రమేష్ ఆస్పత్రికి చెందిన కోవిడ్ సెంటర్‌లో బాధితులను రక్షిస్తున్న సిబ్బంది (ఫైల్) -ఇన్‌సెట్‌లో రమేష్ (ఫైల్)
సాక్షి, అమరావతి బ్యూరో: స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న డాక్టర్ రమేష్‌బాబు, ముత్తవరపు శ్రీనివాసబాబుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
►స్వర్ణ ప్యాలెస్‌లో క్వారంటైన్ సెంటర్ కాకుండా కోవిడ్ కేర్ సెంటర్ పేరుతో రోగులకు చికిత్స అందించారు. ఎటువంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్‌ను నిర్వహించారు. ట్రీట్‌మెంట్‌కు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ఉంటే అందరూ బతికే వారు. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని విచారించాం. స్వర్ణ ప్యాలెస్ హోటల్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యాల మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పలేక పోతున్నారు. 91 సీఆర్‌పీసీ కింద ఆస్పత్రి బోర్డు సభ్యులకు నోటీసులు ఇచ్చాం.
►కేసు విచారణకు ముద్దాయిలు, అనుమానితులు సహకరించడం లేదు. దర్యాప్తునకు సహకరిస్తే వారికే మంచిది. పోలీసులకు అందరూ సమానమే.
Comments
Please login to add a commentAdd a comment