
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు.

తాజాగా చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు కపిలేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో తీవ్ర గాయాలు కావడంతో రుయా ఆసుపత్రికి తరలించారు.

కాగా, చంద్రిగిరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా పాకాల టౌన్ యూత్ ప్రెసిడెంట్ కపిలేశ్వర్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఓట్లవారిపల్లి గ్రామానికి చెందిన జగదీశ్వర్ చౌదరి, మరో 20 మంది టీడీపీ కార్యకర్తలు కపిలేశ్వర్ రెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో కపిలేశ్వర్ రెడ్డి తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆయనను తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించారు. ఇక, ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment