్రీ కృష్ణ ఆలయాలు
-
భక్తుల తో కిట కిట లాడుతున్న శ్రీకృష్ణ ఆలయాలు
-
కృష్ణాష్టమి వేడుకలపై కరోనా ప్రభావం
-
గోకుల కృష్ణా.. గోపాల కృష్ణా..
అనంతపురం కల్చరల్: గతి తప్పిన జగతిని ప్రగతి మార్గాన నడిపించడానికి మానవ అవతారమెత్తి, ఆధ్యాత్మిక భావసంపదను పాదుకొల్పి జగద్గురువుగా భాసిల్లుతున్న కృష్ణ భగవానుని జన్మాష్టమి వేడుకలు సోమవారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. ఈనేపథ్యంలో వివిధ ఆధ్యాత్మిక, స్వచ్ఛంద సంస్థలు వారు నిర్వహిస్తున్న కృష్ణమేళాలు అందరికీ గోకులాన్ని సాక్షాత్కరింపచేస్తున్నాయి. అపశకునాలుగా భావిస్తున్న అష్టమి రోజున పుట్టడం, చెరశాల జన్మస్థానం కావడం, నల్లని వాడుగా ఉండటం.. ఇవేవీ తిరోగమనాలు కావని, భవిష్య తరాల వారికి ఘనమైన వారసత్వ సంపదనందించిన శ్రీకృష్ణ భగవానుని జన్మదినాన్ని నగరంలో కోలాహలంగా జరుపుకొంటున్నారు. ఇస్తాన్ మందిరంలో సోమవారం విశ్వశాంతి యజ్ఞం, విష్ణు సహస్రనామ పారాయణం, హరినామ సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్నారుల కృష్ణ వేషధారణలుంటాయి. మంగళవారం మహాభిషేకంతో పాటు ఉట్టి ఉత్సవాలు, పుష్పాభిషేకం జరుగుతాయి. అదేవిధంగా ఆర్ఎఫ్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణపరివారం, నృత్యకళా నిలయం సంయుక్త ఆధ్వర్యంలో సాగే ‘కృష్ణమేళా’లో చిన్నారులు సాక్షాత్తు చిన్ని కృష్ణుని తలపిస్తూ ఆనంద తాండవం చేస్తారు. అలాగే వాడవాడలా కృష్ణ మందిరాలు శోభాయమానంగా, విద్యుద్దీపకాంతులతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలు, కళాక్షేత్రాల్లో సంప్రదాయంగా సాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తమ శిష్యులు శాస్త్రీయ నృత్యాలు ప్రదర్శిస్తారని నృత్య విద్వాంసురాలు సంధ్యామూర్తి తెలిపారు. ధర్మ సంస్థాపన కోసమే అవతరించాడు : దామోదర్ గౌరంగదాస్, ఇస్కాన్ మందిరం జగతికి వింత శోభను కూర్చడానికి కృష్ణుడు ఉద్భవించాడు. పురాణ పురుషుడైన దేవదేవుడు మానవ రూపంలో ఉన్నందున ఎన్నో అపనిందలు భరించాడు. విజయ తీరాలకు చేరడానికి భక్తి మార్గమొక్కటే అని నిరూపించిన శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకల్లో వేలాది మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాం. మాకు చాలా ప్రత్యేకం : సుధాప్రజ్ఞ, విద్యార్థిని, అనంతపురం కృష్ణాష్టమి సందర్భంగా అనేక అనేక కోలాటాల్లో పాల్గొన్నాం. దానికి గుర్తింపుగా ఈనెల 15న మా బృందంతో కలిసి తిరుపతిలో ప్రత్యేక అవార్డు అందుకుంటున్నాం. దీంతో ఈకృష్ణాష్టమి మాకు ప్రత్యేకంగా నిలుస్తుందని భావిస్తున్నాం. -
ఆ నాలుగు చతుర్ముఖ పారాయణమే...
దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు పెద్దగా ప్రాచుర్యం లేదు. హైదరాబాద్‌లో మాత్రం గుజరాతీల ఇళ్లలో ఈ వేడుకలు నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. నాలుగు రోజులూ వారు సరదాగా, సందడిగా గడుపుతారు. జన్మాష్టమి రోజున ఉట్టెకొట్టడం, కోలాటాలు వంటి వేడుకలు గుజరాతీలకు, మన తెలుగువారికీ మామూలే. అయితే, షష్టి నుంచి నవమి వరకు సాగే వేడుకల్లో నాలుగు రోజులూ చతుర్ముఖ పారాయణం సాగించడం గుజరాతీల ప్రత్యేకత. జూదాన్ని సప్తవ్యసనాల్లో ఒకటిగా పరిగణిస్తాం. కానీ ఆ నాలుగు రోజులూ వారు చతుర్ముఖ పారాయణంలోనే పొద్దుపుచ్చుతారు. గుజరాతీల జన్మాష్టమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ ఇదే. మామూలు రోజుల్లో పిల్లలు పేక ముట్టుకుంటేనే మండిపడే పెద్దలు సైతం, జన్మాష్టామి వేడుకలు జరిగే నాలుగు రోజులూ పిల్లలతో కలసి పేకాడతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున పేకాడాలనే సనాతన ఆచారమేదీ లేకపోయినా, గుజరాతీలకు చాలాకాలంగా అదో ఆనవాయితీగా మారింది. ఆ నాలుగు రోజుల పేకాటల్లో కనీసం ఒకసారైనా గెలిస్తే, ఆ ఏడాదంతా వ్యాపారం వృద్ధి చెందుతుందని వారు విశ్వసిస్తారు. దక్షిణాదిన శ్రీకృష్ణ జన్మాష్టమికి పెద్దగా ప్రాచుర్యం లేదు. అయినా, హైదరాబాద్ నగరంలోని గుజరాతీల లోగిళ్లు జన్మాష్టమి వేడుకల్లో అంగరంగ వైభవంగా వెలిగిపోతుంటాయి. సంప్రదాయాలను అత్యంత భక్తిశ్రద్ధలతో పాటించే గుజరాతీల జన్మాష్టమి నాలుగు రోజుల పాటు సందడిగా జరుగుతాయి. షష్టి నుంచే సందడి మొదలు... నిత్యం వ్యాపార లావాదేవీల్లో తలమునకలుగా ఉండే గుజరాతీలు ఈ వేడుకలను అష్టమికి ముందుగా షష్టి నుంచే మొదలు పెడతారు. షష్టి రోజును ‘రాన్దన్ ఛట్’గా వ్యవహరిస్తారు. అది వంటలకు ప్రత్యేకించిన రోజు. రాన్దన్ అంటే వంట అని అర్థం. అష్టమికి ముందురోజైన సప్తమిని ‘శిత్లా సాతన్’గా వ్యవహరిస్తారు. ఆ రోజు వారు ఇంట్లో వంట చేయరు. ముందురోజు సిద్ధం చేసుకున్న పదార్థాలనే ఆరగిస్తారు. సప్తమి రోజు లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, పొయ్యినే సుఖాసనంగా చేసుకుని కొలువుదీరుతుందని నమ్ముతారు. సప్తమి రోజున దేవాలయానికి వెళ్లి, వేపచెట్టును పూజిస్తారు. శ్రీకృష్ణుడిని తలచుకుని, వేపాకును తాకితే ఆటలమ్మ (చికెన్‌పాక్స్) సోకదని నమ్ముతారు. మూడోరోజు శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. నవమిని ‘నోమ్’గా జరుపుకుంటారు. - గౌరీభట్ల నరసింహమూర్తి