
సాక్షి, విజయవాడ: పది నెలలుగా దేశంలో కోవిడ్ వల్ల అనేక మరణాలు సంభవించాయని మంత్రి పెర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ తోలి టీకాను ఫ్రంట్ వారియర్స్ ఇస్తున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా కాలంలో ఫ్రంట్ లైన్ వారియర్‌గా పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల వల్ల లక్షల మంది మహమ్మారిని జయించగా.. అనేక మంది ఫ్రండ్ వారియర్స్ ప్రాణాలు అర్పించారన్నారు. ఈ సందర్భంగా వారిందరికి ఆయన నివాళులు అర్పించారు. ఈ రోజు ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ప్రారంభించామని, రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ విడతల వారికగా అందరికి వ్యాక్సిన్ అభిస్తుందని తెలిపారు. ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పక్కనే ఉన్నారని, ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకుంటున్న వారికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment