
సాక్షి, అమరావతి: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ మరోసారి నోటీసులిచ్చింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లో విచారణకు హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అయితే, షార్ట్ నోటీస్‌తో విచారణకు పిలిచారని, అత్యవసర పనులు ఉన్న కారణంగా నేడు విచారణకు హాజరు కాలేననని లిఖితపూర్వకంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ముందస్తు ఖరారైన షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నానని తెలిపారు. నాలుగు రోజుల గడువు కావాలని కోరారు. నాలుగు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని ఎంపీ తెలిపారు. ఈమేరకు సీబీఐకి లేఖ రాశారు.