సాక్షి, అమరావతి: ప్రపంచమంతటా కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందా.. లేదా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. నిపుణులు మాత్రం వైరస్ వ్యాప్తికంటే.. ఆందోళన మాత్రం సామాజిక వ్యాప్తి పక్కాగా జరిగిందని చెబుతున్నారు. ఇటీవలే అమెరికన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ దీనిపై పరిశీలన జరిపింది. ఈ అసోసియేషన్‌తో పాటు బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లూ పరిశోధన చేశారు. తాజా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా కరోనా వైరస్ వ్యాప్తి కంటే.. ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోందని స్పష్టం చేశారు. ఇంతకీ వాళ్లు చెప్పిన విషయాలు ఏమిటంటే..
► కరోనా సోకిన వారికంటే తమకూ సోకుతుందేమోనన్న అనుమానంతో ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు.
► ఒక విధంగా ఈ ఆందోళన, భయం, స్ట్రెస్ వంటివి సామాజిక వ్యాప్తి జరిగినట్టు చెప్పుకోవచ్చు.
► అనవసర ఆందోళన కారణంగా ఆరోగ్యవంతులు కూడా వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నారు.
► పాశ్చాత్య దేశాల కంటే ఆసియా దేశాల్లో ఇలాంటి ఆందోళన ఎక్కువ మందిలో కనిపిస్తోంది.
► యువకుల్లోనూ ఇలాంటి ఆందోళన ఉండటం విస్మయానికి గురిచేస్తోంది. దీనికి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
► ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉన్న వృద్ధులు కూడా వెంటనే కోలుకుంటున్నారు.
► యాంగ్జైటీ లేకపోతే రక్తంలో ఆక్సిజన్ నిల్వలు నిలకడగా ఉంటాయి. కరోనా వార్తలు వినకుండా మిగతా వ్యాపకాల్లో ఉండటమే దీనికి సరైన మందు.
Comments
Please login to add a commentAdd a comment