అది చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు | Minister Kodali Nani Slams Chandrababu In Gudivada | Sakshi
Sakshi News home page

అది చూసి చంద్రబాబుకు నిద్రపట్టడం లేదు

Published Sun, Nov 8 2020 12:58 PM | Last Updated on Sun, Nov 8 2020 2:42 PM

Minister Kodali Nani Slams Chandrababu In Gudivada - Sakshi

సాక్షి, కృష్ణా : వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనను చూసి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడం లేదని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి టీడీపీ నేతలు దోచుకున్నారని, కేంద్రం నుంచి వచ్చిన సబ్సీడీ డబ్బు కూడా దోచేశారని మండిపడ్డారు. ఆదివారం ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు కార్యక్రమంలో భాగంగా మంత్రి కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ( టీడీపీలో ‘రాజీనామా’ ప్రకంపనలు..)

సంక్షేమ పథకాల అమలుపై ప్రజల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో 25వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. టీడీపీ నేతలు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు కెళ్లి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 కల్లా గుడివాడ నియోజకవర్గంలో పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement