Veterinary Clinic
-
పశుపోషకులకు బాసటగా..
సాక్షి, అమరావతి: ఎవరైనా ఊహించారా మూగజీవాల కోసం అంబులెన్స్‌లు వస్తాయని, పాడి రైతు ఇంటి వద్దే ఆ మూగజీవాలకు వైద్యం అందుతుందని.. అయితే ఈ ఊహాతీతమైన విషయాన్ని నిజం చేసింది వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోకి తెచ్చి పాడి రైతులకు అండగా నిలిచింది. మూగజీవాలకు అత్యవసర సమయాల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో తీసుకొచ్చిన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ పశుపోషకులకు వరంగా మారాయి. 108 తరహాలోనే ఫోన్ చేసిన అరగంటలోనే పాడిరైతుల ఇంటి వద్దకు చేరుకుని వైద్యసేవలు అందిçస్తున్నాయి. పాడి రైతుల జీవనా«దారాన్ని నిలబెడుతున్నాయి. ఈ వాహనాలు రోడ్డెక్కి రెండేళ్లు కూడా పూర్తి కాకుండానే 8.81 లక్షల మూగజీవాలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలిగాయి. ఏపీలోని సంచార పశు వైద్య సేవలపై కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్ బృందాలు అధ్యయనం చేశాయి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వీటిని ప్రవేశపెడుతున్నారు. ఏపీలో సేవలను సమర్థంగా నిర్వహిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈఎంఆర్ఐ) గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థకే ఆ రెండు రాష్ట్రాలు వాహనాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఏపీ మోడల్లోనే పంజాబ్, కేరళ తదితర రాష్ట్రాల్లో మొబైల్ అంబులేటరీ వాహన సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.సకాలంలో వైద్యసేవలందించడమే లక్ష్యం..గతంలో పశువులకు అనారోగ్య సమస్య తలెత్తితే సుమారు 5 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉండే పశు వైద్యశాలలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. పాడి పశువులకు రైతుల ఇంటి ముంగిటే వైద్యసేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2022 మే 20వ తేదీన మొబైల్ అంబులేటరీ క్లినిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజకవర్గానికి 2 చొప్పున రూ. 210 కోట్లతో 340 అంబులెన్స్‌లను, ప్రత్యేకంగా 1962 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లో పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమో సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్లను అందుబాటులో ఉంచారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో సహా 33 రకాల పరికరాలతో కూడిన చిన్న ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రతీ వాహనంలో 51 రకాల వైద్య పరికరాలను ఉంచారు. ప్రథమ చికిత్సతో పాటు చిన్న తరహా శస్త్రచికిత్సలు, కృత్రిమ గర్భధారణ లాంటి సేవలకు ప్రతీ వాహనంలో రూ. 30 వేల విలువైన 81 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వాహనాల ద్వారా 295 పశువైద్యులు, 337 పశువైద్య సహాయకులు సేవలందిస్తున్నారు. పశువులను సమీప ఆస్పత్రులకు తరలించేందుకు వీలుగా వాహనంలో హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్య సేవల అనంతరం తిరిగి ఇంటి వద్దకే తీసుకొచ్చి అప్పగించేలా ఏర్పాటు చేయడంతో రైతులకు వ్యయ ప్రయాసలు, రవాణా భారం తొలగిపోయాయి. 1962 కాల్ సెంటర్‌కు నిత్యం సగటున 1778 ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఈ వాహనాలు మండలానికి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న 11,987 మారుమూల గ్రామాలకు చేరుకుని వైద్య సేవలందించాయి. సుమారు రెండేళ్లలో రూ. 24.48 కోట్ల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఫలితంగా ఇప్పటి వరకు 7,55,326 మంది పశుపోషకులకు జీవనోపాధిని కాపాడగలిగారు.⇒ బాపట్ల జిల్లా రామకృష్ణ నగర్‌కు చెందిన పి.వెంకటేశ్వర్లుకు ఆరు పాడి గేదెలున్నాయి. ఓ పశువు కొమ్ము విరిగిపోవడంతో తీవ్ర రక్తస్రావంతో కదల్లేని స్థితిలో కూలబడిపోయింది. ఉదయం 9.40 గంటలకు 1962కి కాల్ చేయగా 10.30 నిమిషాలకు అంబులెన్స్ ఇంటికే వచ్చింది. నొప్పి నివారణకు డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపట్లోనే కోలుకుని లేచి నిలబడగలిగింది. ఇప్పటివరకు మనుషుల కోసమే అంబులెన్స్ వస్తుందనుకున్నాం. మూగ జీవాలను సైతం సంరక్షిస్తూ ఉచితంగా మందులు కూడా అందించే సౌకర్యం కల్పించిన సీఎం జగన్‌కు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.నిజంగా గొప్ప ఆలోచన..నాకు ఐదు పాడి ఆవులున్నాయి. పశువులు కొట్లాడుకోవడంతో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. 1962కి ఫోన్ చేయగా గంటలో అంబులెన్స్ ఇంటికే వచ్చింది. గాయాన్ని శుభ్రం చేసి కుట్లు వేసి వైద్యం చేశారు. ఉచితంగా మందులిచ్చారు. గతంలో పశువైద్యశాలకు తరలించేందుకు ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. ఇంటి వద్దే జీవాలకు సేవలందించడం నిజంగా గొప్పఆలోచన. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. –కాటి విద్యాసాగర్, కోతపేట, బాపట్ల జిల్లాఅరగంటలోనే అంబులెన్స్..మాకు రెండు పాడి గేదెలు, నాలుగు సన్న జీవాలున్నాయి. మేతకు వెళ్లిన ఓ గేదెకు కాలు చీరుకుపోవడంతో నడవలేక పోయింది. 1962కు కాల్చేస్తే అరగంటలో అంబులెన్స్ వచ్చింది. పశువు కాలుకు డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ కట్టారు. నొప్పికి ఇంజక్షన్ ఇచ్చారు. హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా పశువుని తరలించే విధానం చాలా బాగుంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి రుణపడి ఉంటాం.– ఎం.అసిరిరెడ్డి, దళ్లిపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లామాబోటి రైతులకు ఎంతో మేలు..నాకు 12 ఆవులున్నాయి. ఓ ఆవు కడుపునొప్పితో చాలా ఇబ్బందిపడింది. 1962కి కాల్ చేశా. వెంటనే అంబులెన్స్ వచ్చింది. డాక్టర్ చికిత్స అందించారు. ఆవు కోలుకొని నిలబడేలా చేశారు. మొబైల్ వెటర్నరీ అంబులెన్స్‌ల ఏర్పాటు ఆలోచన చాలా బాగుంది. మాబోటి పేద రైతులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. – పర్రి ఉమా మహేశ్వరరావు, పర్రిపుత్రుగ, కవిటి మండలం, శ్రీకాకుళం జిల్లా -
నూతన ఒరవడి.. పశువిజ్ఞాన బడి
కడప అగ్రికల్చర్ : పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దీంతోపాటు పశువుల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది. ఇప్పటికే ఆర్బీకేల పరిధిలో సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలను అందిస్తోంది.ఆసుపత్రికి రాలేని స్థితిలో ఉండే గ్రామీణ ప్రాంత పశువులకు సైతం మెరుగైన వైద్యసేవందించాలనే లక్ష్యంతో సంచార పశు వైద్య శాలలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా మరింత భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం ‘పశువిజ్ఞాన బడి’ కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేస్తూ తద్వారా వేలాదిమంది రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించి పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. జిల్లాలో జూన్ నెల నుంచి... జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది జూన్ నుంచి పశువిజ్ఞాన బడులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని 414 రైతుభరోసా కేంద్రాల పరిధిలో ఉన్న 17 ప్రాంతీయ పశువైద్యశాలలు, 79 పశువైద్యశాలలు, 78 గ్రామీణ పశువైద్యశాలలు పరిధిలో పనిచేసే పశువైద్యులు, సహాయ సంచాలకులు జూన్ నుంచి నవంబర్ 10వ తేదీ నాటికి 721 పశు విజ్ఞాన బడులను నిర్వహించారు. వీటి ద్వారా దాదాపు 20 వేల మంది రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పశువిజ్ఞాన బడులను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, డివిజన్ డిప్యూటీ డైరెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఏ అంశాలపై అవగాహన కల్పిస్తారంటే.. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ఎలాంటి పశుగ్రాసాన్ని, పశుధాణాను వాడుకోవాలి. పాల ఉత్పత్తి పెంచుకునేందుకు ఎంతమేర పచ్చిమేత అవసరం, పశుగ్రాసాల సాగుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరిస్తారు. పాడి పశువులకు దాణామృతం, సమీకృత దాణా ఎలా ఇవ్వాలో కూడా అవగాహన కల్పిస్తారు. పాడి పశువుల్లో ఏడాదికి ఒక ఈత ఉండాలి. ఆప్పుడే పాడి పరిశ్రమలో రాణించే అవకాశం ఉంటుంది. ఈనిన దూడ కూడా ఆరోగ్యంగా వస్తుంది. పాడిపశువులకు సంబంధించి దూడల మరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తగ్గించేందుకు తీసుకోవాల్సిన సంరక్షణ పద్ధతుల గురించి తెలియచేస్తారు. కొన్ని ఆవులు, పశువులు యెదకు రాకుండా, చూలు కట్టకుండా ఉంటాయి. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేస్తారు శాస్త్రీయంగా గొర్రెలు, మేకలు పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. కోళ్ల పెంపకాన్ని ఎలా చేపట్టాలో కూడా అవగాహన కల్పిస్తారు. రైతులకు ఎంతో ప్రయోజనం జిల్లాలోని అన్ని మండలాల రైతు భరోసా కేంద్రాల పరిధిలో పశు విజ్ఞానబడి కార్యక్రమాన్ని పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. రైతులకు పాడి పరిశ్రమ అభివృద్ధి, పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్థిస్థాయిలో వారు అవగాహన కల్పిçస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన పశు సంరక్షక్ యాప్‌లో వారం వారం పొటోలు, హాజరైన రైతుల పేర్లు, వారి ఫోన్ నంబర్లను ఆప్‌లోడ్ చేయిస్తున్నాం. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. – శారదమ్మ, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి. -
వెటర్నరీ ల్యాబ్‌ల ఏర్పాటు ఘనత సీఎం జగన్‌దే
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): మూగజీవాలకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో వెటర్నరీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని పశు సంవర్ధక శాఖ ల్యాబ్ టెక్నీషియన్ల అసోసియేషన్ అధ్యక్షుడు డి.అశోక్‌కుమార్ అన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ల ఆత్మీయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికో వెటర్నరీ ల్యాబ్ ఏర్పాటు చేసి డీఎంఎల్టీ అర్హత కలిగిన తమలాంటి వారికి ల్యాబ్ టెక్నీషియన్లుగా నియమించారన్నారు. ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన సీఎం వైఎస్ జగన్‌కు తామంతా రుణపడి ఉంటామన్నారు. పశు సంవర్ధక శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్ట్‌ను మరో రెండు సంవత్సరాలు పొడిగించిన సీఎం వైఎస్ జగన్, మంత్రి సీదిరి అప్పలరాజు, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సదస్సులో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.రవీంద్రనాథ్, కార్యదర్శి కె.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగస్వామి, సంయుక్త కార్యదర్శి ఇజ్రాయేల్ పాల్గొన్నారు. -
అక్కడి వైద్యం..ఓ ధైర్యం
సాక్షి హైదరాబాద్(ఏజీవర్సిటీ): ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటున్న పప్పీకి గానీ..పిల్లికి గానీ అనారోగ్యం సోకితే.. మనం కనిపిస్తే చాలు కళ్లల్లో ఆనందం నింపుకొని గెంతులేస్తూ వచ్చి ఒళ్లో వాలిపోయే నోరు లేని ఆ జీవులు కదలకుండా కూర్చుంటే..మనసు కీడు శంకిస్తుంది..వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని పోరుపెడుతుంది. అప్పుడే మనకు అసలు సమస్య ఎదురవుతుంది. చికిత్సకోసం ఎక్కడికి తీసుకెళ్లాలని? అటువంటి వారికోసమే సేవలందిస్తోంది రాజేంద్రనగర్‌లోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి. కుక్క..కోడి..పిల్లి..మేక..ఏదైనా సరే మేం వైద్యమందిస్తామని గర్వంగా చెబుతున్నారు అక్కడి వైద్యులు. మేకలు, పిల్లులకు ఉచితమే... వెటర్నరీ ఆసుపత్రిలో మేకలు, పిల్లులు, గెదే, గొర్రె, ఆవు తదితర వాటన్నిటికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ల బృందం ఆసుపత్రికి వచ్చిన ప్రతి జంతువుకు మొదట దాని జాతి, బరువు, జ్వరం తదితరాలు నమోదు చేస్తారు. అనంతరం వ్యాధికి సంబంధించిన డాక్టర్ వద్దకు పంపించి పరిశీలించి అనంతరం సూదులు, మందులు ఉచితంగా అందజేస్తారు. కుక్కలు, కుందేలు, గుర్రాలు, చిన్న జీవులు తదితర వాటిని రూ. 20 ఫీజులు వసూలు చేస్తున్నారు. అధునాతన పరికరాలు ఎలాంటి అనారోగ్యాలపాలైన బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఆసుపత్రికి ప్రతి రోజు 200 వరకు రకరకాల జంతువులను చికిత్స కోసం తీసుకువస్తారు. ఆసుపత్రిలో అధునాతనమైన పరికరాలు ఉన్నాయి. అల్ట్రాసౌండ్, స్కానింగ్, ఎక్స్‌రే తదితర పరికరాలు ఉన్నాయి. మాతో పాటు మా సిబ్బంది, పీజీ విద్యార్థులు ఎల్లవేళల అందుబాటులో ఉంటాం. – అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌సింగ్ 30 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాం.. మా తాతముత్తాతల నుంచి రకరకాల మేకలను మేము పెంచుతున్నాం. ఈ మేకలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడికే వచ్చి వైద్యం చేయిస్తాం. ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదు. ఉచితంగానే వైద్యంతో పాటు మందులు కూడా ఇస్తారు. మా ఇంటి ఆసుపత్రికి రావడానికి సుమారు 30 కిలోమీటర్లు అవుతుంది. అయినా మంచి వైద్యం అందుతుంది కాబట్టి ఇక్కడికే వస్తున్నాం. – మహ్మద్ ఇబ్రహీం, మొఘల్‌పురా త్వరలో నూతన భవనం ప్రారంభం ఇక్కడ 55 సంవత్సరాలనుంచి సేవలందిస్తున్నాం. కొన్ని మూగ జీవాలకు తక్కువ ఫీజు తీసుకుంటాం. చాలావాటికి ఉచితంగా సేవలందిస్తాం. ఇప్పటికి లక్షలాది జీవులకు ప్రాణం పోశాం. ఆసుపత్రి భవనం సరిపోవడం లేదని ప్రభుత్వానికి సూచించడంతో రూ. 11 కోట్ల తో అధునాతన హంగులతో నూతన భవనం నిర్మించాం. త్వరలో ప్రారంభిస్తాం. జరుగుతుంది. – రవీందర్‌రెడ్డి, వైస్ ఛాన్సలర్ -
మహిళలను కొట్టిన నటుడి కూతురు
ముంబై : ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కుమార్తె హీబా షా.. మహిళా ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశారు. ఈ నెల 16న హీబా షా తన స్నేహితురాలికి చెందిన రెండు పిల్లులను స్టెరిలైజేషన్(శస్త్ర చికిత్స) కోసం ముంబైలోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లారు. అక్కడ పనిచేసే మహిళా సిబ్బంది ఆమెను వేచి ఉండమని చెప్పగా.. అసహనానికి గురైన హీబా ఇద్దరు మహిళలను కొట్టారు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అవ్వడంతోఆమె అడ్డంగా దొరికి పోయారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై షీబాకు వ్యతిరేకంగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. Mumbai's Versova police have registered a non-cognizable offence against actress Heeba Shah (daughter of actor Naseeruddin Shah) for allegedly assaulting 2 employees of a veterinary clinic on January 16. pic.twitter.com/M2u4rdgGTL — ANI (@ANI) January 25, 2020 ఆస్పత్రి చైర్మన్ మాట్లాడుతూ.. ‘నటి హీబా షా స్టెరిలైజేషన్ కోసం రెండు పిల్లులతో తమ వెటర్నరీ క్లినిక్‌కు వచ్చారు. పిల్లులకు స్టెరిలైజేషన్ జరిగిందని, తమ సిబ్బంది ఆమెను అయిదు నిమిషాలు వేచి ఉండమని కోరారు. రెండు మూడు నిమిషాలు వేచి ఉండి.. అంతలోనే ఆమె మా సిబ్బందిపై దూకుడుగా ప్రవర్తించారు. నేను ఎవరో మీకు తెలియదా? ఎవరో తెలియకుండానే మీరు నన్ను ఇంతసేపు బయట వేచి ఉంచుతారా అంటూ ఆసుపత్రి మహిళా సిబ్బందిపై దాడి చేశారు’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై స్పందించిన హీబా.. ఆసుపత్రి ఉద్యోగులను కొట్టినట్లు అంగీకరించారు. అయితే ముందుగా ఆసుపత్రి సిబ్బందే తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆరోపించారు. క్లినిక్‌కు వెళ్లినప్పుడు తన వద్ద అపాయింట్మెంట్ ఉందని చెప్పినా కూడా వాచ్మెన్ లోపలికి అనుమతించలేదని, అనేక ప్రశ్నలు అడిగాడని తెలిపారు. లోపలికి వచ్చాక సిబ్బంది కూడా తనతో అసభ్యంగా మాట్లాడారని.. అక్కడున్న మరో మహిళ తనను ఆసుపత్రి నుంచి బయటకు వెళ్లిపోవాలని నెట్టేసిందని పేర్కొన్నారు. క్లినిక్‌కు వచ్చిన వారితో ప్రవర్తించే విధానం ఇది కాదని, మర్యాదగా మాట్లాడాలని హీబా షా సూచించారు. -
ప్రారంభమెన్నడో..?
నల్లగొండ అగ్రికల్చర్ : పశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిల్లా కేంద్రంలో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి నిర్మాణం పూర్తయి ఏడాది కావస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. జిల్లాలోని పాడిగేదెలు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, కుక్కలను నిత్యం వైద్యసేవల కోసం ఆస్పత్రికి తీసుకువస్తుంటారు. ఇంతకాలం సరైన సౌకర్యాలు లేకపోవడంతో సేవలు సరిగా అందించలేక సిబ్బంది ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో బహుళార్థక పశు వైద్యశాల నిర్మాణానికి 2016లో ఆర్ఐడీఎఫ్ పథకం కింద రూ. ఐదు కోట్ల నాబార్డ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మూడంతస్తుల్లో అన్ని హంగులతో కూడిన భవనాన్ని నిర్మించడంతోపాటు, ఆధునిక పరీక్షల కోసం ఎక్స్‌రే, ఈసీజీ, ల్యాబ్, ఆపరేషన్ థియేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. ఇన్‌పేషెంట్, అవుట్ పేషెంట్ విభా గాలను నిర్మించారు. చిన్న, పెద్ద జంతువులకు అన్ని రకాల వైద్యసేవలను అందించడంతోపాటు ఇన్‌పేషెంట్ సేవలకు అవసరమైన సిబ్బందిని సైతం నియమించారు. ఆపరేషన్ థియేటర్‌కు పశువులను తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఏర్పాటు కోసం అవసరమైన నిధులను మంజూరు చేశారు. చర్యలు తీసుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా తెల్ల పశువులు 1.20 లక్షలు, నల్ల పశువులు 4.10 లక్షలు, మేకలు, గొర్రెలు 12 లక్షలు, కోళ్లు మూడు కోట్లు, పెంపుడు కుక్కలు 12 వేల వరకు ఉన్నాయి. ఈ ఆస్పత్రిని ప్రారంభిస్తే వాటన్నింటికి కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అం దే అవకాశం ఉంటుంది. కానీ నిర్మాణం పూర్తయినా ఆస్పత్రిని ప్రారంభించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకొని పశు వైద్యశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. భవనాన్ని అప్పగించగానే ప్రారంభిస్తాం బహుళార్ధ పశువైద్యశాల నిర్మాణ పనులను పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేశారు. భవన నిర్మాణం పూర్తి కాగానే మాకు అధికారికంగా అప్పగించాలి. కానీ ఇప్పటివరకు భవనాన్ని అప్పగించలేదు. అప్పగించిన వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి ప్రారంభమైతే జిల్లాలోని మూగజీవాలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.– డాక్టర్ శ్రీనివాస్‌రావు, ఇన్చార్జి జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ అధికారి -
పది రోజుల్లో 459 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: పది రోజుల్లో 459 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. పశువైద్యశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కోసం రూ.20 కోట్లు కేటాయించామన్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాల ని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో సంచార పశువైద్యశాలల నిర్వహణపై పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, జీవీకే ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సంచార పశువైద్యశాలల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.83 లక్షల తో కొత్తగా 20 మంది ఆపరేటర్లను నియమిస్తున్నా మన్నారు. 1962 టోల్‌ఫ్రీ నంబర్‌తో సంచార పశు వైద్యశాలల ద్వారా జీవాల వైద్యసేవల కోసం 10 మంది ఆపరేటర్లను నియమించుకున్నామని, దీని ద్వారా ప్రతిరోజూ 1,400 కాల్స్ వస్తున్నాయని, ఇందులో 500 ఫిర్యాదులపై స్పందించి అవసరమైన జీవాలకు వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ సేవలు పెంపు 20 మంది ఆపరేటర్ల సేవలను వచ్చే నెల 10 నుంచి ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. సామర్థ్యం పెంపుతో నిత్యం 5 వేల కాల్స్‌ను తీసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ప్రస్తుతం 1962 సేవలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు అందిస్తున్నామని, వీటిని ఉదయం 7కి ప్రారంభించి సాయం త్రం 5 వరకు కొనసాగించాలని ఆదేశించినట్టు తెలిపారు. 1962 వ్యవస్థను నిత్యం పర్యవేక్షించేందుకు తమ కార్యాలయంతో పాటు పశుసంవర్థకశాఖ కార్యదర్శి, డైరెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బందిని నియమించి ఒక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించానన్నారు. 100 సంచార పశువైద్యశాలలకు అదనంగా మరో 100 వాహనాల కొనుగోలుకు బడ్జెట్ కేటా యించాలని సీఎంకు విజ్ఞప్తి చేశామన్నారు. -
పశువైద్యాధికారికి బదులుగా...
ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడని అనుకుంటే పొరపాటు పడినట్టే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్యకేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు. ఇక్కడ ఓ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదు. అంటూ తప్పించుకున్నారు. కాగా ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు. -
మన పశువైద్యం అంత ‘సేఫ్’ కాదా!?
పశు వైద్యశాలల్లో నాసిరకం యాంటీబయాటిక్స్ మందులు సాక్షి, అమరావతి: రైతుకు బర్రె, గొర్రె జీవనాడి. వ్యవసాయం భారంగా మారిన పరిస్థితుల్లో ఏ పల్లెలో చూసినా పాడి మీదే ఆధారపడి జీవిస్తున్న ఘటనలు కోకొల్లలు. అలాంటి గొర్రెకు, బర్రెకు జబ్బుచేస్తే వేసే మందులు కూడా నాసిరకమైనవైతే రైతు నడ్డి విరిగినట్టే. స్వయానా ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవిస్తున్నవారే ఇలాంటి నాసిరకం మందులు తయారు చేసి, అమ్ముతున్నారంటే.. ఎం త దారుణం. అధికారంలో ఉన్నాం, మా కంపెనీల జోలికొస్తే, మా మందులను ప్రశ్నిస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరిస్తుండటంతో అధికారులు సైతం నోరు మెదపడంలేదు. ‘సాక్షి’ పరిశీలనలో విస్మయపరిచే అంశాలు దృష్టికి వచ్చాయి. నాసిరకం యాంటీబయాటిక్స్ పశువులకు జబ్బుచేస్తే మనుషులకు లాగే తక్షణమే యాంటీబయాటిక్స్ వాడతారు. ప్రస్తుతం పశువు లకు వాడే యాంటీబయాటిక్స్‌లో ఆక్సీటెట్రాసైక్లిన్ అనేది చాలా ప్రధానమైనది. ఈ మందును ‘సేఫ్’ కంపెనీ తయారు చేసి, ప్రభుత్వ పశువైద్యశాలలకు సరఫరా చేసింది. పారదర్శకంగా ఉండాల్సిన ఈ యాంటీబయోటిక్ ద్రావణం రాగిజావలాగా ఉండటంతో తూర్పుగోదావరి, చిత్తూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాలోని సహాయ సంచాలకులు ఆ మందుల బాటిళ్లను జూన్‌లోనే జాయింట్ డైరెక్టర్లకు పంపించారు. కానీ జాయింట్ డైరెక్టర్లు వాటిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. సేఫ్ కంపెనీ తయారుచేసిన ఆక్సీ టెట్రాసైక్లిన్ మందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో సరఫరా చేసినప్పుడు కూడా కర్నూలులో నాసిరకం అని తేలింది. దీనిపై పత్రికల్లో వార్తలు సైతం వచ్చాయి. ఆ తర్వాత సేఫ్ కంపెనీ యాజమాన్యం రంగంలోకి దిగి ఎలాంటి చర్యలూ లేకుండా చేసుకోగలిగింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన ఔషధ నియంత్రణ శాఖ కనీసం ఈ ఫిర్యాదులపై కన్నెత్తికూడా చూడటం లేదు. సేఫ్ కంపెనీ కోసం మార్కెట్ స్టాండింగ్ నిబంధన ఎత్తివేత ఒక కంపెనీనుంచి ఏ మందునైనా కొనాలంటే కనీసం మూడేళ్ల మార్కెటింగ్ స్టాండింగ్ సర్టిఫికెట్ ఉండాలి. కానీ సేఫ్ కంపెనీ వ్యాపారంలోకి ప్రవేశించాక ఆ నిబంధన ఎత్తేశారు. అంతేకాదు... గతంలో డీవార్మింగ్ మందులను రూ.230కి ఒక కంపెనీ సరఫరా చేసేది. దానినుంచి ఈ ఆర్డరు లాక్కుని సేఫ్ కంపెనీకి రూ.430కి ఇచ్చారు. మరో ఎమ్మెల్యే కంపెనీ ఉత్పత్తి కూడా నాసిరకమే గుంటూరు జిల్లాకు టీడీపీ ఎమ్మెల్యే కంపెనీకి సంబంధించిన ఇంజక్షన్లు నాసిరకం అని తేలాయి. అభినందన అగ్రొవెట్ ఇండియా పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విన్ (ఎన్రోఫ్లాక్సిసిన్) ఇంజ క్షన్లను ప్రభుత్వ పశువైద్యశాలలకు పంపించారు. ఈ మందుకూడా యాంటీబయాటిక్స్ ఇంజక్షనే. ఈ ఇంజక్షన్‌ను కూడా ‘సేఫ్’ కంపెనీలోనే తయా రు చేయించారు. కాగా ఈ ఇంజక్షన్ నాసిరకం అని (బ్యాచ్ నెం.050516) ఔషధ నియంత్రణ శాఖ తేల్చింది. ఇలా నాసిరకం మందులను తయారు చేసిన కంపెనీల జాబితాను ఔషధ నియంత్రణ శాఖ వెబ్సైట్లో కూడా పెట్టింది.అయినా ఎవరూ పట్టించుకోక పోవడం విశేషం. నా దృష్టికి రాలేదు తూర్పుగోదావరి జిల్లాలో ఆక్సీ టెట్రాసైక్లిన్ ఇంజక్షన్లపై ఎలాంటి ఫిర్యాదులూ మా శాఖ దృష్టికి రాలేదు. అలాంటి ఫిర్యాదులు వస్తే తప్పకుండా పరిశీలిస్తాం. í –మూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్, ఔషధ నియంత్రణశాఖ, తూర్పుగోదావరి జేడీకి ఇప్పటికే పంపించాం ఆక్సీటెట్రా సైక్లిన్ ఇంజక్షన్లపై ఇప్పటికే జాయింట్ డైరెక్టర్లకు పంపించాం. ఆ మందుల్లో నాణ్యత కొరవడిందనే ఉద్దేశంతోనే నాణ్యతా పరీక్షలకు ఆదేశించాలని పంపించాం. ఇంతవరకూ రిపోర్టులు రాలేదు. –డాక్టర్ వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ, రాజమండ్రి మాకు తెలియనే తెలియదు అసలు ఇలాంటి మందులు సరఫరా చేసినట్టు మాకు తెలియనే తెలియదు. సరఫరా అయిన మందులను తెప్పించుకుని ఔషధ నియంత్రణ శాఖకు పంపిస్తాం. –డాక్టర్ సోమశేఖర్, సంచాలకులు, పశు సంవర్ధకశాఖ, ఏపీ -
పశువైద్యశాలలకు పక్కా భవనాలు
హైదరాబాద్: పశు వైద్యశాలలకు ప్రభుత్వ పక్కా భవనాలు నిర్మిస్తామని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పశు సంపద ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పశు సంపద ఆరోగ్య రక్షణకు పలు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,117 పశు వైద్యశాలలు పని చేస్తున్నాయని చెప్పారు. త్వరలోనే సంచార పశు వైద్యశాలలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏప్రిల్ చివరి నాటికి వచ్చే ఈ వాహనాలు పశువులకు అత్యవసర సేవలను అందిస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున కేటాయిస్తామని చెప్పారు. జీవాల మీద ఆధారపడిన రైతులను తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే పశు సంవర్ధక శాఖలో 161 పోస్టులను పబ్లిక్ కమిషన్ ద్వారా భర్తీ చేశామని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. -
వేలం వెనుక మతలబు!
► పశు వైద్యశాల స్థల విక్రయ పంచాయితీ ► టీడీపీలో మళ్లీ నేతల మధ్య వివాదం ► భూమా నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత ► ఇదే బాటలో అన్ని పార్టీల నేతలు ► అధికారులు కూడా ససేమిరా.. ► ముఖ్యమంత్రిని కలిసే యోచనలో శిల్పా. టీడీపీలో మళ్లీ చిచ్చు రగులుతోంది. ముఖ్యమంత్రి పిలిచి సయోధ్య కుదిర్చినా.. ఏదో ఒక రూపంలో నేతల మధ్య వివాదం బయటపడుతోంది. తాజాగా పశు వైద్యశాల స్థల విక్రయం వివాదాస్పదమవుతోంది. భూమా దూకుడును.. శిల్పా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పార్కింగ్ స్థలం చేద్దామన్న నేత.. ఇప్పుడు విక్రయానికి సిద్ధపడటం స్థానికుల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. సొంత పార్టీతో పాటు మిత్ర పక్షం.. వామపక్షాలు కూడా ఈ విషయంలో భూమా నిర్ణయంపై భగ్గుమంటున్నారు. నంద్యాల: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుటనున్న పశు వైద్యశాల స్థలం రాజకీయ వివాదానికి కేంద్రంగా మారుతోంది. ఒకరు అమ్మేద్దామంటే.. మరొకరు వద్దని వారించడం కొత్త సమస్యను తెరమీదకు తీసుకొస్తోంది. 1931లో బ్రిటీష్ ప్రభుత్వం 2.50 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ వైద్యశాల నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, ఆత్మకూరు ప్రాంతాల రైతులకు చెందిన పశువులకు సేవలందిస్తోంది. ఆసుపత్రి చుట్టూ ఆర్టీసీ బస్టాండ్.. షాపింగ్ కాంప్లెక్స్.. లాడ్జీలు.. పెట్రోల్ బంకులు.. బ్యాంకులు ఏర్పాటు కావడంతో ఇక్కడి స్థలానికి డిమాండ్ పెరిగింది. పశు సంవర్ధక శాఖ అధికారుల అంచనా రూ.10 కోట్లు కాగా.. బహిరంగ మార్కెట్లో రూ.25 కోట్లకు పైమాటే. గత ఏడాది రూ.కోటితో డివిజన్ స్థాయి పశు సంవర్ధక శాఖ కార్యాలయంతో పాటు శిక్షణ కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమైంది. మిగిలిన 1.30 ఎకరాల ఖాళీ స్థలం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో స్థలాన్ని బహిరంగ వేలంలో విక్రయించి.. ఆ డబ్బును అభివృద్ధికి ఉపయోగిద్దామంటూ ప్రభుత్వానికి ఈ నెల 23న ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి లేఖ రాశారు. అయితే గతంలో ఆయన ఈ స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించాలని వాదించారు. బస్టాండ్ ప్రాంతంలో రోడ్ల పైనున్న ఆటోలను ఇక్కడ పార్కింగ్ చేయిస్తే ట్రాఫిక్ సమస్యకు కాస్తయినా పరిష్కారం లభిస్తుందని చెప్పిన ఆయన పార్టీతో పార్టీ స్వరం కూడా మార్చేయడం స్థానికుల్లో చర్చకు తావిస్తోంది. ఎమ్మెల్యే లేఖను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈనెల 24న జిల్లాలోని పశుసంవర్ధక శాఖ అధికారులకు పంపి నివేదిక కోరగా.. ఆ నిర్ణయం సరికాదంటూ వ్యతిరేకించినట్లు సమాచారం. విక్రయం వద్దే వద్దు పశు వైద్యశాల విక్రయ ప్రతిపాదనపై రాజకీయ పార్టీలు, వాపక్షాలు, మేధావుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. ప్రస్తుత పశువైద్యశాలను పట్టణానికి దూరంగా ఉన్న వైఎస్ నగర్‌కు తరలిస్తే.. రైతులకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. అదేవిధంగా ప్రభుత్వం బహిరంగ వేలంలో స్థలాన్ని విక్రయానికి ఉంచితే.. బడా నేతలు చేతులు కలిపి కారుచౌకగా సొంతం చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బేరసారాలు.. బెదిరింపులు మామూలే. అందువల్ల ఎంతో విలువైన స్థలాన్ని విక్రయించే ప్రతిపాదన వద్దే వద్దని బీజేపీ మాజీ కౌన్సిలర్ మేడా మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఊకొట్టు వాసు, సీపీఎం డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి, సీపీఐ పట్టణ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, రోడ్ల విస్తరణ పోరాట సమితి కన్వీనర్ శంకరయ్య తదితరులు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి.. ఎమ్మెల్యే భూమా ప్రతిపాదనను పార్టీలోని ప్రత్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులు చేయాలంటే.. ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలని, ఆస్తులను అమ్మడం సరికాదని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. స్థల విక్రయానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నందున.. నేరుగా చంద్రబాబు నాయుడునే కలిసి అభ్యంతరం తెలపాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అభ్యంతరం ఎందుకంటే.. భవిష్యత్‌లో నంద్యాల జిల్లాగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పశువైద్యల శాల స్థలాన్ని డిమాండ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ రూ.25 కోట్లకు పైమాటే. భూమా ప్రతిపాదన మేరకు.. స్థలానికి బహిరంగ వేలం నిర్వహిస్తే అనుకూలురు దక్కించుకునే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదీ కాకుండా నేతలు రంగంలోకి దిగితే.. స్థలం రూ.5 కోట్లకు మించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండదనేది జగమెరిగిన సత్యం. -
వైద్యుల కొరత.. సేవల వెత
పశువైద్య శాలల్లో వైద్యుల పోస్టులు ఖాళీ మొక్కుబడిగా అందుతున్న వైద్య సేవలు పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం అయోమయంలో పశు పోషకులు జహీరాబాద్: పశు సంవర్ధక శాఖ జహీరాబాద్ సబ్ డివిజన్ పరిధిలో పశువైద్య పోస్టులు ఖాళీగా ఉండడంతో పశువులకు మొక్కుబడిగానే వైద్య సహాయం అందుతోంది. పోస్టులను భర్తీ చేసే విషయంలో ప్రభుత్వం, అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడంతో పశు పోషకుల పాలిట శాపంగా మారింది. సబ్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 11 పశు వైద్య శాలలకు వైద్యులు లేరు. దీంతో సిబ్బందే పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని చిరాగ్పల్లి పశు వైద్య శాల వైద్యుడు పటాన్‌చెరుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో పశువైద్య శాలలో సిబ్బంది వైద్యం అందిస్తున్నందున తగిన వైద్య సేవలు అందడం లేదని పరిసర గ్రామాల పశు పోషకులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోహీర్ మండలంలోని దిగ్వాల్ గ్రామ పశువైద్యుడు దీర్ఘకాలిక సెలవులో ఉన్నందున సిబ్బందితోనే సరిపెడుతున్నారు. ఝరాసంగం మండలంలోని జీర్లపల్లి పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేశారు. అయినా అక్కడ ఇంత వరకు వైద్యుడిని నియమించలేదు. డాక్టర్ పోస్టు మంజూరైనా రెండు సంవత్సరాలుగా భర్తీ చేసే విషయంలో జాప్యం జరుగుతోంది. న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్‌లో గత ఏడాదిగా డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. అయినా పోస్టును భర్తీ చేసే విషయంలో అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని పశు పోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాల్కిలో పశువైద్య శాలను అప్ గ్రేడ్ చేయడంతో ఆస్పత్రి స్థాయి పెరిగింది. అయినా రెండేళ్లుగా పోస్టును భర్తీ చేసే విషయంలో ఎవరూ పట్టించుకోని పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలోని బోరంచ పశువైద్య శాలలో ఏకంగా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టు ఖాళీగానే ఉంది. భర్తీ చేసేందుకు గాను ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. నాగల్గిద్దలో సైతం ఇదే పరిస్థితి ఉంది. అక్కడ కూడా దశాబ్ద కాలంగా వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. కసర్‌గుత్తిలో పశువైద్య శాలను అప్‌గ్రేడ్ చేసి రెండు సంవత్సరాలు అయింది. ఇంత వరకు వైద్యుడి పోస్టును భర్తీ చేయలేదు. నారాయణఖేడ్ మండలంలోని రుద్రార్ గ్రామంలో గల పశువైద్య శాల అప్‌గ్రేడ్ అయింది. రెండు సంవత్సరాలు గడుస్తున్నా వైద్యుడిని నియమించలేదు. కంగ్టి పశువైద్య శాలలో నాల్గేళ్లుగా, కల్హేర్‌లో ఏడాదిగా, సిర్గాపూర్‌లో దశాబ్దంగా పశు వైద్యుల పోస్టులను భర్తీ చేయడం లేదు. సబ్ డివిజన్ పరిధిలో ఎల్ఏఎస్ పోస్టులు 9, వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులు 15, అటెండర్ పోస్టులు 10 వంతున ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టులను భర్తీ చేసే విషయంలో సంబంధిత శాఖ అధికారులు ఉదాసీన వైఖరిని అవలంబిస్తుండడం పశు పోషకుల పాలిట శాపంగా మారింది. పశు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్న వైశ్య శాలల్లో జేవీఓ, ఎల్ఎస్ఏలు వైద్య సేవలందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఖాళీగా ఉన్న వైద్య పోస్టులతో పాటు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయించి పశువులకు మెరుగైన వైద్య సేవలందించే విధంగా చర్యలు చేపట్టాలని పశు పోషకులు కోరుతున్నారు. -
ముప్పు ‘కప్పు’రంబు!
జగ్గంపేటలో శిథిలమైన పశువైద్యశాల నాలుగేళ్లుగా బిక్కుబిక్కుమంటూ సిబ్బంది సేవలు ప్రారంభం కాని నూతన భవనం జగ్గంపేట (తూర్పుగోదావరి జిల్లా): గతమెంతో ఘనం... ప్రస్తుతం హీనం... ఇదీ జగ్గంపేట పశువుల ఆస్పత్రి పరిస్థితి. భవనం నిర్మించినా అది ప్రారంభం కాకపోవడం, సిబ్బంది అంతంతమాత్రంగా ఉండడంతో ఇక్కడ పశు వైద్యసేవలు అందడం లేదు. దీంతో పాడి రైతులు నానాఅవస్థలు పడుతున్నారు. పెంకుల భవనంలో... నియోజకవర్గ కేంద్రం జగ్గంపేట పశువులాస్పత్రి భవనం భయపెడుతోంది. ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పెంకుల భవనంలోనే వైద్య సిబ్బంది సేవలందిస్తున్నారు. పెంకులు ఒక్కొక్కటిగా కిందకి జారిపోయి, పైకప్పు ఊడిపోయి, గోడలు బీటలు వారాయి. సుమా రు నాలుగేళ్ల క్రితం ప్రస్తుత కాకినాడ ఎంపీ, అప్పట్లో ఎమ్మెల్యే హోదాలో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అయితే భవన నిర్మాణ పనులు పలు సార్లు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టగా నిధుల విడుదలలో జాప్యం నెలకొంది. దీంతో ఎస్టిమేషన్ రేట్లతో సంబంధిత కాంట్రాక్టర్ నిర్మాణం పనులను ఉపసంహరించుకున్నారు. సుమారు నాలుగేళ్లు సాగిన నూతన భవనం నిర్మాణ పనులు మరో కాంట్రాక్టర్ ద్వారా రివైజ్డ్ ఎస్టిమేషన్లతో చేపట్టారు. ఇంతా చేస్తే ఆ భవనం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. గత వైభవం కోల్పోయి... గతంలో జగ్గంపేట పశువులాస్పత్రికి పెద్ద పేరుండేది. గ్రామంలోని రైతులుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలను తీసుకువచ్చి వైద్యం చేయించేవారు. ముఖ్యంగా చూడి పశువులకు వైద్య సేవలతో పాటు ఎదకు రాని గేదెలకు పరీక్షలు చేశారు. అలాగే గొర్రెలు, మేకలకు నత్తల నివారణ మందులు వేసేవారు. ఇక్కడ పనిచేసే వైద్యుడికి బదిలీ కావడం.. ఆయన స్థానంలో వైద్యుడు చాలా కాలం రాకపోవడంతో కేవలం కాంపౌండర్ మాత్రమే సేవలందించేవాడు. ఇటీవల అతడు కూడా బదిలీ అయ్యాడు. రెండు రోజుల క్రితం సత్యనారాయణ అనే వైద్యుడు విధుల్లోకి చేరారు. పూర్వ వైభవం తీసుకురావలసిన బాధ్యత ఆయనపైనే ఉందని రైతులు పేర్కొంటున్నారు.