illegal Transport
-
రేషన్ బియ్యం తరలింపు వెనుక టీడీపీ మాఫియా
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పేదలకు అందాసన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఎగుమతులు జరుపుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటాను. కేసును సీఐడీకి ఇవ్వాలా, సీబీఐకి అప్పగించాలా అన్నది కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం’ శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతులను పరిశీలించాక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పిన మాటలివి. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యాన్ని పేదల నుంచి అక్రమంగా సేకరిస్తూ విదేశాలకు రవాణా చేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవాలి.మాఫియా వెనుక చక్రం తిప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను కట్టడి చేయాలి. అవన్నీ వదిలేసి పోర్టుకెళ్లి బియ్యం అక్రమ రవాణా అంటూ పవన్‌కళ్యాణ్ హంగామా చేయడాన్ని చూసి టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని కాజేస్తున్న పచ్చనేతల సంగతి వదిలేసి తమ పార్టీ అధినేత కాకినాడ పోర్టులో చేసిన విన్యాసాలు అర్థంగాక జనసేన శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.నియోజకవర్గాల వారీగా సేకరించి..పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యాన్ని సేకరించి ఇడుపులపాడు ప్రాంతంలోని ఒక రైస్ మిల్లులో రీసైక్లింగ్‌చేసి అక్కడి నుంచి బియ్యాన్ని అద్దంకి కేంద్రంగా ఉన్న మాఫియాకు అందిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి మొత్తం బియ్యాన్ని సేకరించి వాటిని మంత్రి అనుచరులకు అప్పగిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లి, రైల్‌పేట, అప్పికట్లకు చెందిన కొందరు రైస్ మిల్లుల యజమానులే నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని అద్దంకి మాఫియాకు అప్పగిస్తున్నారు.వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోలుకు చెందిన నేత రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున పచ్చనేతలకు బియ్యం సేకరణ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నం మండలానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుడు బియ్యం మాఫియాను నడిపిస్తున్నాడు. పల్నాడు జిల్లా నుంచి సైతం చౌక బియ్యాన్ని సేకరించి అద్దంకికి తరలిస్తున్నారు. రీసైక్లింగ్ అనంతరం కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు.మంత్రి ఇలాకా నుంచే..బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలే అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధాన అనుచరుడితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత కలిసి అక్రమ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల కార్డుదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి బియ్యాన్ని సేకరిస్తున్న మాఫియా చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాక్ పాయింట్ల నుంచే బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యం సేకరిస్తున్న పచ్చ నేతలకు కిలోకు రూ.4 నుంచి రూ.5 ఇస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలకు రూ.లక్షల్లో ముట్టజెపుతున్నారు.బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతుండటంతో చాలామంది పేదలు బియ్యం అందకపోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రేణంగివరం, కోనంకి, కశ్యాపురం ప్రాంతాల్లో లీజుకు తీసుకున్న కొన్ని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి బస్తాల్లో నింపి గోడౌన్లలో స్టాక్ పెడుతున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలించి రూ.కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. -
తిరుమల కొండపైకి గుట్కా అక్రమ రవాణా
సాక్షి, తిరుపతి: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలపై ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తిరుమల కొండపైకి గుట్కా, మద్యం యథేచ్ఛగా సరఫరా అవుతున్నాయి. ఘాట్ రోడ్డులో తినిపడేసిన గుట్కా ప్యాకెట్లు కుప్పలుకుప్పలుగా దర్శనమివ్వడం భక్తులను కలవరపెడుతోంది.అలిపిరి వద్ద నామమాత్రపు తనిఖీలు జరగడమే ఇందుకు కారణమన్న వాదన వినిపిస్తోంది.నిఘావ్యవస్థ నిద్రపోతుండడం వల్లే తిరుమల కొండపైకి నిత్యం నిషేధిత వస్తువులు తరలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు ఏదీ పట్టించుకోవడం లేదు. ఇదీ చదవండి: చంద్రబాబు సర్కార్.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
లంకలను ముంచిన మట్టి తవ్వకాలు
కృష్ణా నది గట్టుకు గండి పడి గ్రామాలను ముంచెత్తిన వరద ముంపులో బాపట్ల జిల్లాలోని 27 లంక గ్రామాలు వేలాది ఎకరాల వాణిజ్య పంటల మునక జనజీవనం అతలాకుతలం భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కరకట్టపైకి నీరు ఏ క్షణమైనా కరకట్టకు గండిపడే ప్రమాదం ఇదే జరిగితే జలదిగ్బంధంలో చిక్కుకోనున్న రేపల్లె సాక్షి ప్రతినిధి, బాపట్ల: కూటమి నేతల అక్రమార్జన బాపట్ల జిల్లాలో 27 లంక గ్రామాల ప్రజలకు తీరని కష్టాలు తెచి్చపెట్టింది. తమ జేబులు నింపుకునేందుకు టీడీపీ, జనసేన పార్టీ నేతలు యథేచ్ఛగా కృష్ణానది సమీపంలో అక్రమంగా ఇసుక, మట్టి తవ్వకాలు చేపట్టడం కొంపముంచింది. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం పెసర్లంక అరవింద వారధి సమీపంలో కూటమి నేతల అక్రమ ఇసుక, మట్టి తవ్వకాల వల్ల కృష్ణానది గట్టు వరదకు ముందే బలహీనపడింది. గత రెండు రోజులుగా వరద పెరిగి సోమవారం సాయంత్రానికి దాదాపు 12 లక్షల క్యూసెక్కులకు చేరడంతో అరవింద వారధి సమీపంలో కృష్ణానదికి గండి పడింది. దీంతో కొల్లూరు మండలంలోని పెసర్లంక, చిలుమూరులంక, సుగ్గునలంక, ఈపూరులంక, చింతర్లంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక, పోతార్లంక, తిప్పలకట్ట, కిష్కింధపాలెం, తడికలపూడి, జువ్వలపాలెం తదితర 22 గ్రామాలతోపాటు భట్టిప్రోలు మండలంలోని చింతమోటు, పెదలంక, పెసర్లంక, పల్లెపాలెం, రేపల్లె మండలంలోని పెనుమూడి పల్లెపాలెం కలిపి మొత్తం 27 గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. ఈ గ్రామాల్లో 60 శాతం ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 30 శాతం ఇళ్లల్లోకి నీరు చేరింది. ఈ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులపైన వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆయా గ్రామాల్లో ప్రజలు డాబాలపైకి ఎక్కారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 40 శాతం మందికి కూడా చేరని ఆహారం.. లంక గ్రామాలను ముంచెత్తిన వరదనీరు జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. బోట్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం పంపుతున్న తాగునీరు, ఆహారం పట్టుమని 40 శాతం మందికి కూడా అందలేదు. డాబాలపైన వంట చేసుకుందామన్నా మంచినీరు అందుబాటులో లేదు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సరిపడా బోట్లు లేక అధికారులు మిన్నకుండి పోయారు. ఉన్నవారిని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితి నెలకొంది. ఇక చాలా పశువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు ఒక్క చిలుమూరు లంక నుంచి మాత్రమే కొద్దిమంది గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు. వరద ప్రాంతాలకు స్థానిక పోలీసులతోపాటు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడిలు కొల్లూరులోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.రైతులకు భారీ దెబ్బ.. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాలైన కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని లంక గ్రామాల్లో భారీ ఎత్తున పసుపు, అరటి, మొక్కజొన్న, కంద, తమలపాకులు, బొప్పాయి, జామ, కొబ్బరి, కూరగాయలు తదితర వాణిజ్య, ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వరదకు ఈ రెండు మండలాల్లోని వేలాది ఎకరాల పంటలు నీటమునిగాయి. వాణిజ్య పంటలు రోజుల తరబడి నీటిలో నానడంతో పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.రేపల్లె పట్టణానికి పొంచి ఉన్న ప్రమాదం.. వరద ఉధృతికి భట్టిప్రోలు మండలం పెదపులివర్రు వద్ద కృష్ణా కరకట్టపైకి నీరు చేరుతోంది. దీంతో అధికారులు, గ్రామస్తులు అప్రమత్తమై మట్టి, ఇసుక సంచులు వేసి కట్టకు గండిపడకుండా ప్రయత్నిస్తున్నారు. రావి అనంతవరం గ్రామం వద్ద కరకట్ట నుంచి నీరు లీకు అవుతుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వరద మరింత పెరిగితే ఆయా ప్రాంతాల్లో కరకట్టకు గండి పడే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే వరద ఉధృతికి భట్టిప్రోలు, రేపల్లె పట్టణం నీట మునగొచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్కడా కనిపించకపోవడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మట్టి అక్రమ తవ్వకాలే గండికి కారణం కృష్ణా నదికి తొలిరోజు ఆదివారం 8.79 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో పెసర్లంక సమీపంలోని అరవింద వారధి వద్ద కృష్ణానది గట్టుకు భారీ గండి పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు నదికి ఇరువైపులా పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. దీంతో నది గట్లు, కరకట్ట రోజురోజుకు బలహీనపడుతూ వచ్చాయి. కరకట్ట దెబ్బతినకుండా చూడాల్సిన కృష్ణా నది పరిరక్షణ విభాగం ఏమాత్రం పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమ తవ్వకాలు అడ్డుకుని.. దెబ్బతిన్న కట్టను బలోపేతం చేయాల్సి ఉన్నా ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణానది ఒడ్డు కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె ప్రాంతాల్లో మరింత బలహీనంగా మారింది. చాలా చోట్ల పూర్తిగా దెబ్బతింది. ఇలాగే 2009 అక్టోబర్ 6న కరకట్ట తెగిపోయి రేపల్లె పట్టణం నీటిలో మునిగింది. అప్పట్లో 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచి్చంది. ప్రస్తుతం కేవలం 8.79 లక్షల క్యూసెక్కుల వరదకే అరవింద వారధి వద్ద మరోమారు గండిపడింది. ఇప్పటికైనా కృష్ణా కరకట్టలో అక్రమ మట్టి తవ్వకాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
అంతా నల్లధనం దందానే!
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్’ అనే బోర్డు ఉంటుంది... కానీ ఎక్కడా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే బోర్డు మాత్రం ఉండదు. అయినా మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లోనే గుట్టుచప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థను రామోజీరావు నిర్భయంగా నిర్వహించారు. ఆ ముసుగులో భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకే తమ సంస్థలో డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు దశాబ్దాలపాటు ససేమిరా అన్నారు. కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి నల్లధనం దందా నడిపారు.డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్‌దారులకు చెల్లించాల్సిన మొత్తం రూ.2,610.38 కోట్లుగా రామోజీరావు 2006లో తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. కానీ 2008లో సమరి్పంచిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన రూ.800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ రూ.800 కోట్లు రామోజీకి అత్యంత సన్నిహితుడైన పచ్చ బాబు, ఆయన గ్యాంగ్వే అని తెలుస్తోంది. పోనీ చెల్లించామని చెబుతున్న రూ.1,864.10 కోట్ల డిపాజిట్లు ఎవరెవరికి చెల్లించారో చెప్పడానికి రామోజీ ససేమిరా అన్నారు.అక్రమాల సినిమాలో త్రిపాత్రాభినయం – హెచ్‌యూఎఫ్ కర్త, ప్రొప్రైటర్, చైర్మన్ పేరుతో కనికట్టు – ఆర్బీఐని బురిడీ కొట్టించి అక్రమ డిపాజిట్ల దందా సాక్షి, అమరావతి: చట్టాలను ఉల్లంఘించి మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్ము దోచుకునేందుకు చెరుకూరి రామోజీరావు ఏకంగా త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్బీఐకి మస్కా కొట్టారు. అక్రమంగా డిపాజిట్ల దందా సాగించారు.డిపాజిట్ పత్రాలపై హెచ్‌యూఎఫ్ కర్తగా: మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్‌దారులకు పత్రాలను జారీ చేసింది. ఆ పత్రాలపై తనను తాను ‘హెచ్‌యూఎఫ్ కర్త’ అని పేర్కొంటూ రామోజీరావు సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్‌గా...: మార్గదర్శి ఫైనాన్సియర్స్ చెక్కుల దగ్గరకు వచ్చేసరికి రామోజీరావు ‘ప్రొప్రైటర్’గా మారారు. అక్రమ డిపాజిట్లను కాలపరిమితి తరువాత ఇచ్చే చెక్కులపై ఆయన ‘ప్రొప్రైటర్’ అని సంతకం చేశారు.బోర్డు మీటింగ్‌లో చైర్మన్‌గా..మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగ్‌ల విషయం వచ్చేçÜరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగ్ మినిట్స్ బుక్‌లోనూ, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. -
ధర మార్చి.. ఏమార్చి!
-
టీడీపీ మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు
పిచ్చాటూరు (చిత్తూరు): లారీ సహా 7.5 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. పట్టుబడ్డ రేషన్ బియ్యం లారీ, నిందితులను సత్యవేడు సీఐ శివకుమార్‌రెడ్డి, నాగలాపురం ఎస్ఐ ప్రతాప్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నాగలాపురం మీదుగా తమిళనాడుకు అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. నందనం వద్ద శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్ఐ ప్రతాప్ తన సిబ్బందితో మాటు వేశారు. చెన్నై వైపు వెళ్తున్న లారీ (ఏపీ03టీబీ2444)ని తనిఖీ చేయగా 150 బస్తాల (ఒక్కో బస్తా 50 కిలోలు) రేషన్ బియ్యం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లారీలో ఉన్న పిచ్చాటూరు మండలం కీళపూడికి చెందిన రఘు (46) అనే వ్యక్తిని పోలీసులు పట్టుకోగా అదే గ్రామానికి చెందిన తంగరాజ్ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించగా లారీ, బియ్యం టీడీపీ మాజీ ఎంపీపీ భర్త డి.పద్మనాభరాజుకు చెందినవిగా వివరించాడు. లారీ సహా బియ్యాన్ని నాగలాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రఘురామయ్య, తంగరాజ్లతో పాటు టీడీపీకి చెందిన మాజీ ఎంపీపీ భర్త పద్మనాభరాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
లాక్డౌన్: టమాట లోడులో ‘మద్యం’ రవాణా
తినేందుకు తిండి లేకపోయినా.. మద్యం మాత్రం యథేచ్ఛగా దొరుకుతోంది. ఎలా సాధ్యమైందంటే.. ఇంటి దొంగల పనే. కర్ణాటక రాష్ట్రం నుంచి జిల్లాలోకి నకిలీ మద్యం కేసులుగా వచ్చి చేరుతోంది. నిత్యావసరాలకు ఇచ్చిన అనుమతిని ఆసరాగా చేసుకొని బెంగళూరు కేంద్రంగా ఈ దందా సాగుతోంది. ఇక జిల్లాలో నకిలీ మద్యం వ్యాపారి చక్రం తిప్పుతూ ‘ఫుల్లు’గా ఆర్జిస్తున్నాడు. సాక్షి, అనంతపురం: లాక్డౌన్ నేపథ్యంలో నకిలీ మద్యం కర్ణాటక నుంచి రాష్ట్రంలోకి సరఫరా అవుతోంది. ప్రధానంగా నిత్యావసర సరుకుల వాహనాలను అనుమతిస్తుండటంతో అక్రమ మద్యం వ్యాపారులు దీనిని ఆసరాగా చేసుకున్నారు. టమాట లోడులో నకిలీ మద్యం కేసులను పెట్టుకుని మరీ అనంతపురం జిల్లాలోకి తీసుకువస్తున్నారు. బెంగళూరులోని ఒక డెన్‌లో ఈ అక్రమ మద్యాన్ని పక్కాగా బాటిలింగ్‌తో పాటు ప్యాకింగ్ చేసి కేసుల రూపంలో సరఫరా చేస్తున్నారు. బెంగళూరు నుంచి నిత్యావసర సరుకుల వాహనాల్లో జిల్లాకు తీసుకువచ్చి మద్యం ప్రియులకు విక్రయిస్తున్నారు. జిల్లాకు చెందిన నకిలీ మద్యం వ్యాపారి హరినాథ్ గౌడ్ బెంగళూరులోని డెన్ నిర్వాహకులతో సంబంధాలు పెట్టుకుని అక్రమ మద్యాన్ని యథేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నాడు. (కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1,050.91 కోట్లు) ఈ వ్యవహారంలో ఎక్సైజ్ సిబ్బంది ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ స్థానికంగా నకిలీ మద్యం విక్రయంలో ఎక్సైజ్ సిబ్బందితో పాటు ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్‌మెన్‌గా పనిచేసిన వారు కూడా సహకరిస్తున్నారు. ఒక్కో క్వాటర్ బాటిల్‌ను రూ.400 నుంచి రూ.500 చొప్పున విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేయగా బండారం బట్టబయలైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పెనుకొండ స్టేషన్లో పనిచేస్తున్న ముగ్గురు ఎక్సైజ్ కానిస్టేబుళ్లను ఇప్పటికే సస్పెండ్ చేశారు. టమాట లోడులో.. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల మధ్య రాకపోకలను నిలిపివేశారు. అంతేకాకుండా జిల్లాల మధ్య కూడా రవాణాను స్తంభింపజేశారు. అత్యవసర వాహనాలు, నిత్యావసర సరుకుల వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అక్రమ మద్యం వ్యాపారులు ఆసరాగా చేసుకున్నారు. ప్రధానంగా టమాట లోడులో మద్యం కేసులను తీసుకుని కర్ణాటక నుంచి జిల్లాలోకి రవాణా చేస్తున్నారు. ఈ విధంగా ప్రవేశించిన తర్వాత కార్లలో ఒకటి రెండు కేసులు పెట్టుకొని గుట్టుగా విక్రయాలు సాగిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా.. వాస్తవానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో మందుబాబులు మద్యం కొరతతో అల్లాడుతున్నారు. దీనిని అక్రమ వ్యాపారులు కాస్తా తమ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ప్రధానంగా గోవా నుంచి తీసుకువచ్చిన స్పిరిట్‌లో రంగునీళ్లను కలుపుతున్నారు. ఈ రంగునీళ్లను కాస్తా పక్కాగా బాటిళ్లలో నింపి లేబుళ్లను కూడా వేస్తున్నారు. ఈ మద్యం బాటిళ్లకు లేబులింగ్‌లో పాండిచ్చేరిలో తయారు చేసినట్టు ప్యాకింగ్ చేస్తున్నారు. దీనిపై పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు దాడి చేయడంతో గుట్టు రట్టయింది. ఇదిలాఉంటే జిల్లా కేంద్రం అనంతపురంలోనూ పలువురు మద్యం వ్యాపారులు గుట్టుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం. వెయ్యి రూపాయల విలువ కూడా చేయని మద్యం బాటిళ్లను ఏకంగా రూ.3వేల నుంచి రూ.4వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది. -
మొసళ్లనూ తరలిస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: మొసలి ‘కన్నీరు’పెడుతోంది. మొసగాళ్ల వలలో మోసళ్లు చిక్కాయి. నగరం నుంచి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రెండు మొసలి పిల్లల్ని ముంబైకి తరలిస్తున్న ముఠాను మహారాష్ట్రలోని బొరివలి అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ సహా ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు హైదరాబాదీలు ఉన్నారు. వివరాలు... హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొసళ్ల అక్రమ రవాణా జరుగుతున్నట్లు మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో సోమవారం ఓ ప్రత్యేక బృందం బొరివలి ప్రాంతంలో మాటు వేసింది. అక్కడి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా వచి్చన సదరు ప్రైవేట్ బస్సును ఆపి తనిఖీ చేసింది. డ్రైవర్ సీటు సమీపంలో కార్టన్ బాక్స్‌లో ప్యాక్ చేసిన బోనును గుర్తించి తెరిచి చూడగా అందులో రెండు ఆడ మొసలి పిల్లలున్నాయి. ఆ బాక్సును తనకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చారని, హైదరాబాద్ నుంచి ముంబై తీసుకువెళ్లాలంటూ రూ.1500 చెల్లించారని బస్సు డ్రైవర్ అయిన హైదరాబాద్‌వాసి మహ్మద్ అబ్దుల్ రహీం హఫీజ్ విచారణలో చెప్పాడు. అందులో కొన్ని ఔషధాలు ఉన్నాయని నమ్మబలికారని వెల్లడించాడు. అదేబస్సులో ప్రయాణిస్తున్న హైదరాబాదీ శివాజీ బాలయ్య, కర్ణాటకకు చెందిన లతీఫ్ బేగ్ ఆపెట్టెను తీసుకువచ్చారని చెప్పాడు. దీంతో ఆ ఇద్దరిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మొసలిపిల్లలకు చికిత్స అధికారులు ఆ రెండు మొసలి పిల్లల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిని పశువైద్యులు పరిశీలించి ఆ పిల్లల వయస్సు మూడు నెలలలోపే ఉంటుందని, ఒక్కోటి రెండు అడుగుల పొడవు ఉందని తేల్చారు. చాలాసేపు ఓ చిన్న పెట్టెలో ప్యాక్ చేయడంతో అనారోగ్యానికి గురైన మొసలి పిల్లలకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ మొసళ్లను ఎక్కడ నుంచి తీసువస్తున్నారనే అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. నాగార్జునసాగర్, మంజీరనది నుంచే వీటిని సేకరించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటివిలువ మార్కెట్లో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ముంబై, థానే, నవీ ముంబై ప్రాంతాల్లో మొసలి పిల్లలకు భారీ డిమాండ్ ఉందని సమాచారం. ప్రముఖులకు చెందిన ఫామ్‌హౌస్‌ల్లోని కొలనుల్లో మొసళ్లను పెంచుకోవడం ఇటీవల కాలంలో పెరిగింది. అధికారికంగా పెంచుకోవడానికి అనుమతి లేకపోవడంతో అక్రమ రవాణా ద్వారా సేకరిస్తుననట్లు సమాచారం. బొరివాలి వ్యవహారంపై వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది. తదుపరి దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం సిటీకి రానుంది. -
అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం
సాక్షి, మంచిర్యాల : రైలుమార్గం ద్వారా రేషన్‌బియ్యం తరలించడం అక్రమార్కులకు వరంగా మారింది. రైల్వే పోలీసులు గానీ, టీసీ గాని ఎవరైనా అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమ పని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. ఇదంతా అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, అజ్ని ప్యాసింజర్ రైళ్లలో అధికంగా జరుగుతోంది. భాగ్యనగర్ టూ మహారాష్ట్ర కాజిపేట నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్ ప్యాసింజర్ రైలు అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. భాగ్యనగర్ వెనకాల వచ్చే మరో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల, తదితర కొన్నిస్టేషన్లలో క్రాసింగ్ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైలులో ఎక్కించుకునేందుకు అక్రమార్కులకు సమయం కలిసి వస్తోంది. దీంతో రైళ్లోని టాయిలెట్ రూమ్‌లన్నీ రేషన్ బియ్యం బస్తాలతో నింపేసి డోర్లు వెళ్లకుండా చేస్తున్నారు. నిత్యం హసన్పర్తిరోడ్, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపురం, పెద్దంపేట, మంచిర్యా ల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్ ఈ రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. టాయిలెట్ డోర్లు ధ్వంసం గతంలో రేషన్‌బియ్యం రైల్వే పోలీసులకు పట్టుబడితే బియ్యం స్వాధీనం చేసుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయడం లాంటివి జరిగేవి. దీంతో బియ్యం స్మగ్లర్లు తమ పంథాను మార్చుకున్నారు. టాయిలెట్ రూముల్లో సుమా రు 30. నుంచి 40 బస్తాలు భద్రపరుస్తున్నారు. ఒక వ్యక్తి లోపలే ఉండి డోర్ లాక్ చేసుకొని కూర్చుంటాడు. దిగాల్సిన స్టేషన్ రాగానే లోపల కూర్చున్న వ్యక్తి లాక్ తీసుకొని బయటకు వచ్చి తమ పనిని కానిచ్చేస్తారు. ఒకవేళ లాక్‌లు వెళ్లకపోతే డోర్లను సైతం పగలగొట్టి మరీ తమ బియ్యాన్ని దించుకుంటారు. దీంతో భాగ్యనగర్ రైల్లో టాయిలెట్ రూములకు లాక్‌లు ఉండడం లేదు. మరికొన్ని చోట్ల డోర్లు పూర్తిగా విరిగిపోయి ఉండడంతో టాయిలెట్ రూములోకి వెళ్లలేని పరిస్థితి ఉందని పలువురు ప్రయాణికులు మొర పెట్టుకుంటున్నారు. రైల్వే అధికారుల అండతోనే దందా... రేషన్ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే సాగుతోందన్న ఆరోపనలు వి నిపిస్తున్నాయి. రైల్వేపోలీసులు, (ఆర్పీఎఫ్) జీఆర్పీ సిబ్బంది అక్రమార్కులతో దోస్తి చేయడంతో ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయ లుగా నడుస్తోందన్న విమర్షలు ఉన్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వే పోలీసులు రేషన్‌బియ్యం స్మగ్లర్లను గుర్తించక పోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికా ర యాంత్రంగం ఈ వ్యవహారం అంతా మాములుగా తీసుకోవడం తోనే రేషన్ స్మగ్లర్ల ఆ గడాలకు అంతులేకుండా పోయింది. రైల్వే ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియగానే బియ్యం రవాణా చేసే వారికి కోవర్టుగా మారి సమాచారం అందిస్తున్నారన్న ఆరోపనలున్నాయి. దీంతో అక్రమ రవాణాదారులు అప్రమత్తమై మరుసటి రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైల్వే పోలీసులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకరోజు టార్గెట్ కోసం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసుల్లో సైతం బియ్యం మాత్రమే దొరుకుతాయి కానీ రవాణాదారులు తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అధిక ఆదాయం వస్తుండడంతోనే... ప్రభుత్వం రూపాయికి కిలో రేషన్‌బియ్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందజేస్తుం టే దళారులు రూ.7 నుంచి రూ.8వరకు కొనుగోలు చేసి రైలుమార్గం ద్వారా మహారాష్ట్రలోని వీరుర్ ప్రాంతంలోని వ్యాపారులకు రూ.18 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. -
హల్దీ బచావో..
సాక్షి, తూప్రాన్: వెల్దుర్తి మండలంలోని హకింపేట, అచ్చంపేట, కొప్పులపల్లి, హస్తాల్పూర్, మెల్లూర్, ఉప్పులింగాపూర్, ఆరెగూడెం, పంతులుపల్లి, దామరంచ, కుకునూర్ తదితర గ్రామాల్లోని పంట పొలాలకు సాగు నీరందించే వరప్రదాయని హకింపేట శివారులోని హల్దీప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌లో అక్రమ మట్టి, మొరం రవాణా మూడు హిటాచీ యంత్రాలు ఆరు టిప్పర్లు అన్న చందంగా తయారైంది. వాల్టా చట్టానికి విరుద్ధంగా.. ప్రతి రోజు ప్రాజెక్ట్‌లోని వెనుక భాగంలో పెద్ద పెద్ద హిటాచీ, జేసీబీ యంత్రాలతో పదుల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మొరం, నల్లమట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొందరు స్థానికంగా భూములు కొనుగోలు చేసిన నగరంలోని బడా భూస్వాములకు తరలిస్తుండగా మరికొందరు ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారు. వాల్టా చట్టానికి విరుద్ధంగా గత కొద్ది రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మట్టిని తరలించడంతో ప్రాజెక్ట్ వెనుకభాగంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షాకాలంలో గుంతల్లో నీరు చేరితే లోతు తెలీక మూగజీవాలు, పశువుల కాపరులు మృత్యువాత పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. ఫిర్యాదు చేస్తే బెదిరింపులు! అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని అధికారులకు సమాచారం అందిస్తే అడ్డుకోవాల్సింది పోయి వారు సంబంధిత అక్రమార్కులకు తమ ఫోన్ నంబర్లు ఇస్తున్నారని, ఫలితంగా సంబంధిత వ్యక్తుల నుంచి తమకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు అలవాటుపడటం వల్లే ప్రాజెక్ట్‌లో విలువైన మట్టిని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు తరలించి జేబులు నింపుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట పొలాలకు మట్టి తీసుకెళ్తే నిబంధనల పేరిట ఇబ్బందులకు గురిచేసే అధికారులకు అక్రమ రవాణా కనిపించడం లేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతరు హల్దీ ప్రాజెక్ట్‌లో అక్రమ తవ్వకాలు చేపట్టకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఇరిగేషన్ ఎస్ఈ అనంతరెడ్డి ఆదేశాలను కిందిస్థాయి అధికారులు పెడచెవిన పె డుతున్నారు. ప్రాజెక్ట్ శిఖం భూమిలో ఆక్రమణకు గురైన స్థలాలను సర్వే చేపట్టి కబ్జా జేసిన వారిపై ఫిర్యాదు చేయాలని ఆదేశించినా సిబ్బంది పట్టించుకోడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం నుంచి నీరు వచ్చే అవకాశం.. కాళేశ్వరం కాలువ ద్వారా సాగునీరు హల్దీ ప్రాజెక్ట్‌లోకి చేరే అవకాశం ఉన్నందున, ప్రాజెక్ట్ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు పూర్తిగా నిషేధించి, శిఖం ప్రాంతాన్ని పూర్తిగా సంరక్షించాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు. విజిలెన్స్ ఏర్పాటు చేస్తాం హల్దీ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా మొరం, మట్టి తరలించకుండా పటిష్ట చర్యలు తీసుకుంటాం. రెవిన్యూ, పోలీస్ అధికారులచే విజిలెన్స్ టీం ఏర్పాటు చేసి నిఘా పెంచుతాం. వాల్టా చట్టానికి విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా రవాణా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్ -
దర్జాగా ఇసుక దందా
సాక్షి, మరికల్: అక్రమ ఇసుక వ్యాపారులు అధికారుల అండదండలతో పాలమూరు ఇసుక రావాణాకు తుట్లు పొడుస్తున్నారు. వారి కన్నుసన్నల్లో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. మండలంలోని పూసల్‌పహాడ్ సమీపంలో ఉన్న కోయిల్‌సాగర్ వాగులో జోరుగా అక్రమా ఇసుక రవాణా జరుగుతుంది. ట్రాక్టర్‌కు రూ.4500 నుంచి రూ.5వేల మధ్య ఇసుకను విక్రయిస్తుంటారు. పూసల్‌పహాడ్ గ్రామంలోని పలువురు వ్యక్తులు అక్రమ ఇసుక వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అధికారులకు మామూళ్ల ముట్టచెబుతూ వారి దందాను దర్జాగా సాగిస్తున్నారు. దీంతో వారు ఆడిందే ఆట పాడిదే పాటగా మారింది. పూసల్‌పహాడ్ నుంచి మరికల్, మాధ్వార్, తీలేర్, పల్లెగడ్డ, తధితర గ్రామాలకు ఇసుక ఆర్డర్లు వస్తే చాలు అధికారులకు ఫోన్ కొట్టిన తర్వాతనే వాగులోకి ఇసుక కోసం ట్రాక్టర్లను తీసుకెళ్తారు. వారు కాదంటే ట్రాక్టర్ ముందుకు కదలదు. ఒక్కో ట్రాక్టర్‌కు రోజుకు రూ.3వేల చొప్పున అధికారులకు ఇస్తూ ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపొవడంతో గ్రామస్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అడ్డొచ్చిన వారిపై దాడులు కోయిల్‌సాగర్ వాగు నుంచి గుట్టు చప్పుడుగా ఇసుకను తరలిస్తున్న వారిని అడ్డుకుంటే వారు ఎంతటికైనా తెగిస్తారు. అడ్డుకున్న వారు ఎవరని చూడకుండా దాడులు చేసి ఇసుకను తరలిస్తున్నారు. ఏడాది క్రితం అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్న వీఆర్ఓ మైబన్నను చితకబాది ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. ఇసుక వ్యాపారంలో ఉన్న లాభాలకు అలవాటు పడ్డ కొందరు వ్యాపారులు ప్రస్తుతం కూడా వారి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అసలే వర్షాలు లేక బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపోతున్న తరుణంలో కోయిల్‌సాగర్ వాగుల్లో నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలించడం వల్ల వాగు పరివార ప్రాంతం సమీపంలో ఉన్న బోర్లలో భూగర్బజల్లాలు అడుగంటిపొతుండటంతో ఇటీవల కొందరు రైతులు ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రైతులను సైతం విడిచిపెట్టకుండా దాడులు చేశారు. తమ పై దాడులు చేశారు కోయిల్‌సాగర్ వాగులో నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వ్యాపారులను అడ్డుకుంటే తమపై దాడులు చేసి గాయపర్చారు. తమ వ్యాపారానికి అడ్డు రావొద్దని భయపెట్టిస్తున్నారు. గ్రామంలో దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి. – ఆంజనేయులు, రాంరెడ్డి, పూసల్‌పహాడ్ చర్యలు తీసుకుంటాం అధికారుల అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. పాలమూరు ఇసుక రవాణా కా కుండా దొడ్డిదారిన ఎవరైన సరే అక్రమంగా ఇసుక రవాణా చేస్తే సహించం. అక్రమంగా ఇసుక తరలించేందుకే వీలులేదు. తప్పనిసరిగా అనుమతి పొందాల్సిందే. అధికారులచే తనిఖీలు చేపడుతాం. ఇసుక వ్యాపారులతో అధికారులు డబ్బులు తీసుకున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – నాగలక్ష్మి, తహసీల్దార్, మరికల్ -
ఇసుక అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక నివాసం చెంతన కృష్ణా నదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం కోర్టు మూడు నెలల పాటు నిలుపుదల చేసింది. అయితే ఇంత భారీగా అక్రమ ఇసుక తవ్వకాలు జరపడాన్ని ఎన్జీటీ నిర్దేశించిన కమిటీ ధ్రువీకరించినందున దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వేల టన్నుల్లో భారీ యంత్రాలతో తవ్వకాలా? ‘ఇంత పెద్ద ఎత్తున, ఇన్ని వేల టన్నుల్లో, భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇసుక ఇస్తారా?’అని గురువారం పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఏకే గంగూలీ వాదనలు వినిపిస్తూ ‘ఎన్జీటీ ఆదేశాలు జారీచేసే ముందు మా వాదనలు వినలేదు..’అని నివేదించారు. అయితే ఎన్జీటీ నిర్దేశించిన కమిటీలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితోపాటు రాష్ట్ర విభాగాల అధికారులు కూడా ఉన్నారని, వారు తనిఖీ చేశాకే నివేదిక ఇచ్చారని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వివరించారు. ఈ సమయంలో జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ ‘కమిటీ నివేదికలో వెల్లడైన విషయాలు ఈ అంశం తీవ్రమైనదని తెలియజేస్తున్నాయి’అని పేర్కొన్నారు. తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయడం న్యాయం కాదని గంగూలీ వాదించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందిస్తూ ‘రూ. 100 కోట్లు డిపాజిట్ చేయాలన్న ఎన్జీటీ ఉత్తర్వులను 3 నెలల పాటు స్తంభింపజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తమ వాదనలు వినిపించేందుకు రెండు వారాల్లోగా అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. సంబంధిత పిటిషన్‌ను ఎన్జీటీ మూడు నెలల్లోగా పరిష్కరించాలి’అని ఉత్తర్వులు వెలువరించారు. -
పీడీఎస్ బియ్యం వ్యాపారానికి అడ్డాగా పుట్టగూడెం
సాక్షి, రాజాపేట (ఆలేరు) : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పుట్టగూడెం తండా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారానికి అడ్డాగా మారింది. గ్రామస్తులు నిత్యం ఆదే పనిగా వ్యాపారం కొనసాగిస్తూ టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యం సేకరించి నిల్వ చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. పోలీసులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నా వ్యాపారం మాత్రం ఆపడంలేదు. బియ్యం కొనుగోలులో బడా నాయకుల హస్తం ఉందని, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని రైస్‌మిల్లర్లు ఈ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారని సమాచారం. 9 మే 2017న సిద్దిపేట జిల్లాకు తరలిస్తుండగా 25 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని ఓ వ్యాపారిపై కేసులు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. కింది స్థాయి పోలీసుల కనుసన్నల్లో ఈ పీడీఎస్ బియ్యం వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రాజాపేట మండలంలోని పుట్టగూడెం గ్రామంలో సుమారు వెయ్యి మంది గిరిజనులు ఉంటారు. కాగా వీరికి ప్రధాన కులవృత్తి లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి భూమిలో జొన్న, మొక్కజొన్న, వరి, పత్తి, కంది వంటి పంటలు సేద్యం చేస్తారు. మిగతా కాలంలో ఖమ్మం, విజయవాడ వంటి జిల్లాలకు చెరుకు నరి కేందుకు ఎడ్లబండ్లపై వలస వెళ్తుంటారు. తిరిగి వచ్చే సమయంలో ఉప్పు కొనుగోలు చేసి ఇక్కడి ప్రజలకు విక్రయిస్తారు. కాగా మారుతున్న కాలనుగుణంగా వర్షాలు లేకపోవడంతో ఈ గ్రామంలో జీవనోపాధి కరువై కొందరు సారాయి విక్రయిస్తూ ఉపాధి పొందారు. ప్రభుత్వం సారా తయారీదారులు, విక్రయదారులపై కఠినచర్యలు తీసుకుంటూ పీడీ యాక్టు నమోదు చేయడంతో దానిని మానేశారు. దీంతో కొందరు గ్రామస్తులు ఇళ్ల నిర్మాణాలకు ఇటుక, కంకర, ఇసుక వంటి ముడిసరుకులు అందిస్తూ వ్యాపారులుగా మారారు. కాగా కొంతమంది మాత్రం పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని ఎంచుకున్నారు. పీడీఎస్ బియ్యం సేకరిస్తూ గ్రామంలోని రహస్య ప్రాంతాల్లో నిల్వచేస్తూ గుట్టుచప్పుడు కాకుండా రాత్రికిరాత్రి ఇతర జిల్లాలకు తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పోలీసులు కొన్ని సందర్భాల్లో చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో దాడులుచేసి కేసులు నమోదు చేయగా భయపడిన కొందరు ఈ వ్యాపారాన్ని మానేయగా మరి కొందరు కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలో మూడేళ్లుగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం సాగుతూనే ఉంది. కాగా గ్రామంలోని గిరిజనులకు ఉపాధి కరువైందని, ప్రభుత్వాలు పని కల్పిం చాలని, ఇతర వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు అందివ్వాలని కోరుతున్నారు. వ్యాపారం ఇలా... గ్రామంలోని కొందరు తమ కుటుంబంతో కలిసి తెల్లవారుజామున నిత్యం ఆలేరు, జనగాం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో కేజీకి రూ.10 ఇస్తూ పీడీఎస్ బియ్యం, నూకలను సేకరిస్తారు. ఇలా సేకరించిన బియ్యాన్ని తిరిగి మధ్యాహ్నం సమయంలో స్వగ్రామానికి చేరుకుని గ్రామంలోని మరో రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన బియ్యాన్ని మూడు రోజులకు ఒకసారి రాత్రివేళలో గుట్టుచప్పుడు కాకుండా వాహనాల్లో మెదక్, సిద్దిపేట జిల్లాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కేసులు నమోదు పుట్టగూడెం గ్రామంలో గత ఏడాది కాలంగా పోలీసులు ఐదు సార్లు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ 400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా మూడు వాహనాలను పట్టుకొని 16 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్న వ్యాపారులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీఐ ఆంజనేయులు పేర్కొన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారంపై విచారణ రాజాపేట : మండలంలోని పుట్టగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం డంపులపై ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించిన సంగతి విధితమే. కాగా పీడీఎస్ డంపులు పట్టుకున్న సమయంలో ఎస్ఓటీ పోలీసులపై వ్యాపారులు దాడికి పాల్పడి పోలీసులను గాయపరిచిన సంఘటనపై భువనగిరి ఏసీపీ మనోహర్‌రెడ్డి, సీఐలు ఆంజనేయులు, నర్సింహారావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఎస్ఓటీ పోలీసులు ఎస్ఐ లక్ష్మీనారాయణ, హెడ్‌కానిస్టేబుల్ సుబ్బరాజు, కానిస్టేబుల్ సురేందర్‌రెడ్డి సివిల్ డ్రెస్సుల్లో వెళ్లగా అక్రమ వ్యాపారులు రాళ్లతో దాడిచేయగా గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం వ్యాపారులు అక్కడున్న పల్సర్ ద్విచక్రవాహనాన్ని, కొంత పీడీఎస్ డంపు నిల్వను దహనం చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 35 టన్నులు (350) క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారులు మాడోతు చంటి, శ్రీకాంత్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ సీతారామరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి, ఆలేరు ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అబులెన్స్‌లో అక్రమంగా గంజాయి రవాణా
-
నాడు వ్యవసాయం..నేడు అంతర్జాతీయ స్మగ్లింగ్..!
కడప అర్బన్: ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం సంపదను కొల్లగొడుతూ.. 2009 నుంచి యథేచ్ఛగా స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న కర్ణాటక రాష్ట్రం, హోస్కోట తాలూకా, కటిగెనహళ్లికి చెందిన సయ్యద్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూస సామాన్య వ్యవసాయదారుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. తన స్వగ్రామంలో 2009 ముందు వరకు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. విలాసాలకు, దురలవాట్లకు బానిసగా మారిన ముజీబ్‌భాయ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. నిందితులు పట్టుబడిన వైనం ఎర్రచందనం అక్రమ రవాణా గురించి అందిన సమాచారం మేరకు ఈనెల 23వ తేదీన జిల్లాలోని రాజంపేట మండలం రాయచోటి–రాజంపేట ప్రధాన రహదారిలో రోళ్ల మడుగు గ్రామం క్రాస్ వద్ద జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీలలో చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ గొంగన లీలాకుమార్‌ను అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తుండగా వెల్లడించిన వివరాలతో కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగర శివార్లలో గోడౌన్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూసా, అతని ప్రధాన అనుచరుడు మహమ్మద్ గయాజ్ అహ్మద్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు ఐదు కోట్లు విలువజేసే 119 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోగా, వీటి బరువు మూడు టన్నుల మేరకు ఉంటుంది. వీటితోపాటు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరి అరెస్టు వివరాలను కడప పోలీసు పెరేడ్‌గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) లక్ష్మినారాయణ వెల్లడించారు. సిబ్బందిని అభినందించిన ఎస్పీ, ఓఎస్డీ మోస్ట్ వాంటెండ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ సయ్యద్ ముజీబ్‌భాయ్ అలియాస్ మూసా, అతని అనుచరులు మహమ్మద్ గయాజ్ అహ్మద్, లీలాకుమార్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన రాజంపేట డీఎస్పీ ఆర్.రాఘవేంద్ర, రాజంపేట రూరల్ సీఐ టి.నరసింహులు, మన్నూరు ఎస్ఐ మహేష్, కానిస్టేబుళ్లు ప్రభాకర్, చంద్రశేఖర్, సుభాన్‌బాషా, విజయదర్శన్రావు, పుల్లంపేట కానిస్టేబుళ్లు రమేష్, లక్ష్మికర్లను ఎస్పీ అభిషేక్ మహంతి, ఏఎస్పీ (ఆపరేషన్స్) డి.లక్ష్మినారాయణలు అభినందించారు. ఈ సందర్భంగా ఓఎస్డీ మాట్లాడుతూ జిల్లాకు నూతనంగా పోలీసు యంత్రాంగం వచ్చిందని, స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడితే గుర్తించలేరని స్మగ్లర్లు భావిస్తే సరికాదన్నారు. పోలీసు యంత్రాంగం ఎప్పటికీ స్మగ్లర్లపై నిఘా ఉంచుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అంతర్జాతీయ, అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లతో ఇతనికి సంబంధం ఉంది. ఇతనిపై కడప, చిత్తూరు, తిరుపతి అర్బన్ జిల్లాలలో మొత్తం 49 కేసులను పోలీసులు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో సయ్యద్ ముజీబ్ భాయ్ అలియాస్ మూస అక్రమంగా కూడబెట్టిన స్థిర,చరాస్తుల వివరాలు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లలో మిగిలిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు విచారణలో రాబట్టాల్సి ఉంది. ముజీబ్‌భాయ్ అలియాస్ మూసాకు ప్రధాన అనుచరుడైన మహమ్మద్ గయాజ్ అహ్మద్ బెంగళూరు సిటీ, కీల్కొట్టాల్లో నివసిస్తూ ఎనిమిది సంవత్సరాలుగా ముజీబ్‌భాయ్ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాల్లో సహాయ సహకారాలు అందించేవాడు. ఇతనిపై తిరుపతి అర్బన్ జిల్లాలో ఐదు కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పీలేరు మండలం సూరప్పగారిపల్లెకు చెందిన గొంగన లీలాకుమార్ పదవ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ముజీబ్‌భాయ్ అనుచరుడిగా మారాడు. కూలీలను సమకూర్చుకుని జిల్లాలోని రిజర్వు అటవీ ప్రాంతాలలో ఎర్రచందనం చెట్లను నరికించి వాటిని దుంగలుగా తయారు చేయించి ముజీబ్ భాయ్ ఏర్పాటు చేసిన వాహనాలలో బెంగళూరుకు అక్రమ రవాణా చేసి అతనికి అప్పగించేవాడు. -
బైరటీస్ ఖనిజానికి కాళ్లొచ్చాయ్..!
ఖమ్మంఅర్బన్: నగరంలోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందిన భూమిలో తవ్వకాల్లో బయటపడిన బైరటీస్ ఖనిజాలను రాత్రికి రాత్రే అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఖనిజాలను ముందుగా సమీపంలోని రహస్య ప్రదేశంలో నిల్వ చేస్తున్నారని, రాత్రి వేళ తరలిస్తున్నారని సమాచారం. మూడేళ్ల క్రితం కూడా ఇదే తరహాలో పుట్టకోట సమీపంలోని రైతుల పొలాల్లో దొరికిన బైరటీస్ ఖనిజాన్ని ఎటువంటి అనుమతులు లేకుండా ఎగు మతి చేశారు. దీనిపై అందిన ఫిర్యాదులతో అప్ప ట్లో సంబంధిత అధికారులు దాడులు చేశారు. నిల్వలను స్వాధీనపర్చుకున్నారు. తాజాగా, అదే ప్రాం తంలోని రియల్ ఎస్టేట్ వెంచర్లో బైరటీస్ ఖనిజం బయటపడింది. దానిని నూతన కలెక్టరేట్ సమీపం లోని భూముల్లో నిల్వచేసి, రాత్రివేళ లారీల ద్వారా తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ ఖనిజం ధర నాణ్యతనుబట్టి 700 నుంచి 2000 రూపాయల వరకు పలుకున్నట్టు సమాచారం. ఇప్పటికే 10నుంచి 15లారీలలో ఖనిజం నిల్వలను తరలిం చినట్టుగా తెలిసింది. ప్రస్తుతం అక్కడ ఒక లారీ బైరటీస్ గనినిల్వలు ఉన్నాయి. బైరటీస్ వ్యాపారు లే ఈ రాయిని తరలిస్తున్నారని, వెంచర్ నిర్వాహకు లకు కొంత ముట్టజెబుతున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఖనిజాన్ని ఏం చేస్తారంటే... ఈ బైరటీస్ ఖనిజాన్ని కెమికల్స్‌లో, సిమెంట్ తయారీలో ఎక్కువగా వాడుతుంటారు. కోదాడ సమీపంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఖనిజాన్ని కోదాడ సమీపంలోగల ఫ్యాక్టరీకి తరలిస్తున్నట్టు తెలిసింది. మాకు తెలియదు... దీనిపై మైనింగ్ ఏడీ నరసింహారెడ్డి, రాయల్టీ ఇన్స్పెక్టర్ రాజారెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ‘‘బైరటీస్‌ను అక్రమంగా తరలిస్తున్న విషయం మా నోటీసుకు రాలేదు. వెంటనే పరిశీలిస్తాం’’ అని అన్నారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా
ధన్వాడ (నారాయణపేట) : గ్రామాల్లో పైరవీకారులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యమైంది. అధికారుల అనుమతి లేకుండా సహజవనరులను ధ్వంసం చేస్తున్నారు. మండలంలోని మంత్రోనిపల్లి గ్రామ శివారులో ఉన్న గుట్టను తవ్వి అక్కడి మట్టిని తరలిస్తున్నా అడ్డుకునే నాథుడే లేకుండా పోయారు. ముందు గుట్టపై ఉన్న చెట్లను పూర్తిగా తొలగించారు. అంతటితో ఆగకుండా గుట్ట అంచునుంచి కొద్దికొద్దిగా మట్టిని తొలచి రవాణా చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామస్తులు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. గున్ముక్ల నుంచి మంత్రోనిపల్లి గ్రామం వరకు మొటల్‌రోడ్డు మంజూరైంది. అది పూర్తి కాకముందే బీటీకి అనుమతులు రావడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ పక్కనే ఉన్న గుట్ట నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఆ ప్రాంతమంతా సమాంతరం కావడంతో కొందరు చదునుచేసి పంటలు కూడా పండిచుకుంటున్నారు. ఇదిలాఉండగా మంగళవారం బీటీ రోడ్డు పనులు ప్రారంభించడానికి వచ్చిన ఆర్అండ్బీ అ«ధికారులు ఈ వ్యవహారాన్ని చూసికూడా చూడనట్లు నటించారు. కొందరు గ్రామస్తులు ఈ విషయంపై స్థానిక తహసీల్దార్ రాఘవేంద్రనా«థ్‌కు ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి ఆర్ఐ శ్రీనివాసులును పంపించి పనులను నిలిపివేయించారు. ఆయన వెళ్లిపోగానే మళ్లీ పనులు మొదలెట్టారు. -
అడవి పంది.. ఆగమైతంది!
జూలై ఒకటిన తెల్లవారుజామున సిద్దిపేట మీదుగా వస్తున్న టాటా ఏస్ వాహనం జనగామ పట్టణంలోకి రాగానే డివైడర్‌ను ఢీ కొట్టింది. అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు వాహనంలో అడవి పందులను చూసి నివ్వెరపోయారు. వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. చనిపోయిన 3 పందులను ఖననం చేసి, మిగిలిన 9 పందులను సమీపంలోని అడవుల్లో అధికారులు వదిలేశారు. రోజువారీ తనిఖీల్లో భాగంగా కరీంనగర్–వరంగల్–ఖమ్మం రహదారిపై పోలీసులు ఓ వాహనాన్ని ఆపారు. అందులో 2 వరుసలుగా పందులున్నాయి. తొలుత సాధారణ పందులు అనుకున్న పోలీసులు తర్వాత దగ్గరగా చూసి ఆశ్చర్యపోయారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఉండే వేటగాళ్ల నుంచి ఒక్కో అడవి పందిని రూ. 5 వేల చొప్పన కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని.. బెంగళూరు, హైదరాబాద్‌లోని రెస్టారెంట్లకు సరఫరా చేస్తారని విచారణలో తేలింది. సాక్షి, హైదరాబాద్: పంటలను నాశనం చేస్తున్నాయనే కారణంతో అడవి పందులను చంపేందుకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును కొందరు అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. అడవి పందుల మాంసానికి అంతటా డిమాండ్ ఉండటంతో మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరుకు, తనిఖీలకు ఆస్కారంలేని హైదరాబాద్‌లోని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. రోజూ సగటున 25 వాహనాలు మన రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయి. పకడ్బందీగా రవాణా అడవి పందుల అక్రమ రవాణా వ్యాపారులు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. పందులను వేటాడి ప్రాణాలతోనే గమ్య స్థానాలకు చేర్చేలా ప్రత్యేక వ్యవస్థ నిర్మించుకున్నారు. పందులను వేటాడే నైపుణ్యం ఉన్న వారిని ఎంపిక చేసి వారంలో ఓ రోజు కచ్చితంగా పందులను తీసుకొచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. వారి భాష, యాస కూడా వ్యాపారానికి ఉపయోగపడేలా జాగ్రత్త పడుతున్నారు. పందులు అరవకుండా మూతిని తాళ్లతో కట్టేస్తున్నారు. జిల్లా దాటగానే వాహనాలను మార్చేందుకు ప్రతి ప్రాంతానికి ఓ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రాత్రిపూటే ఈ అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఆరాతీస్తే సాధారణ పందులని చెప్పి దాటవేస్తున్నారు. కొన్ని చోట్ల వారిని మచ్చిక చేసుకుని దందా సాగిస్తున్నారు. రవాణాకు సాంకేతిక నైపుణ్యాన్నీ వాడుకుంటున్నారు. వేటాడి బంధించిన పందుల ఫొటోలను వ్యాపారులకు పంపండంతో పని మొదలవుతుంది. వ్యాపారులు అంగీకరించగానే ఒక్కో జిల్లా దాటుతూ, వాహనాలను మార్చుతూ అసలు సూత్రధారులు ప్రత్యక్షంగా లేకుండానే పని పూర్తవుతుంది. ఆహారం కోసం చంపితే నేరం అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న అదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా నుంచి పందుల రవాణా ఎక్కువగా జరుగుతోంది. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలు ఈ ప్రాంతాల్లో వేల సంఖ్యలో ఉన్నాయి. ఇలాంటి గ్రామాల్లోని వ్యవసాయ పంటల్లోకి నిత్యం అడవి పందులు వస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం పంటలకు నష్టం చేస్తున్న సందర్భాల్లో అడవి పందులను చంపడం నేరం కాదు. ఆహారం కోసం చంపితే శిక్షార్హులు. చట్టంలోని 9, 39, 48, 49, 51 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. కానీ పంట నష్టం కారణం చూపి అక్రమార్కులు పందులను వేటాడుతున్నారు. వాట్సాప్‌లోనే అంతా.. అడవి పంది మాంసానికి ఇటీవల డిమాండ్ పెరుగుతోంది. పెద్ద పెద్ద హోటళ్లలోనూ అడవి పంది మాంసాన్ని ప్రత్యేక వంటకంగా చేస్తున్నారు. కొన్ని పెద్ద నగరాలు, పట్టణాల్లో ముందుగా ఆర్డర్ ఇచ్చిన వారికి ఉదయమే వాటిని సరఫరా చేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కిలో రూ. 500.. నగరాల్లో కిలో రూ. 800 చొప్పున మాంసాన్ని విక్రయిస్తున్నారు. బెంగళూరు నుంచి కవ్వాల్ వరకు అడవి పంది ఎలా ఉంది, దాని ధర ఎంత విషయాలన్నీ వాట్సాప్‌లోనే జరుగుతున్నాయని, ఒప్పందం కుదరగానే రవాణా మొదలవుతుందని పోలీసులు చెబుతున్నారు. -
బ్లూ కిరోసిన్ దందా
జనగామ : జిల్లా కేంద్రంగా బ్లూ కిరోసిన్ దందా యథేచ్ఛగా సాగుతోంది. డీజిల్ ధరలు పెరుగుతుండడంతో వాహనదారులు రేషన్ ద్వారా పంపిణీ చేసే బ్లూ కిరోసిన్ వైపు దృష్టి సారిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు రాత్రికి రాత్రే బ్లూ కిరోసిన్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. లబ్ధిదారులతోపాటు పలువురు ఏజెంట్ల నుంచి బ్లూ కిరోసిన్‌ను సేకరిస్తూ రహస్య ప్రదేశాల్లో డంపింగ్ చేస్తున్నారు. జనగామ పట్టణంలో నడిరోడ్డుపై ‘బ్లాక్’ దందా సాగిస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జనగామతోపా టు మండలాల్లో ఈ వ్యాపారం మూడు పూలు..ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 355 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెల 1.62 లక్షల కుటుంబాలకు 1.62 లక్షల లీటర్ల కిరోసిన్‌ను పంపిణీ చేస్తున్నారు. రేషన్ దుకాణాల ద్వారా నిరుపేద కుటుంబాలకు సరఫరా చేస్తున్న కిరోసిన్ పెద్ద మొత్తంలో పక్కదారి పడుతోంది. జనగామ జిల్లా కేంద్రంలో కొంతమంది బ్రోకర్ల కనుసన్నల్లో ఈ దందా జరుగుతోంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి వెంబడే ఓ వ్యాపారి పట్టపగలే కిరోసిన్‌ను బ్లాక్‌లో అమ్ముతున్నాడు. పట్టణంలోని రెండు మూడు ప్రదేశాల్లో కూడా గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. రహస్య ప్రదేశాల్లోని గోదాంలో బ్లూ కిరోసిన్ క్యాన్లను నిల్వ చేస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం అర్ధరాత్రి సమయంలో బ్లూ కిరోసిన్ అమ్మకాలపై తనిఖీలు చేస్తున్నాం. కొడకండ్ల పరిధిలో కేసులు కూడా నమోదు చేసినం. లబ్ధిదారులు ఎక్కడా కూడా కిరోసిన్ అమ్ముకోవద్దు. ఎవరైనా సబ్సిడీ కిరోసిన్ అమ్మినా, ప్రైవేట్ వ్యాపారాలకు వినియోగించినా కేసులు తప్పవు. - రుక్మిణి, డీఎస్ఓ -
అక్రమ ఆయిల్ ముఠా అరెస్ట్
కాకినాడ రూరల్: వాకలపూడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఆయిల్ అమ్మకాలు నిర్వహిస్తున్న ముఠాపై సర్పవరం పోలీసులు దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ఆదేశాల మేరకు కాకినాడ డీఎస్పీ రవివర్మ పర్యవేక్షణలో సర్పవరం సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొంగ ఆయిల్ ముఠా వివరాలను వెల్లడించారు. తీరప్రాంతంలో ఒకసారి ఉపయోగించిన ఆయిల్‌ను నిల్వ చేస్తూ అమ్మకాలు చేస్తున్న ఆవుల శ్రీనివాసరెడ్డి, మందపాక సూరిబాబు, పెంటకోట గంగాధర్‌లను ఎస్సై శ్రీనివాసరెడ్డి సిబ్బంది సహాయంతో అరెస్టు చేసినట్టు వివరించారు. ఆవుల శ్రీనివాసరెడ్డి నుంచి ఆరు బ్యారెల్స్ (1200 లీటర్లు) యూజ్డ్ ఇంజన్ ఆయిల్, మందపాక సూరిబాబు నుంచి 75 లీటర్లు క్రూడ్ కాటన్ ఆయిల్‌ను, పెంటకోట గంగాధర్ అనే వ్యక్తి నుంచి 20 లీటర్ల డీజిల్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. పాతనేరస్తుడైన ఆవుల శ్రీనివాసరెడ్డి వాకలపూడి ఎఫ్‌సీఐ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకుని పాత ఇనుప వ్యాపారం షాపు నడుపుతున్నట్టు తెలిపారు. ఒకసారి ఉపయోగించిన ఇంజన్ ఆయిల్‌ను సేకరించి వాటిలో కొంత మంచి ఆయిల్‌ను కలిపి మంచి ఇంజన్ ఆయిల్గా చుట్టుపక్కల లారీ యజమానులకు, చిన్నచిన్న కంపెనీవాళ్లకు విక్రయిస్తూ వ్యాపారులను మోసగిస్తున్నాడన్నారు. సీఐ చైతన్యకృష్ణకు ముందుగా వచ్చిన సమాచారం మేరకు దాడిచేసి పట్టుకున్నామన్నారు. ఈనెల 6వ తేదీన ఏపీ5డబ్ల్యూ 1282 నంబర్ గల లారీ యజమాని కడలి రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ వాకలపూడిలోని ఎన్సీఎస్ ఆయిల్ కంపెనీ నుంచి అమలాపురం, రావులపాలెం పెట్రోల్ బంకులకు వెళ్లేందుకు డీజిల్ నింపిన ట్యాంకర్ నుంచి డ్రైవర్ పెంటకోట గంగాధర్ ట్యాంకర్ కంపార్ట్‌మెంట్‌కు సీలు తొలగించి సుమారు 20 లీటర్లు డీజిల్ ఆయిల్‌ను దొంగిలించడంపై అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. ఇదే విధంగా వాకలపూడి గ్రామంలోనే అక్రమంగా ఆయిల్ వ్యాపారం చేస్తున్న మంటపాక సూరిబాబుని అరెస్టు చేసి అతడి నుంచి 75 కిలోల కాటన్ క్రూడ్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ట్యాంకర్ డ్రైవర్లు, క్లీనర్ల వద్ద నుంచి కాటన్ క్రూడ్ ఆయిల్ కలిపి చుట్టుప్రక్కల వారిని స్వచ్ఛమైన ఆయిల్గా నమ్మించి అమ్మి మోసగిస్తున్నట్టు తెలియడంతో అరెస్టు చేశామన్నారు. సర్పవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వివిధ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పేకాట, జూదం ఆడుతున్న తొమ్మిది పేకాట కేసుల్లో 54 మందిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ రవివర్మ తెలిపారు. నాలుగు గుట్కా కేసుల్లో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు తెలిపారు. పోర్టులో వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను మోసగించి అక్రమ వ్యాపారాలు చేస్తున్న వివిధ కేసుల్లో ఉన్న పాతనేరస్తులు(ఆయిల్ కేసుల్లో) 15 మందిని అదుపులోకి తీసుకుని 15 కేసుల్లో బైండవర్ చేసినట్టు వివరించారు. ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల ఏరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో భాగంగా పోర్టు ఏరియాలో రాకపోకలు సాగించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచినట్టు డీఎస్పీ రవివర్మ వివరించారు. కార్యక్రమంలో సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై సత్యనారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
భూమాతకు శోకం!
ఉలవపాడు: కరేడు చెరువు అక్రమార్కుల దెబ్బకు విలవిల్లాడుతోంది. చెరువులో ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అధికారపార్టీ పెద్దలు జేసీబీలతో ట్రాక్టర్లకు ఎత్తి «ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు తెలిసినా ఆవైపు కన్నెత్తి చూడటంలేదు. అధికారం అండ ఉండటంతో నిస్సిగ్గుగా వ్యవవహరిస్తున్నారు. గతంలో కూడా ఓ సారి భారీగా మట్టిని తరలించారు. ఆ సమయంలో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా రాలేదు. పని అంతా పూర్తి అయిన తరువాత వారానికి వచ్చిన జేఈ రాజశేఖరరెడ్డి.. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై కరేడు చెరువు నీటి సంఘం అధ్యక్షురాలు సింధుప్రియ పోలీసుల ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మట్టి తరలిపోతుండటం వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందని రైతులు వాపోతున్నారు. భారీగా తరలింపు... శనివారం రాత్రి, ఆదివారం జేసీబీలతో సుమారు 650 ట్రిప్పులు మట్టిని తరలించినట్లు సమాచారం. కరేడు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈ తరలింపు జరుగుతోంది. ఒక్కో ట్రాక్టరు 380 రూపాయల చొప్పున సమీపంలో నిర్మిస్తున్న హేచరీలకు తోలుతున్నారు. అంటే రెండు రోజుల్లో 2 లక్షల 47 వేల రూపాయల మట్టిని దోచేశారు. దీనికి తోడు చెరువులో క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు పెడుతున్నారు. అనుమతి తీసుకుని క్రమ పధ్ధతిలో మట్టి తీసుకుంటే నీటి నిల్వ పెరుగుతుంది. కానీ అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనివలన చెరువులో నీరు సక్రమంగా ఆయుకట్టు పొలాలకు చేరదు. గుంతల్లోనీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సాధారణంగా చెరువు మొత్తం నీటిసంఘం అధ్యక్షురాలు సభ్యులపై అధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. తమ చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని నీటి సంఘం అ«ధ్యక్షురాలు సింధుప్రియ ఎస్సైకి ఫోన్ చేసి తెలియచేశారు. అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. దీంతో ఎస్సై నీటిపారుదల శాఖ అధికారుల చేత చెప్పించాలని.. మీరు చెపితే రానని చెప్పినట్లు తెలిపారు. తాను అధ్యక్షురాలిగా ఫిర్యాదు చేసినా అక్రమ తరలింపును ఆపడానికి నీటిపారుదల శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ రాలేదని వాపోయారు. -
భారీ మొత్తంలో ఫారెన్ కరెన్సీ పట్టివేత
సాక్షి, చెన్నై : భారత్ నుంచి విదేశాలకు ఫారెన్ కరెన్సీని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. అతని వద్ద దాదాపు కోటిన్నర విలువచేసే అరబ్ దేశాలకు సంబందించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా విదేశీ నగదు తరలిస్తున్నారన్న సమాచారం అందడంతో.. దుబాయ్ వెళ్లే ప్రయాణికులపై నిఘా పెట్టామని, దీంతో చెన్నైకు చెందిన సయ్యద్ అనే వ్యక్తి వద్ద ఈమేరకు భారీ విదేశీ నగదు పట్టుబడిందని కస్టమ్స్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. అరబ్ దేశాలకు చెందిన ఖతార్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియాలకు చెందిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయని అధికారులు పేర్కొన్నారు. -
ఈ నేరం మాది కాదు
పెరవలి : రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం డీలర్ల వద్ద నుంచి కొనుగోలు చేసింది కాదని ఈ బియ్యం అంతా స్టాక్ పాయింట్ల నుంచే రవాణా జరుగుతుందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఆరోపించారు. నల్లాకులవారిపాలెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో సోమవారం కొవ్వూరు డివిజన్ రేషన్ డీలర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ దుకాణాలకు సరుకును పంపిణీ చేసే స్టాక్ పాయింట్లు 266 ఉన్నాయని వీటి ద్వారా ప్రతి నెలా 400 లారీల సరుకు పక్కదారి పడుతుందని తెలిపారు. సరుకును అక్రమంగా తరలించి ఆ నిందను రేషన్ డీలర్లపై నెడుతున్నారని ఆరోపించారు. ఈ నెల నుంచి నేరుగా పాయింట్ల నుంచి వచ్చే సరుకును తూకం వేయకుండా ఇస్తే వాటిని తీసుకోకుండా వెనక్కి పంపించాలని తెలిపారు. రేషన్ బియ్యం బొక్కేదెవరో తెలియాలంటే స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. జిల్లా అధ్యక్షుడు రాజులపాటి గంగాధర్, ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి నర్సింహరావు, చంటి అజేయరెడ్డి, నల్లాకుల వెంకటేశ్వరరావు, వీరబ్రహ్మం పాల్గొన్నారు. -
గుట్టు రట్టు
కాకినాడ క్రైం: సముద్రంలో కొంత కాలంగా సాగుతున్న అక్రమ డీజిల్ రాకెట్‌ను కాకినాడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఫైబర్ బోటులో అనుమానాస్పదంగా ఉన్న తొమ్మిది మంది యువకులతో పాటు వారి వద్దనున్న సుమారు పది వేల డాలర్ల విదేశీ కరెన్సీ(రూ.6.30 లక్షలు)తో పాటు 350 లీటర్ల డీజిల్, రెండు మోటార్ ఇంజన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం కాకినాడ యాంకరేజీ పోర్టులో అక్రమంగా షిప్పులపై నుంచి డీజిల్ రవాణా జరుగుతోందన్న సమాచారంతో యాంకరేజ్ పోర్టులో ఎస్పీఎఫ్ ఇన్స్పెక్టర్ కేశవరాం ఆధ్వర్యంలో సముద్రంలో గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో ఒక ఫైబర్ మోటరైజ్డ్ బోటుపై తొమ్మిది మంది వ్యక్తులు వెళుతుండగా, బోటును ఆపాలని కోరారు. అయితే వారు లెక్క చేయకుండా ముందుకెళ్లడంతో బోటును వెంబడించి తనిఖీ చేశారు. యువకుల వద్ద పది వేల డాలర్ల విదేశీ కరెన్సీ, ఎనిమిది డ్రమ్ముల్లో సుమారు 350 లీటర్ల డీజిల్, పది లీటర్ల పెట్రోలు, షిప్పుల్లో నుంచి బోట్లలోకి ఆయిల్ తోడేందుకు వినియోగించే రెండు ఇంజన్లను గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా షిప్పుల నుంచి ఆయిల్‌ని తక్కువ ధరకు కొనుగోలు చేసి బోట్లకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. డీసెల్ అక్రమ రవాణా, విదేశీ కరెన్సీ లభించడంతో పోర్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు కేసును కస్టమ్స్ అధికారులకు అప్పగించినట్టు ఇన్స్పెక్టర్ కేశవరాం తెలిపారు. ఈ విషయమై కస్టమ్స్ సీఐ మాధవరావుని వివరణ కోరగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారందరూ కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. సముద్ర అక్రమ రవాణాలో యువకులు సముద్రంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలో యువకులు అధికంగా ఉండటం విశేషం. మరోవైపు అక్రమ రవాణా దందా కోట్లలో టర్నోవర్ కావడం, ఇందులో బడాబాబుల హస్తం ఉండడంతో ఈ వ్యవహారంలో మెరైన్ పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బందికి తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం కాకినాడ యాంకరేజ్ పోర్టు, సూర్యారావుపేట, వాకలపూడి, ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో రూ.లక్షల్లో చీకటి వ్యాపారం జరుగుతుంటే అధికారుల దాడుల్లో కేవలం రోజువారీ కూలి పనులకు వచ్చిన యువకులే కేసుల్లో ఇరుక్కుంటున్నారు. నిర్వాహకులు మాత్రం దర్జాగా తప్పించుకు తిరుగుతున్నారు. -
ఇసుక దందాకు ధరల ఆజ్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్, పొందూరు,ఆమదాలవలస రూరల్, బూర్జ: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఏర్పాటు చేశామని ఆధికారుల చెబుతున్నా ఎక్కడా ఆ జాడలు కనిపించడం లేదు. ఇసుక క్వారీల లీజులు లేనప్పుడు రహస్యంగా జరిగిన దందా.. ఇప్పుడు బహిరంగంగా సాగుతోంది. ఇసుకకు అత్యధిక ధర నిర్ణయించడం, రీచ్‌ల నిర్వహణ భాద్యతను మహిళా సంఘాలకు అప్పజెప్పినా తెరవెనుక అధికార పార్టీ నేతలు ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ఇసుక అక్రమాలకు అధికార ముద్ర పడినట్లయ్యింది. అక్రమ రవాణా నిరోధానికి నిఘా బృందాలను వేసినా, వాటిని కొన్ని కేంద్రాలకే పరిమితం చేయడంతో నిఘా లేని మార్గాల్లో, చీకటి దారుల్లో ఆత్యం సులభంగా ఇసుక తరలిపోతోంది. ఒకే రసీదుపై పలుసార్లు ఇసుకను రవాణా చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రీచుల్లో తమకు 20 శాతం వరకు ఇసుకను అనధికారికంగా తీసుకుపోయే అవకాశం కల్పించాలని కమిటీల ముసుగులో ఉన్న టీడీపీ నేతలు మహిళా సంఘాలపై ఒత్తిడి తెస్తున్నారు. రీచుల్లో అక్రమాల నివారణకు సీసీ కెమెరాలు పెడతామని ప్రభుత్వం చెప్పినా అదీ ఆచరణలోకి రాలేదు. మరోవైపు రాత్రి వేళల్లో జరిగే రవాణాను మహిళ సంఘాలు నియంత్రించలేకపోతున్నాయి. 13 రీచులకు అనుమతి జిల్లాలో ఆధికారికంగా 18 రీచ్‌లను లీజుకు ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటివరకు 13 రీచుల కు అనుమతులు మంజూరు చేశారు. పది మండలాల పరిధిలో ఉన్న ఈ రీచులను 27గ్రామైక్య సంఘాల ద్వారా 716 స్వయంశక్తి సంఘాలకు అప్పజెప్పారు. ఈ రీచ్‌లలో 11,48,220 కూబిక్ మీటర్ల ఇసుక అం దుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆధిక ధరల ఆజ్యం ఇసుక అక్రమాలకు అధిక ధర ఆజ్యం పోస్తోంది. క్యూబిక్ మీటరుకు రూ.675 ధరను అధికారులు నిర్ణయించడంతో కొనుగోలుదారులు, నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో అనధికారికంగా ఇసుక తరలింపు పెరుగుతోంది. చాలామంది అధికార రీచ్‌లతోపాటు, మిగతా నదీ తీరప్రాంతాల నుంచి దొంగచాటుగా తరలించుకుపోతున్నారు. ఇక సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా వే బిల్లులతో జిల్లాలోని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సరైన నిఘా లేకపోవడంతో అక్రమ రవాణా సులభతరమవుతోంది. పెరుగుతున్న ఉద్యమాలు ఇసుక ధరపై సామాన్యులు, భవన నిర్మాణ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని తగ్గించాలన్న డిమాండ్‌తో ఉద్యమాలు పెరుగుతున్నాయి. క్యూబిక్ మీటరు ధర రూ.200 కంటే తక్కువగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ భవన నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లు, ప్రజా సంఘాలవారు ఉద్యమ బాట పట్టారు. ప్రభుత్వ నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు కూడా అదే బాట పట్టారు. ఇటీవల భవన నిర్మాణ కార్మికులు కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశారు. పట్టణంలోని వైఎస్ఆర్ కూడలిలో దీక్షలు చేపట్టారు. నాగావళి నదిలో కార్మికులు, బండ్ల కార్మికులు, నిర్మాణ కార్మికులు ఇసుక సత్యాగ్రహ ం చేపట్టారు. ఇవీ అక్రమాల జాడలు ఆమదాలవలస మండలంలోని జీకేవలస, నిమ్మతొర్లాడ, పాతూరు, కొత్తవలస, ఇసకలపేట, ముద్దాడపేట, కలివరం, తొగరాం, దూసి, బెలమాం, నెల్లిమెట్ట గ్రామాలు నదీ తీరంలోనే ఉన్నా ఇసుక రీచ్‌లు పొందలేకపోతున్నాయి. మండలంలో సుమారు 560 డ్వాక్రా గ్రూపులు ఉండగా, వాటిలో సుమారు 200 గ్రూపులు ఈ గ్రామాల్లోనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఈ మండలానికి ఇసుక రీచ్ కేటాయించకపోవడంతో ఆదాయం కోల్పోతున్నామని ఈ సంఘాల సభ్యులు వాపోతున్నారు. బూర్జ మండలంలో అల్లెన, కాఖండ్యాం గ్రామాల వద్ద ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కాఖండ్యాంలో టీడీపీకి చెందిన వారికే రీచ్ కేటాయించడం వివాదంగా మారింది. దీని ప్రారంభానికి ప్రభుత్వ విప్ వచ్చినప్పుడు స్థానికులు అడ్డుకోవడంతో రగడ జరిగిన విషయం తెలిసిందే. అయినా అధికార టీడీపీ నేతలు ఈ రీచ్‌ను బలవంతంగా ప్రారంభింపజేశారు. అల్లెన రీచ్‌కు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. పొందూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. గోకర్ణపల్లి, తాడివలస, బొడ్డేపల్లి, సింగూరు, గండ్రేడు తీరప్రాంతాలు ఇసుక తవ్వకాలకు అనువుగా ఉన్నా.. రీచ్‌ల నిర్వహణకు అనుమతులు లేవు. దీంతో రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుకను అనధికారికంగా తరలించుకుపోతున్నారు. ప్రధాన రహదారులపైనే పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉంచుతున్నారు. తమకు అనుకూలంగా లేనిచోట్ల టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి ఇసుక రీచ్‌లను రద్దు చేయించేందుకు కుట్ర పన్నుతున్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవళాపురం ర్యాంపు విషయంలో ప్రస్తుతం ఇదే జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే పురుషోత్తపురం, యరగాం ర్యాంపుల ను తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
కల్లు కాదు కాలకూటం
- మెతుకు సీమలో అక్రమ దందా - కల్లు వ్యాపారంలోకి మాఫియా - కాంట్రాక్టర్ల గుప్పిట్లో సొసైటీలు - కల్లు కల్తీ చేసి అక్రమ రవాణా - విచ్చలవిడిగా అనుమతిలేని కల్లు దుకాణాలు - మామూళ్ల ‘మత్తులో’ఎక్సైజ్ శాఖ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలో 468 టీసీఎస్‌లు (టాడీ కోఆపరేటివ్ సొసైటీ), 673 టీఎఫ్టీలు(ట్రీ ఫర్ ట్యాపర్) ఉన్నాయి. వాస్తవానికి సొసైటీలు ఎన్ని ఉంటే దుకాణాలు కూడా అన్నే ఉండాలి. కానీ జిల్లాలో 2 వేలకు పైగా కల్లు దుకాణాలు అక్రమంగా నడుస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో అయితే ఎక్సైజ్ రికార్డుల్లో కల్లు దుకాణం మూసివేసినట్లు ఉండగా.. దుకాణం మాత్రం నడుస్తూనే ఉన్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఒక్క టీసీఎస్‌కు ఏఏ గ్రామాల పరిధిలో ఎన్ని ఈత, తాటి చెట్లను కేటాయించారు? వాటి నుంచి రోజుకు ఎంత కల్లు ఉత్పత్తి అవుతుంది? అనే వివరాలను నమోదు చేయాలి. సమాచార స్పష్టత కోసం ఈత, తాటి చెట్లకు నంబర్లు ఇవ్వాలి. కానీ ఎక్సైజ్ అధికారుల వద్ద ఎలాంటి నివేదికలు లేవు. వాస్తవ పరిస్థితి ఇలా.. వాస్తవ పరిస్థితిని అంచనా వే సేందుకు ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేయగా... దుబ్బాక మండలం ఆకారం గ్రామ కల్లు సొసైటీకి అదే గ్రామంలో 1,100 ఈత చెట్లు, 100 తాటిచెట్లు, గోసాన్‌పల్లి గ్రామ రెవిన్యూ పరిధిలో 550 ఈత చెట్లు, 50 తాటి చెట్లు కేటాయించారు. ఏడాది కాలానికి గాను ఈ చెట్ల నుంచి కల్లును తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయా గ్రామాల్లోని చెట్ల నుంచి లభించే కల్లు ఎక్కువగా ఉంటోందని, కల్లు అమ్మకాలు తక్కువగా ఉన్నాయని చూపుతూ ఇక్కడి కల్లును సిద్దిపేట సొసైటీకి విక్రయిస్తున్నారు. నిజానికి అక్కడి చెట్ల నుంచి ఉత్పత్తి అవుతున్న స్వచ్ఛమైన కల్లు 50 నుంచి 70 లీటర్లకు మించి లేదు. ఈ కల్లు ఆకారం గ్రామ సొసైటీకే సరిపోదు. కానీ కారని కల్లును కారినట్లు చూపిస్తున్నట్లు తేలింది. పైగా కల్లు నిల్వ చేయడానికి ఉపయోగించాల్సిన కల్లు డిపోలనే కల్లును కల్తీ చేసే కేంద్రాలుగా వాడుకుంటున్నారు. తయారీ ఇలా 10 లీటర్ల స్వచ్ఛమైన కల్లుకు 150 లీటర్ల నీళ్లు కలుపుతారు. మత్తు కోసం ఆల్ఫ్రోజోలం, డైజోఫాం, క్లోరో హైడ్రెడ్ తదితర నిషేధిత మత్తు రసాయనాలను కలుపుతారు. మొత్తం మిశ్రమాన్ని ఒక పెద్ద నీటితొట్టిలో పోసి బాగా కలియ తిప్పుతారు. రుచి కోసం తియ్యగా ఉండే చాక్రిన్, నురగ కోసం అమ్మోనియం మిశ్రమ రసాయనాలను, సోడా యాష్, కుంకుడుకాయ రసం కలిపి మరోసారి కలియతిప్పుతారు. ఇలా ఉదయం వేళ తయారు చేసిన మిశ్రమానికి ఈస్ట్ కలిపి సాయంత్రం వరకు బాగా పులియ బెడతారు. ఆ తర్వాతట్రేలలో పెట్టి కల్లు దుకాణాలకు చేరవేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో మత్తు పదార్థాల గాఢత సరిపోని వారికి అదనంగా డైజోఫాం పొడి ఇస్తున్నారు. జనం కల్లు తాగి పొడి డైజోఫాంను నాకుతున్నారు. మహారాష్ట్ర నుంచి ‘డైజోఫాములు’ కల్తీలో మత్తుకోసం వినియోగిస్తున్న డైజోఫాం, ఆల్ఫ్రోజోలం లాంటి ప్రమాదకరమైన నిషేధిత మత్తు పదార్థాలను మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసం జిల్లాలో ప్రత్యేక మాఫియా ముఠాలు కూడా చురుగ్గా పని చేస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లోని ఔషద తయారీ పరిశ్రమల నుంచి వీటిని అక్రమంగా సేకరించి, జహీరాబాద్ చెక్ పోస్టు మీదుగా జిల్లాకు తరలిస్తున్నారు. నిజానికి ఇలాంటి నిషేధిత మత్తు పదార్ధాలను నిరోధించడానికి ఎక్సైజ్ శాఖలో ఎన్ఫోర్స్మెంట్ అనే ప్రత్యేక విభాగం ఉంది. దీన్ని జిల్లా స్థాయిలో అసిస్టెంటు కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తుంటారు. మామూళ్లకు అలవాటు పడిన ఈ విభాగం అధికారులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణపై నిఘా పెట్టడం మానేసి, అక్రమ వసూళ్లకు తెర లేపి డ్రగ్స్ మాఫియాను వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేసులు గీత కార్మికులకు... కాసులు కాంట్రాక్టర్లకు మెతుకు సీమ కల్లు సొసైటీలు కల్లు మాఫియా డాన్ బాలరాజ్ గౌడ్ శిష్యుల గుప్పిట్లోనే ఉన్నాయి. అయితే ఆయనకు ఇక్కడి వ్యాపారంతో సంబంధం లేదని ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. మేజర్ కల్లు సొసైటీల గుప్పిట్లో ఉంచుకున్న బడా కాంట్రాక్టర్ల, చిన్న చిన్న సొసైటీలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అనుమతించిన కల్లు డిపోల్లోనే కృత్రిమ కల్లు తయారుచేసి ట్రాలీలు, ఆటోలు, లారీల ద్వారా గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. నిజానికి గ్రామ కల్లు సొసైటీల్లో ఆయా గ్రామాలకు చెందిన గీత కార్మికులే అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. కానీ కల్లు సొసైటీలో విక్రయాలు మాత్రం కాంట్రాక్టర్ల చేతిలో ఉన్నాయి. సొసైటీలకు ఏడాది కొంత సొమ్ము ముట్టజెపుతున్న కల్లు కాంట్రాక్టర్లు వాటిని హస్తగతం చేసుకుంటున్నారు. వీటి ద్వారా కృత్రిమ కల్లు అమ్ముతున్నారు. డిమాండ్‌ను బట్టి సీసా కల్లుకు రూ.10 నుంచి రూ.15 వరకు తీసుకుంటున్నారు. రసాయనాలు కలపడంలో తేడా వచ్చి మరణాలు సంభవిస్తే ఎక్సైజ్ అధికారులు మాత్రం గీత కార్మిక సంఘం అధ్యక్ష, కార్యదర్శుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. కాసులు మాత్రం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్నాయి. లెసైన్స్‌ల కంటే రెట్టింపు స్థాయిలో దుకాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లెసైన్స్ ఉన్న వారే కల్లు అవ్ముకాలు కొనసాగించాలి. ఏ గ్రామంలో చూసినా మూడు నుంచి నాలుగు కల్లు దుకాణాలు కనిపిస్తాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని గ్రామాల్లో ఒక గ్రామానికి ఒక లెసైన్సు తీసుకుని నాలుగైదు దుకాణాలు నిర్వహిస్తున్నారు. కానీ ఒక దుకాణానికి మాత్రమే ప్రభుత్వానికి ఫీజు చెల్లిస్తారు. ప్రస్తుతం ఉన్న లెసైన్సుల కంటే రెట్టింపు స్థాయిలో దుకాణాలు ఉన్నాయి. లెసైన్సు కలిగిన దుకాణాల్లో కల్తీ కల్లు కేసులు నమోదైనట్లయితే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది. కానీ లెసైన్సులు లేని దుకాణాల్లో విక్రయించిన కల్లు కల్తీ అయి ప్రాణాలు పోయినప్పుడు, ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసే సమయంలో దుకాణాలను తొలగిస్తారు. శాంపిల్స్ సేకరణలోనే మోసం... జిల్లాలో ఎక్సైజ్ అధికారుల అండతోనే కల్లు దందా సాగుతున్నట్లు తెలుస్తోంది. నిబంధన ప్రకారం ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేసి, శాంపిల్స్ సేకరించాలి. ఈ శాంపిల్స్ హైదరాబాద్‌లోని లేబ రేటరీకి పంపించి పరీక్షలు చేయించాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ అధికారులు 57 శాంపిల్స్ సేకరించగా, కేవలం రెండు శాంపిల్స్‌లో మాత్రమే కల్తీ నిర్ధారణ అయింది. నిజానికి ఎక్సైజ్ అధికారులు దుకాణంలోంచి ఇష్టం వచ్చిన సీసాను తీసుకొని దానిలో కల్లు శాంపిల్స్ తీసుకోవాలి. వాస్తవానికి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఎక్సైజ్ అధికారులు శాంపిల్స్ పంపమని కల్లు దుకాణం యజమానికే చెప్తున్నారు. వాళ్లు స్వచ్ఛమైన కల్లు తీసి ఎక్సైజ్ అధికారులకు పంపిస్తున్నారు. దీంతో ప్రయోగశాలలో కల్లు కల్తీ నిర్ధారణ కావట్లేదు. కల్తీ కల్లు ప్రాణాంతకం కల్తీ కల్లు తాగడం ప్రాణాంతకం. ప్రస్తుత పరిస్థితుల్లో సహజసిద్ధమెన కల్లు దొరక్క చాలామంది కృత్రిమ కల్లుకు అలవాటు పడుతున్నారు. దీంతో వారికి తెలియకుండానే ఆరోగ్యం క్షీణిస్తోంది. కల్లులోని ప్రాణాంతక పదార్థాలైన డైజోఫాం, ఆల్ఫ్రోజోలం, క్లోరోఫాం తదితర మత్తు పదార్థాలు నాడీ వ్య వస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కళ్లు పోవడం, మెదడు సరిగ్గా పనిచేయకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, మూత్రపిండాల వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. -
పేదల బియ్యం..పెద్దల పరం
చీరాల: రేషన్ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. రేషన్ డీలర్లు, వ్యాపారులు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై బియ్యాన్ని జిల్లాలు దాటిస్తున్నారు. లారీలు, ఆటోలు, రైళ్లు, పార్శిల్ వాహనాలు, ద్విచక్రవాహనాల్లో దేని ద్వారా సులువుగా ఉంటుందో ఆ మార్గంలో తరలించి జేబులు నింపుకుంటున్నారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల్లో రేషన్ బియ్యం అక్రమ రవాణా మళ్లీ పుంజుకుంది. ఇటీవల నాగులపాలెం పాత పౌరసరఫరాల గౌడౌన్లో దాచి ఉంచిన 547 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సమాచారం ఇవ్వడంతో ఆ బియ్యాన్ని పట్టుకున్నారు. గురువారం నూతలపాడులో ఓ కొష్టం వద్ద తరలించేందుకు సిద్ధం చేసుకున్న 363 బస్తాల రేషన్ బియ్యాన్ని ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కూడా ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం గమనార్హం. చీరాల రైల్వే స్టేషన్లో ప్యాసింజర్ రైలులో రేషన్ బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉంచినట్లు శనివారం తహశీల్దార్, ఎన్ఫోర్స్మెంట్ డీటీలకు ప్రయాణికులు సమాచారం ఇవ్వడంతో వారు 10 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. చీరాల నుంచి రోజూ ఆటోలు, రైళ్లలో బియ్యాన్ని తరలించడం పరిపాటిగా మారింది. పాత వ్యాపారంతో పాటు కొత్తగా చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగారు. రేషన్‌డీలర్ల వద్ద కేజీ 10 చొప్పున కొనుగోలు చేసి దానిని గుంటూరు జిల్లా బాపట్ల, కాకినాడ తరలించి కిలో 14 చొప్పున విక్రయిస్తున్నారు. ఒక్కో మండలానికి సుమారు 500 నుంచి 700 క్వింటాళ్ల బియ్యం కేటాయిస్తారు. అందులో ఒక వంతు మాత్రమే పేదలకు అందగా, మూడోవంతు అక్రమ వ్యాపారులు, రేషన్ డీలర్లకు భోజ్యంగా మారుతోంది. కళ్లకు గంతలు కట్టుకున్న రెవెన్యూ అధికారులు... రెవెన్యూ అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. తాము చెడు వినం... చెడు చూడం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల పని పట్టేందుకు ఏ ఒక్క చర్య చేపట్టడం లేదు. రేషన్ షాపుల అక్రమాలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. తహశీల్దార్ కార్యాలయంలో పనితోనే తమకు సరిపోతుందని చెబుతున్నారు. అయితే రేషన్ డీలర్లతో పాటు అక్రమ వ్యాపారులు ప్రతినెలా రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు పెద్ద మొత్తంలో ముట్టచెబుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక్కో రేషన్‌షాపు డీలరు నెలకు *1200 రెవెన్యూ అధికారులకు మామూలు చెల్లిస్తారని, వాటిని రెవెన్యూ ఇన్స్పెక్టర్తో సహా నలుగురు పంచుకుంటారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రేషన్ డీలర్ల ద్వారా రెవెన్యూ అధికారులకు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు అందుతున్నట్లు సమాచారం. దీంతోనే వారు రేషన్ డీలర్లపై గానీ, అక్రమ వ్యాపారులపై గానీ చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడైనా దాడులు చేసి పట్టుకుంటే 6ఏ కేసులు మినహా పీడీయాక్టులు పెట్టే పరిస్థితులు లేకపోవడంతో అక్రమార్కులకు పాడికుండగా మారిన వ్యాపారాన్ని వదిలిపెట్టడం లేదు. 6ఏ కేసుల వలన ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో డీలర్లు, అక్రమ వ్యాపారులు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉంటున్నారు. దీంతో పేదల బియ్యం జిల్లాలు దాటి చివరకు పెద్దల పరం అవుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణాను నియంత్రిస్తాం. ఎన్ఫోర్స్మెంట్ డీటీ రమేష్ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. అక్రమ రవాణాదారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశాం. ఈ రవాణాను నియంత్రించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం. బియ్యం రవాణాను అడ్డుకుంటాం. మేము డీలర్ల వద్ద నుంచి ఎటువంటి వసూళ్లు చేయడం లేదు. సిబ్బందికి ఆదేశాలిచ్చాం.. బి.సత్యనారాయణ, తహశీల్దార్, చీరాల రేషన్‌బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు వీఆర్వోలను ఆదేశించాం. డీలర్ల నుంచి రెవెన్యూ అధికారులెవరూ వసూళ్లకు పాల్పడటం లేదు. ఎవరైనా అలా చేస్తే చర్యలు తీసుకుంటాం. -
ప్రజల చెంతకే పోలీస్
►శాంతిభధ్రతలను పూర్తిస్థాయిలో మెరుగుపరుస్తా ►మహిళల సమస్యలపై ప్రత్యేక దృష్టి ►అక్రమ రవాణాపై ఉక్కుపాదం ►ఎస్పీ సెంథిల్‌కుమార్ 38వ ఎస్పీగా బాధ్యతల స్వీకరణ నెల్లూరు(క్రైమ్) : పోలీసులున్నది ప్రజల కోసమేనని, వారి కోసమే తాము పనిచేస్తున్నామన్న నమ్మకాన్ని అందరిలో కలిగిస్తామని ఎస్పీ ఎస్.సెంథిల్‌కుమార్ అన్నారు. జనం ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మెరుగైన శాంతిభద్రతలను అందించడంతో పాటు జిల్లాపై అవగాహన పెంపొందించుకుని పోలీసు సేవలను ప్రజలకు చేరువచేస్తామని చెప్పారు. బుధవారం ఉదయం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయన మొదట సిబ్బంది నుంచి గౌరవవందనం స్వీకరించారు. 38వ ఎస్పీగా 11 గంటలకు తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రజలను గౌరవించడంతో పాటు వారికి న్యాయం చేయడంలో పేద, ధనిక అనే పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఎర్రచందనం, ఇసుక, సిలికా అక్రమ రవాణాతో పాటు జీరో బిజినెస్‌ను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు. నేరాల సంఖ్యను గణనీయంగా తగ్గించి శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షిస్తామన్నారు. దోపిడీలు, దొంగతనాల నియంత్రణకు పక్కా ప్రణాళికతో ముందుకెళతామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి కేసుల నమోదు చేస్తామని వివరించారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠి నంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకువస్తే తగిన చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఎస్పీకి ఘనస్వాగతం : సెంథిల్ కుమార్ తన సొంతూరు కోయంబత్తూరు నుంచి భార్య, కుమార్తెతో కలిసి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో ఆయనకు మూడో నగర ఇన్స్పెక్టర్ కె.వి.రత్నం, ఎస్బీ ఎస్సై శ్రీనివాసులురెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో ఎస్పీ కుటుంబసభ్యులతో కలిసి పోలీసు అతిథిగృహానికి చేరుకున్నారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు వీఎస్ రాంబాబు, చంద్రశేఖర్, రామారావు, ఇన్స్పెక్టర్లు మద్ది శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కె.వి రత్నం, జి. రామారావు, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డి, జి. మంగారావు, సుధాకర్‌రెడ్డి, బాజీజాన్‌సైదా, బాలసుందరం, వెంకటేశ్వరరావు, నాగేశ్వరమ్మ, ఆర్ఐలు శ్రీనివాసరావు, లక్ష్మణకుమార్, చిరంజీవి, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. ప్రసాదరావు, కార్యదర్శి అంజిబాబు, పోలీసు కార్యాలయ ఏవో రాజశేఖర్, మినిస్టీరియల్ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలి పారు. అనంతరం ఎస్పీ పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. -
అక్రమాలకు పచ్చజెండా..!
- ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న మైనింగ్ చెక్‌పోస్టు - ఎలాంటి బిల్లులు లేకపోయినా సున్నం ఉత్పత్తుల రవాణ - చోద్యం చూస్తున్న మైనింగ్ విజిలెన్స్ అధికారులు పిడుగురాళ్ల: సున్నం ఉత్పత్తులకు పిడుగురాళ్ల ప్రసిద్ధి చెందిన పట్టణం. ఇక్కడ తయారయ్యే సున్నం మన రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు నిరంతరం రవాణా అవుతోంది. సున్నం ఉత్పత్తులైన కాల్చిన సున్నం, సెమ్పౌడర్, లైమ్పౌడర్, చిప్స్, ముగ్గుకు పలు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. * ఈ రకాలను పేపరు, షుగర్, ఐరన్ ఓర్ తదితర పరిశ్రమల్లో వాడుతుంటారు. * పస్తుతంరోజుకు 120 నుంచి 150 లారీల సరకు ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. * కాల్చిన సున్నం, సెమ్పౌడర్ రవాణాకు మైనింగ్, వే బిల్లులు తప్పనిసరి. * మైనింగ్ బిల్లుకు రూ.1200, వే బిల్లుకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ట్యాక్స్ చెల్లించాలి. * చిప్స్, ముగ్గు, లై మ్పౌడర్ తదితర ఉత్పత్తులకు 10 టన్నులకు రూ.400 మైనింగ్ బిల్లు చెల్లించాలి. బిల్లులు లేకుండానే రవాణా * నిబంధనల ప్రకారం ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థలకు మాత్రమే మైనింగ్ శాఖ నుంచి మైనింగ్ బిల్లులు, వాణిజ్య పన్నుల శాఖ నుంచి వే బిల్లులు మంజూరు చేస్తుంటారు. * ఈ వ్యాపారంలో ఎటువంటి అనుమతులు, లెసైన్స్‌లు లేకుండా వ్యాపారం చేసే వారే ఎక్కువగా కనిపిస్తుంటారు. * స్థానికంగా బిల్లులు కలిగిన వ్యాపారులను ఆశ్రయించి తమ వాహనాలను గమ్యస్థానాలకు చే ర్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని ప్రభుత్వ ఆదాయాన్ని నష్ట పరుస్తున్నారు. * వ్యాపారం చేయని లెసైన్స్‌దారుల నుంచి కొందరు మైనింగ్, వే బిల్లులు తీసుకుని అసలు లెసైన్స్‌లు లేని వ్యాపారుల సున్నం లారీలను వారే స్వయంగా రవాణా చేస్తుంటారు. * మైనింగ్ బిల్లుకు రూ.1200 ఖర్చవుతుండగా, బిల్లులు కలిగిన వ్యాపారులు సున్నం వ్యాపారుల నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తూ ఎలాంటి బిల్లులు అవసరం లేదని, అంతా తామే చూస్తామని చెప్పి అక్రమ రవాణాకు తెరతీస్తున్నారు. ఈ వ్యవహారంలో చెక్‌పోస్టు అధికారుల పాత్ర కీలకంగా వుండడంతో బిల్లులు లేని లారీలు యథేచ్ఛగా తరలిపోతున్నాయి. * మైనింగ్ చెక్‌పోస్టు అధికారులతో టన్నుకు ఇంతని లెక్క కుదుర్చుకుని ఎటువంటి బిల్లులు లేకుండా సున్నం ఉత్పత్తులను రవాణా చేస్తున్నారు. చెక్‌పోస్టులు లేకపోవటంతో అక్రమాలు * గతంలో పొందుగల, చిలకలూరిపేట, విజయవాడ మార్గాలలో మైనింగ్, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఉండేవి. కొన్నేళ్ల కిందట ప్రభుత్వం చెక్‌పోస్టులను ఎత్తివేసి మొబైల్ టీములను ఏర్పాటు చేసింది. ఇది అక్రమ బిల్లుల వ్యాపారులకు కలిసొచ్చింది. * మొబైల్ టీముల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అక్రమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. * పిడుగురాళ్ల నుంచి రవాణా అవుతున్న సున్నం ఉత్పత్తుల వాహనాలలో 80 శాతం వరకు మైనింగ్, వే బిల్లులు లేకుండా కేవలం క్యాష్‌పైనే నడుస్తున్నట్టు స్వయంగా వ్యాపారులే చెబుతున్నారు. * ఇలా అక్రమ రవాణా వల్ల మైనింగ్, వే బిల్లుల రూ పంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. వివరణ * సున్నం అక్రమ రవాణాపై దాచేపల్లి మైనింగ్ ఏడీ జి. రామచంద్రరావును వివరణ కోరగా విచారణ చేస్తానన్నారు. * అక్రమ రవాణా వ్యవహారాలను మైనింగ్ విజిలెన్స్ ఏడీ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఆయనను సంప్రదించాలని సూచించారు. * మైనింగ్ ఏడీ రామచంద్రయ్యను వివరణ కోరగా అక్రమ రవాణా వ్యవహారాన్ని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానన్నారు. -
అక్రమ రవాణాకు చెక్
ఇక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. ఇసుక.. రేషన్ సరుకులు.. ఇలా పలు రకాల వస్తువులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటి వెళుతున్నాయి. వీటికి ‘చెక్’ పెట్టడంలో ఇంతకాలం ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులు ఇకపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇందుకోసం చెక్‌పోస్టుల వద్ద సాయుధులైన పోలీసులతో పహారాను పెంచాలని భావిస్తున్నారు. దీనిపై పలు శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించారు. చెక్‌పోస్టుల్లో ఇక ‘సాయుధ’ పహారా - రాత్రి సమయాల్లో ప్రత్యేక నిఘా - ‘రేషన్’ పక్కదారి పట్టకుండా చర్యలు - అవసరమైన చోట ఎస్ఐ స్థాయి అధికారితో బందోబస్తు - త్వరలోనే వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల్లో నిఘా పటిష్టం కానుంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖకు చెందిన ఓ అధికారి, నలుగురైదుగురు సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించిన చెక్‌పోస్టులు త్వరలోనే సాయుధ పోలీసుల పహారాలోకి వెళ్లనున్నాయి. జిల్లా నుంచి అక్రమంగా తరలుతున్న కోట్ల రూపాయల రేషన్ సరుకులు, ఇసుకకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఈ చర్యలకు పూనుకుంటోంది. దీనిపై త్వరలోనే జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఆర్టీఏ, ఇతర భాగస్వామ్య శాఖలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం అనంతరం అన్ని చెక్‌పోస్టుల్లో నిఘా పెంచనున్నారు. ఉపయోగం లేని ‘చెక్’.. జిల్లాలో ఉన్న చెక్‌పోస్టుల ద్వారా ప్రస్తుతం మొక్కుబడి తనిఖీలే నడుస్తున్నాయి. చెక్‌పోస్ట్ గుండా వెళుతున్న వాహనాలపై అనుమానం వచ్చినప్పుడో, అధిక లోడుతో వెళుతోందని గుర్తించినప్పుడో సిబ్బంది ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారే తప్ప.. అక్రమ రవాణాను అడ్డుకునే దిశలో కృషి చేయడం లేదు. కాగా, సక్రమంగా వెళుతున్న వాహనాలను ఆపి తనిఖీల పేరుతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక, రాత్రి వేళల్లో విధులు నిర్వహించడం చెక్‌పోస్టు సిబ్బందికి కత్తిమీద సాములా తయారైంది. కొందరు అక్రమ వ్యాపారులు బెదిరింపులకు పాల్పడడం, మరికొన్ని సందర్భాలో సరుకు తీసుకు వెళుతున్న వారే చెక్‌పోస్టు సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేయడం వంటి ఘటనలు కూడా జరిగాయి. పెద్ద ఎత్తున ఇసుక రవాణా... ఆంధ్ర ప్రాంతంతో పెద్ద ఎత్తున సరిహద్దులున్న జిల్లా నుంచి లక్షల టన్నుల నిత్యావసరాలు, వేల క్యూబిక్ మీటర్ల ఇసుక తరలి వెళుతున్నాయి. ఇసుక అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడా తరలివెళుతోంది. అయినా వీటిని నియంత్రించేందుకు చెక్‌పోస్టుల సామర్థ్యం సరిపోవడం లేదు. ఇటీవలి కాలంలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచినా ఫలితం లేకుండా పోయింది. ఈ అక్రమ రవాణాలో కింది స్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు భాగస్వాములేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు చెక్‌పోస్టు వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ నిర్ణయించడంతో ఈ దిశలో యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. చెక్పోస్టుకో కానిస్టేబుల్... అవసరమైతే ఎస్ఐ కూడా నిఘాను పటిష్టం చేసేందుకు ప్రతి చెక్‌పోస్టు వద్ద పోలీసు బలగాలను కాపలా ఉంచాలని కలెక్టర్ భావిస్తున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ సహకారంతో ప్రతి చెక్‌పోస్టు దగ్గర కనీసం సాయుధుడైన కానిస్టేబుల్‌ను ఉంచాలని, తద్వారా చెకింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి మానసిక స్థైర్యం కల్పించాలనే యోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఎస్పీ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం రవాణా శాఖ సిబ్బంది నేతృత్వంలోనే నడిచిన చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతో పాటు పోలీసు కాపలా కూడా పెట్టడం ద్వారా రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న అక్రమ రవాణాను నియంత్రించాలన్నది జిల్లా యంత్రాంగం ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు సరుకులు అక్రమంగా జిల్లా దాటివెళుతున్నాయని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఆ సమయంలో ప్రత్యేక నిఘా ఉంచాలని, అవసరమైతే ఎస్ఐ స్థాయి అధికారిని కాపలా ఉంచాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిపై త్వరలో నిర్వహించబోయే సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఇసుకపైప్రత్యేక దృష్టి... జిల్లాలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలను బంగారు బాతులుగా చేసుకుని కొందరు అక్రమార్కులు లక్షల రూపాయలు అర్జిస్తున్నారు. పట్టాదారు స్థలాల్లో తవ్వకాల పేరుతో ఇసుక నిల్వలను హరించివేస్తున్నారు. గోదావరి తీరంలో గిరిజన సొసైటీల ద్వారా ఇప్పటికే సేకరించిన దాదాపు 20 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలున్నాయి. వీటి విలువ రూ. కోటి పైమాటే. ఇప్పుడు ఈ నిల్వలు అక్రమంగా తరలివెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఈ ఇసుకను ఎలా వినియోగించాలన్న దానిపై కూడా సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు పట్టాదారు స్థలాల్లో తవ్వకాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించి, సర్వే చేసి, ఆ స్థలాలను మార్కింగ్ చేయడంతో పాటు రెడ్ఫ్లాగ్లు ఏర్పాటు చేయడం ద్వారా పట్టాదారులు తమ స్థలాలకు మించి ఇసుక తవ్వకాలు చేపట్టకుండా నియంత్రించే దిశలో కృషి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి కోట్లాది రూపాయల విలువైన అక్రమ సరుకు రవాణా ఏ మేరకు నియంత్రించగలరో, పోలీసు పహారా ఏ మేరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే.