రోడ్‌షోలో అభివాదం చేస్తున్న చంద్రబాబు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రోడ్‌షోకు కర్నూలులో స్పందన కరువైంది. మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన కర్నూలులోని పెద్దమార్కెట్, పాతబస్టాండ్, టూటౌన్, ఎస్టీబీసీ కళాశాల, ఐదురోడ్ల కూడలి, మౌర్యాఇన్, మార్కెట్ యార్డు సర్కిల్, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా మీదుగా చెన్నమ్మ సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహించారు. చంద్రబాబు వచ్చే మార్గంలోని కొన్ని పాయింట్లలో నాయకులు, కార్యకర్తలు పచ్చ జెండాలతో నిలిచి స్వాగతం పలికారు. సాధారణ ప్రజల సంఖ్య పల్చగా కనిపించింది. ఎక్కడా అనుకున్నంత స్పందన కనిపించలేదు.
రోడ్‌షో ఆరంభంలోనే న్యాయవాదుల నుంచి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు న్యాయవాది నాగలక్ష్మీదేవి మరికొందరు న్యాయవాదులు చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించారు. కర్నూలుకు న్యాయరాజధాని రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని నిలదీశారు. రోడ్‌షో ఆలస్యంగా సాగడంతో, చెప్పిందే చెబుతుండడంతో టీడీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం కనిపించింది. టీడీపీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, కేఈ ప్రభాకర్, గౌరు వెంకటరెడ్డి, గౌరు చరితారెడ్డి, మీనాక్షి నాయుడు, తిక్కారెడ్డి, కోట్ల సుజాతమ్మ, మసాల పద్మజ తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
ఏయ్.. నవ్వకండి.. చిర్రెత్తిన బాలయ్య
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్‌కు బిగుస్తోన్న ఉచ్చు
Comments
Please login to add a commentAdd a comment