‘అమ్మా’నుషం..!  | Son Who Left His Mother In The Bus Shelter | Sakshi
Sakshi News home page

‘అమ్మా’నుషం..!

Published Thu, Aug 20 2020 10:40 AM | Last Updated on Thu, Aug 20 2020 10:40 AM

Son Who Left His Mother In The Bus Shelter - Sakshi

అన్నం పెట్టమని చేతులూ జోడించి ఏడుస్తున్న వృద్ధురాలు 

పెదగొట్టిపాడు(ప్రత్తిపాడు): నవమాసాలు మోసిన కన్నకొడుకే.. కాఠిన్యాన్ని ప్రదర్శించాడు. పేగు తెంచుకుని పుట్టిన పుత్రుడే.. వద్దని వదిలించేసుకున్నాడు. అమ్మ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.. అందరూ ఉన్నా అమ్మను అనాథను చేశాడు.. అర్ధరాత్రి నిశీధిలో బస్‌షెల్టర్‌లో వదిలేసి.. వెళ్లిపోయాడు. అమ్మకు తీరని కడుపు కోతను మిగిల్చాడు.. అమ్మా.. ఆకలి.. ఒక్క ముద్ద పెట్టండో.. ఓ కొడుకో .. ఓ కొడుకో.. అంటూ కాలే డొక్కతో.. కడుపు చించుకుని అరుస్తూ.. నడవలేక రోడ్డుపైకి ఈడ్చుకుంటూ వచ్చిన ఆ మృదుసలి అమ్మను చూసి చుట్టుపక్కల వారు చలించిపోయారు.

అందరూ ఉండి అనాథ అయిన అమ్మకు చీరెను కట్టారు. తలో ముద్ద అన్నం పెడుతున్న హృదయ విదారక ఘటన ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడులో చోటుచేసుకుంది. తన పేరు మల్లమ్మ అని స్వగ్రామం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం అని. నరసరావుపేటలో టీ దుకాణం నడిపే మూడో కొడుకు దగ్గర ఉంటున్నానని, నాలుగు రోజుల కిందట నన్ను అర్ధరాత్రి తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్లిపోయాడని ఆ వృద్ధురాలు భోరున విలపిస్తూ చెబుతోంది. ఆకలేస్తోంది కొడుకా.. నాకేం వద్దు ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలూ.. అంటూ ఆమె అడుగుతున్న తీరు అందరికీ కంట నీరు తెప్పిస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. చలికి వణుకుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement