2 రోజులు వర్షాలు | Two days of rain forecast in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

2 రోజులు వర్షాలు

Published Sun, Jun 27 2021 3:21 AM | Last Updated on Sun, Jun 27 2021 3:21 AM

Two days of rain forecast in Andhra Pradesh - Sakshi

గుంటూరులో కురిసిన వర్షానికి జలమయమైన రహదారి

సాక్షి, అమరావతి /మహారాణిపేట(విశాఖ దక్షిణ): జార్ఖండ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఈ ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల గాలుల వేగం రాష్ట్రంపై పెరిగింది. పశ్చిమ, వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయి.  

గుంటూరు జిల్లాలో వర్షాలు..
కొరిటెపాడు(గుంటూరు):  గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో  శనివారం సాయంత్రం నుంచి పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. గుంటూరు నగరంతో పాటు దుగ్గిరాల, వినుకొండ, చిలకలూరిపేట, తాడికొండ, మంగళగిరి, రేపల్లె, బాపట్ల, పెదకాకాని మండలాల్లో వర్షం పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement