కామాక్షమ్మ ఆక్రమించిన జడ్పీ స్థలంలో అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, కామాక్షమ్మ సొంత ఇల్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రతి చిన్న విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ప్రభుత్వంపై బురద జల్లడం ప్రతిపక్ష టీడీపీ, పచ్చ పత్రికలకు అలవాటుగా మారింది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలభద్రపురంలో చోటుచేసుకున్న సంఘటన ఇందుకు నిదర్శనం. ఆక్రమణలో ఉన్న జెడ్పీ స్థలం విషయంపై ఆ సరిహద్దులో ఉన్న టీడీపీ సానుభూతిపరులు ఇద్దరి మధ్య వివాదం చాలాకాలంగా నడుస్తోంది. పంచాయతీ అధికారులు ఆక్రమణ తొలగింపునకు ఉపక్రమిస్తే ఆక్రమణదారులైన తల్లి, కుమారుడు పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా, తల్లి మృతి చెందింది.
ఇదీ వాస్తవం..
గత సెప్టెంబరు 19న కలెక్టరేట్ స్పందనలో బాదిరెడ్డి లక్ష్మి భర్త అప్పారావు జిల్లా పరిషత్ భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశాడు. ఆ భూమిని కోటిపల్లి కామాక్షమ్మ(60) భర్త కన్నారావు ఆక్రమించుకున్నాడని, ఈ విషయాన్ని అడుగుతుంటే ఇంటి పక్కనే ఉన్న తమను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే ఆక్రమణపై సెప్టెంబరు 20న కిలపర్తి వీర్రాజు కూడా బిక్కవోలు ఎంపీడీవోకు జెడ్పీ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగించాలని అభ్యర్థించారు.
ఈ రెండు ఫిర్యాదులపై బిక్కవోలు ఎంపీడీవో, ఈవో (పీఆర్‌అండ్‌ఆర్డీ), బలభద్రపురం పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో అక్టోబర్ ఒకటో తేదీన స్థలాన్ని సందర్శించి.. కామాక్షమ్మ స్థలాన్ని ఆక్రమించారని గుర్తించారు. తాత్కాలికంగా వేసిన పాకలో ఉంచిన 2 కుర్చీలు, ట్రంక్ పెట్టె, బకెట్, స్టూల్‌ను తొలగించాలని వారు కోరారు. అందుకు ఆమె నిరాకరించి, ఫిర్యాదు చేసిన బాదిరెడ్డి అప్పారావుపై దుర్భాషలకు దిగింది. గత నెల 15న ఎట్టకేలకు కామాక్షమ్మ తన వస్తువులను తొలగించగా, పంచాయతీ కార్యదర్శి ఆ స్థలానికి కంచె వేయించి, అది గ్రామ పంచాయతీకి చెందిందని 16న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కామాక్షమ్మ సొంత ఇంటికి చెల్లించిన పన్ను రశీదు
ఇందులో వేధింపులు ఎవరివి?
ఆక్రమణ స్థలంతో సంబంధం లేకుండా కామాక్షమ్మ సొంత ఇంట్లో (డోర్ నంబర్ 10–50, అసెస్మెంట్ నంబర్ 2,250, సర్వే నంబర్ 152/1) నివాసం ఉంటున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇంటి పన్ను కూడా ఆమే చెల్లిస్తోంది. ఈ క్రమంలో ఆక్రమణలు తొలగించిన నెల తర్వాత నవంబరు 14న ఆమె తన కుమారుడు మురళీకృష్ణతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది.
వెంటనే మెరుగైన వైద్యం కోసం అధికారులు తొలుత అనపర్తి సీహెచ్‌సీ, ఆ తర్వాత కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అప్పటికే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమెకు వైద్యం అందిస్తున్న క్రమంలో 16న గుండె పోటుతో మృతి చెందినట్టు కాకినాడ జీజీహెచ్ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. టీడీపీ, పచ్చ పత్రికలు చెబుతున్నట్లు ఇందులో వైఎస్సార్‌సీపీ వేధింపులు ఎక్కడ ఉన్నట్లు?
Comments
Please login to add a commentAdd a comment