
సాక్షి, అమరావతి: పోలవరం కల సాకారానికి ఇక.. ఒక అడుగు దూరమే మిగిలిందని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టుదలతో రేయింబవళ్లు, లాక్‌డౌన్ టైంలో కూడా నిర్మాణ పనులు కొనసాగడం వల్ల కొద్ది నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి రూపం సంతరించుకుంటోందని పేర్కొన్నారు. క్రెస్ట్ గేట్ల ద్వారా గోదావరి ప్రవాహం జాలు వారుతున్న దృశ్యం అద్భుతంగా ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.