తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (శుక్రవారం)51,818 మంది స్వామివారిని దర్శించుకోగా 19,023 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.52 కోట్లు సమర్పించారు.
టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
పిభ్రవరి 4న రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లు
పటిష్ట భద్రతా చర్యలు
ఫిబ్రవరి 3 నుండి 5వ తేది వరకు ఎస్ఎస్ డి టోకెన్ల జారీ నిలిపివేత
టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు
ఫిబ్రవరి 4వ తేది రథసప్తమి(సూర్య జయంతి) సందర్భంగా తిరుమలలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. రథ సప్తమి రోజున 2 ృ 3 లక్షల మంది భక్తులు తిరుమలకు వస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ అధ్యక్షతన శుక్రవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రథ సప్తమి ఏర్పాట్ల గురించి ఛైర్మన్ వివరించారు.
సమావేశంలోని ముఖ్యాంశాలు
వాహన సేవల వివరాలు
⇒ ఉ. 5.30 ృ 8 గం.ల వరకు (సూర్యోదయం 6.44 - సూర్య ప్రభ వాహనం
⇒ఉ. 9 ృ 10 గంటల వరకు ృ చిన్న శేష వాహనం
⇒ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు- గరుడ వాహనం
⇒ మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు- హనుమంత వాహనం
⇒ మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు- చక్రస్నానం
⇒ సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు- కల్పవృక్ష వాహనం
⇒ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు- సర్వభూపాల వాహనం
⇒రాత్రి 8 నుంచి 9 గంటల వరకు- చంద్రప్రభ వాహనం
పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు
⇒ అష్టదళ పాద పద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు.
⇒ ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాల రద్దు.
⇒ తిరుపతిలో ఫిబ్రవరి 3 ృ 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ రద్దు.
⇒ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు, బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 03న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
⇒ ప్రత్యేక ప్రవేశ దర్శనం ( ఉఈ) టిక్కెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని విజ్ఞప్తి.
Comments
Please login to add a commentAdd a comment