తిరుమలలో కరోనా నియంత్రణకు ఆంక్షలు | Restrictions In Tirumala Over Coronavirus | Sakshi
Sakshi News home page

తిరుమలలో కరోనా నియంత్రణకు ఆంక్షలు

Published Wed, Mar 31 2021 7:16 PM | Last Updated on Wed, Mar 31 2021 7:37 PM

Restrictions In Tirumala Over Coronavirus - Sakshi

తిరుమల : దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని దానిని ఇంకా పెంచుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు..

  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
  • సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. భక్తులు ఈ మార్పును గమనించాలి.
  • అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ యంత్రాల ఏర్పాటు. ఊ తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement