ఘనంగా కాకినాడ జిల్లా ప్లీనరీ | YSRCP Kakinada District Plenary as Grand Level | Sakshi
Sakshi News home page

ఘనంగా కాకినాడ జిల్లా ప్లీనరీ

Published Wed, Jul 6 2022 5:35 AM | Last Updated on Wed, Jul 6 2022 5:35 AM

YSRCP Kakinada District Plenary as Grand Level - Sakshi

కాకినాడ ప్లీనరీలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు

కాకినాడ రూరల్‌/కరప: వైఎస్సార్‌ సీపీ కాకినాడ జిల్లా ప్లీనరీ మంగళవారం సాయంత్రం కాకినాడ రూరల్‌ పరిధిలోని నడకుదురులో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ప్లీనరీకి భారీఎత్తున వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు హాజరుకాగా.. ఆరు అంశాలపై తీర్మానాలు చేశారు.

ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీదిరి అప్పలరాజు, మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ, ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ పిల్లి సుభాష్‌చంద్రబోస్, పరిశీలకురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement