Guntur Man Wedding With Turkey Woman In Hindu Marriage Tradition, Pics Viral - Sakshi
Sakshi News home page

గుంటూరు అబ్బాయి..టర్కీ అమ్మాయి..

Published Thu, Dec 30 2021 8:47 AM | Last Updated on Thu, Dec 30 2021 10:46 AM

Visakhapatnam Young Man Married Russian Woman - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రష్యాకి చెందిన యువతి ఇరీనాను విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ గ్రామ సర్పంచ్‌ బండారు ఈశ్వరమ్మ, ముత్యాలనాయుడు కుమారుడు నరేష్‌ వివాహం చేసుకున్నారు. నరేష్‌ రష్యాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. అదే ఆఫీసులో పనిచేస్తున్న రష్యా దేశానికి చెందిన ఆండ్రీ, నేతాలియా దంపతుల కుమార్తె ఇరీనాతో ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను నరేష్, ఇరీనా తల్లిదండ్రులు అంగీకరించడంతో కింతాడలో వీరి వివాహన్ని హిందూ సంప్రదాయ పద్ధతిలో బుధవారం నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో ఇరీనా తల్లి సైతం చీరకట్టులోనే కనిపించడం విశేషం.     
–కె.కోటపాడు

గుంటూరు అబ్బాయి..టర్కీ అమ్మాయి..


వేద మంత్రాల సాక్షిగా, మూడు ముళ్ల బంధంతో టర్కీ అమ్మాయి...గుంటూరు అబ్బాయి ఒక్కటయ్యారు. గుంటూరు ఆత్మ డెప్యూటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ దమ్మాటి వెంకటేశ్వర్లు కుమారుడు మధుసంకీర్త్‌ ఉద్యోగ రీత్యా టర్కీలో స్థిరపడ్డాడు. అక్కడ తన సహచర ఉద్యోగిని, టర్కీలోని ఇజ్‌మిర్‌ నగర్‌కు చెందిన గిజెమ్‌తో ప్రేమలో పడ్డాడు. వీరి ప్రేమ వివాహాన్ని జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయి. గుంటూరు భారత్‌పేట ఆరో వీధిలోని తన్విక ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం రాత్రి వీరి వివాహం జరిగింది. 
–గుంటూరు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement