కృష్ణాజిల్లా తోట్లవల్లూరు వద్ద కట్ట తెగిపోవడంతో పడవలో వెళ్తున్న స్థానికులు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: గోదావరి వరదల సీజన్ ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. వరద ఉధృతిని అంచనా వేసి, అప్రమత్తం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు 3 ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తుంటారు.
మొదటి ప్రమాద హెచ్చరిక : 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ నీటిమట్టం 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. నీటిపారుదల, పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలను అప్రమత్తం చేస్తారు. ఏటిగట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తారు.
రెండో హెచ్చరిక : 13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తూ 13.75 అడుగులకు నీటిమట్టం చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వెంటనే వరదకు సంబంధించిన అధికారులు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులకు హాజరవుతారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద రక్షణ చర్యలు చేపడతారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కలిసి ఇరిగేషన్ అధికారులు పనిచేస్తుంటారు.
మూడో హెచ్చరిక : 18 లక్షల క్యూసెక్కులకు మించి మిగులు జలాలు విడుదల చేస్తూ నీటిమట్టం 17.75 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక ప్రకటిస్తారు. వెంటనే జిల్లా యంత్రాంగం ముఖ్యంగా లంక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన పటిష్ట చర్యలను చేపడతారు. గోదావరిలో అన్ని రకాల పడవలు, పంట్ల రాకపోకలపై పూర్తి నిషేధం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment