
పోలవరంపై సానుకూల ధోరణిలో కేంద్రం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర.. పోలవరం అంచనా వ్యయంపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ సానుకూల ధోరణిలో స్పందించింది. పూర్తి వివరాలు..
పురిటి గడ్డ రుణం.. సీఎం జగన్ సంకల్పం
తనకు జన్మనిచ్చిన పులివెందుల ప్రజల రుణం తీర్చుకునే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేస్తున్న అడుగులు అక్కడి ప్రజలను ఆనంద సాగరంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా ఈనెల 23, 24, 25 తేదీలలో సీఎం పులివెందుల పర్యటనలో ఆ ప్రాంత ప్రగతి కోసం మరిన్ని అభివృద్ధి పనులకు పునాదిరాళ్లు వేశారు. పూర్తి వివరాలు..
రేవంత్‌రెడ్డి పేరు మీడియాకు చెప్పాను
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు రేపుతోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామకం ఖరారైరందన్న వార్తల నేపథ్యంలో సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతారావు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు కీలక బాధ్యతలు కట్టబెట్టడం సరికాదంటూ ఆయన విమర్శించారు. పూర్తి వివరాలు..
నాడు యూపీ.. నేడు మధ్యప్రదేశ్
వివాదాస్పద లవ్ జిహాద్ బిల్లుకు మరో రాష్ట్రం ఆమోదముద్ర వేసింది. బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మంత్రివర్గం శనివారం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. బిల్లుకు కేబినెట్‌ఆమోదం తెలిపిన అనంతరం హోంమంత్రి నాథూరాం మిశ్రా వివరాలను వెల్లడించారు. పూర్తి వివరాలు..
కరోనా : ఆ టీకా తీసుకున్న వైద్యుడికి అలర్జీ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికి అక్కడ భారీ స్థాయిలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో మోడర్నా, ఫైజర్ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతించింది. ఈ క్రమంలోనే నెలల తరబడి అలుపెరగకుండా కష్టపడిన వైద్య సిబ్బందికి ముందుగా కరోనా టీకాలు అందజేస్తున్నారు. పూర్తి వివరాలు..
ఇష్టం లేని పెళ్లి.. పరువు హత్యకు దారి
కేరళలోని పాలక్కడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తమకు ఇష్టం లేకుండా తమ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జిల్లాలోని తెన్కురిస్సి ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు..
సంక్రాంతికి ముందే సింగర్ సునీత పెళ్లి!
తన గాత్ర మాధుర్యంతో అభిమానులను ఓలలాడించే సింగర్ సునీత వైవాహిక జీవితం గురించి ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఏనాడూ ఆమె వాటిని పట్టించుకోలేరు. అయితే ఓ షోలో మాత్రం తన భర్త వల్ల ఇబ్బందిపడుతున్న విషయాన్ని బయట పెట్టారు. పిల్లలను తనే పెంచి పోషిస్తున్నట్లు తెలిపారు. ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు..
రెండో టెస్టు: హో విల్సన్, ఇది చీటింగ్!
మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు.పూర్తి వివరాలు..
హీరో ఈసైకిల్@ 49,000
హీరో సైకిల్స్ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. F6i సైకిల్ రెండు కలర్ కాంబినేషన్స్‌లో అంటే.. రెడ్ విత్ బ్లాక్, యెల్లో విత్ బ్లాక్ లభిస్తోంది. పూర్తి వివరాలు..
జమీర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ జమీర్ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు ఫారూఖ్ అహ్మద్, అతనికి సహాయపడినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి వారం గుడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని జమీర్ బామ్మర్ధి సయ్యద్ మీర్జా ఆరోపించారు. పూర్తి వివరాలు..