రథోత్సవంలో పాల్గొన్న భక్తులు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అంతకుముందు ఆలయంలో ధూళి ఉత్సవం నిర్వహించారు.అనంతరం స్వామివారిని అందంగా అలంకరించి తేరు(రథం)లో కొలువుదీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు అన్నదానం ఏర్పాటు చేశారు. తరిగొండతోపాటు పరిసర గ్రామాల ప్రజలు చాందీనీ బండ్లు, అన్నం,టెంకాయ బండ్లను ఆలయం చుట్టూ తిప్పారు.ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రథోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment