– మార్గదర్శి ద్వారా బాబు అండ్ కో నల్లధనం చలామణి
– అందుకే డిపాజిటర్ల వివరాలు వెల్లడించని రామోజీ
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ అనే బోర్డు ఉంటుంది... కానీ ఎక్కడా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే బోర్డు మాత్రం ఉండదు. అయినా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లోనే గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థను రామోజీరావు నిర్భయంగా నిర్వహించారు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు దశాబ్దాలపాటు ససేమిరా అన్నారు. కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు.
డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కానీ 2008లో సమరి్పంచిన అఫిడవిట్‌లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్‌వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అన్నారు.
అక్రమాల సినిమాలో త్రిపాత్రాభినయం
– హెచ్‌యూఎఫ్ కర్త, ప్రొప్రైటర్, చైర్మన్ పేరుతో కనికట్టు
– ఆర్‌బీఐని బురిడీ కొట్టించి అక్రమ డిపాజిట్ల దందా
సాక్షి, అమరావతి: చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్ము దోచుకునేందుకు చెరుకూరి రామోజీరావు ఏకంగా త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్‌బీఐకి మస్కా కొట్టారు. అక్రమంగా డిపాజిట్ల దందా సాగించారు.
డిపాజిట్ పత్రాలపై హెచ్‌యూఎఫ్ కర్తగా: మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్‌దారులకు పత్రాలను జారీ చేసింది. ఆ పత్రాలపై తనను తాను ‘హెచ్‌యూఎఫ్ కర్త’ అని పేర్కొంటూ రామోజీరావు సంతకం చేశారు.
చెక్కులపై ప్రొప్రైటర్‌గా...: మార్గదర్శి ఫైనాన్సియర్స్ చెక్కుల దగ్గరకు వచ్చేసరికి రామోజీరావు ‘ప్రొప్రైటర్’గా మారారు. అక్రమ డిపాజిట్లను కాలపరిమితి తరువాత ఇచ్చే చెక్కులపై ఆయన ‘ప్రొప్రైటర్’ అని సంతకం చేశారు.
బోర్డు మీటింగ్‌లో చైర్మన్‌గా..
మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగ్‌ల విషయం వచ్చేçÜరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగ్ మినిట్స్ బుక్‌లోనూ, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని పేర్కొంటూ సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment