సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు మళ్లినట్లు పేర్కొంది. మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని, రేపు సాయంత్రం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా ఆంధ్రలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీగా వాన కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కాగా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే సూచనలు ఉన్నందున, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ అయ్యాయి.(చదవండి: మధ్య బంగాళాఖాతంలో "అల్పపీడనం")
Comments
Please login to add a commentAdd a comment