సాక్షి, చిత్తూరు : ‘ఇదేమిటయ్యా.. మనం అధికారంలో ఉన్నపుడు పదవుల కోసం పాకులాడారు. వార్డు ఇన్‌చార్జ్ కోసం పోటీపడ్డారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమించడానికి మనుషులు దొరకడంలేదా..? సిగ్గుగా ఉంది.. వెంటనే ఎవర్నో ఒకర్ని చూసి పెట్టండి. లేకుంటే మానం పోతాది..’ అంటూ టీడీపీ నేతలు పెదవి విరిచారు. గురువారం చిత్తూరులో తెలుగుదేశం పార్టీ జిల్లా సమ న్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుల స్థానంలో పార్లమెంటరీ అధ్యక్షుడిగా ఒకర్ని, సమన్వయకర్తగా మరొకర్ని ఇటీవల పార్టీ అధిష్టానం నియమించింది. (లోకేశ్‌కు చుక్కెదురు)
ప్రకాశంకు చెందిన ఉగ్రనరసింహారెడ్డిని సమన్వయకర్తగా, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా నానిని నియమించగా.. తొలిసారి పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకానికి నాయకులు దొరకడంలేదని పలువురు నేతల ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారంలో ఉన్నపుడు రూ.కోట్లు కూడబెట్టుకున్నవాళ్లు.. ఇప్పుడు బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని ఏకరువుపెట్టినట్లు తెలుస్తోంది. (ఆగని టీడీపీ దాష్టీకాలు)
చిత్తూరులో ఏఎస్.మనోహర్ పార్టీకి రాజీనామా చేయగా.. పూతలపట్టులో లలితకుమారి, గంగాధరనెల్లూరులో కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పార్టీలో చురుగ్గాలేరని పలువురు నేతలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై నేతలు స్పందిస్తూ.. ‘ఈ విషయాలు బయటచెబితే పరువుపోతుంది. ఎవరో ఒక రి పేరు పంపండి. అధిష్టానానికి చెప్పి వాళ్లను ఇన్‌చార్జ్‌లుగా ప్రకటిస్తాం..’ అని నేతలు సర్దిచెప్పినట్లు సమాచారం. మ రోవైపు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభతోపాటు పలువురు సీనియర్ నాయకులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment