
సాక్షి, గుంటూరు : దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. కొంతమంది భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా గుంటూరుకు చెందిన ఓ యువకుడు పాజిటివ్ వచ్చిందని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
గుంటూరు జిల్లా పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన షేక్ విలాయత్ ఇటీవల స్వల్ప ఆస్వస్థతకు గురయ్యాడు. కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకొని గురువారం గుంటూరుకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం పాజిటివ్ వచ్చిందని ఫోన్‌కాల్ వచ్చింది. దీంతో మనస్థాపం చెందిన షేక్ విలాయత్.. ఇంటి నుంచి బయటకు వెళ్లి చాలా సమయం వరకు తిరిగి రాలేదు. పలు మార్లు ఫోన్ చేయగా తనకి పాజిటివ్ వచ్చిందని అందుకే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి ఫోన్ కట్ చేశాడు. అయితే వెంటనే తల్లిదండ్రులు ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా అప్పటికే షేక్ విలాయత్ మృతి చెందాడు. కరోనా సోకిందనే భయంతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని విలాయత్ ఆత
Comments
Please login to add a commentAdd a comment