Minister RK Roja Counter Attack To TDP Nara Lokesh - Sakshi
Sakshi News home page

‘నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు లోకేష్‌.. అమ్మవారి కిరీటాలు ఎత్తుకెళ్లిందెవరు?’

Published Tue, Sep 27 2022 4:34 PM | Last Updated on Tue, Sep 27 2022 5:12 PM

Minister RK Roja Counter Attack To TDP Nara Lokesh - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓవర్‌గా కామెంట్స్‌ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్‌ ఇచ్చారు. 

నారా లోకేష్‌ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. 

- అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు?

- క్షుద్ర పూజలు చేయించిందెవరు?

- 40 గుడులను కూల్చేసింది ఎవరు?

- సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు?

- అంతర్వేది రథం తగలబెట్టిందెవరు?

- రాముడి విగ్రహం విరిచేసిందెవరు?

- నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు.’ అంటూ కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement