సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణలో ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందుపై టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో పరిశోధనలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆనందయ్య మందుపై ప్రజల్లో మంచి స్పందన ఉంది. దీనిపై ఆయుష్ నుంచి నివేదిక రావాలి. ఆయుష్ నుంచి టీటీడీ అధ్వర్యంలోని ఆయుర్వేద కాలేజీకి నివేదిక పంపారు’’ అని తెలిపారు.
‘‘క్లినికల్ ట్రయల్స్ అంశంలో మినిస్ట్రీ ఆష్ ఆయుష్ నిర్ణయం తీసుకోనుంది. మందును ఆయుర్వేద కాలేజీలో తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం. 500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం. ఈ నివేదిక రావడానికి వారం పడుతుంది. ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపాం. టీటీడీ తరఫున మందును ప్రజలకు అందిచమని సీఎం ఆదేశిస్తే అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటాయి. ప్రజల మేలు కోసం కేంద్రం ఈ మందును నిర్థారణ చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఈ మందు అందిస్తుంది’’ అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
చదవండి: ఆనందయ్య మందుపై టీటీడీ పరిశోధనలు
Comments
Please login to add a commentAdd a comment