సదస్సులో పాల్గొన్న ల్యాబ్ టెక్నీషియన్లు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతుందని పశు సంవర్ధక శాఖ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల ఆత్మీయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికో వెటర్నరీ ల్యాబ్ ఏర్పాటు చేసి డీఎంఎల్‌టీ అర్హత కలిగిన తమలాంటి వారికి ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమించారన్నారు.
ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. పశు సంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్ట్‌ను మరో రెండు సంవత్సరాలు పొడిగించిన సీఎం వైఎస్ జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సదస్సులో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్, కార్యదర్శి కె.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి, సంయుక్త కార్యదర్శి ఇజ్రాయేల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment