ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయ టీటీడీ అధికారులు లెక్కింపు చేశారు. ఈ సందర్భంగా పరకామణి లెక్కింపు ముగిసే సమయానికి ఒంటిమిట్ట రామయ్య నెలసరి హుండీ ఆదాయం 8 లక్షల 620 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ఏఐటీయూసీ జిల్లా
నూతన కమిటీ
రైల్వేకోడూరు అర్బన్: అన్నమయ్య జిల్లా ఏఐటీయూసీ కార్యవర్గాన్ని మంగళవారం సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి ప్రకటించారు. గౌరవాధ్యక్షుడిగా తుమ్మల రాధాకృష్ణ, అధ్యక్షుడిగా మాదరాజు గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా ఎం.సాంబశివ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వర్రి సురేష్ కుమార్, కోశాధికారిగా సరోజమ్మ, జిల్లా ఉపాధ్యక్షుడిగా గాలి చంద్ర, పోకూరి మురళి, నరసింహులు, ఉప ప్రధాన కార్యదర్శులుగా సలీం బాషా, సహాయ కార్యదర్శులుగా ఇ.సికిందర్, వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణ చైతన్యలను ఎన్నుకున్నారు.
తలనీలాల వేలం పాట
రూ.5.51 లక్షలు
సిద్దవటం: నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పి ంచుకునే తలనీలాల వేలం పాటను బాపట్ల జిల్లా అద్దంకి గ్రామానికి చెందిన వంగపాటి మహేంద్ర రూ. 5. 51లక్షలకు దక్కించుకున్నారని ఆలయ ఈఓ మోహన్‌రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన నిత్యపూజస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన తలనీలాలకు మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం పాట ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యపూజ స్వామి ఆలయంలో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులు స్వామివారికి సమర్పించుకునే తలనీలాల ప్రోగు కోసం ఈ వేలం పాటను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ జనార్దన్, ఆలయ ఉద్యోగి చంద్ర , జ్యోతి వెంకటసుబ్బారెడ్డి, పాటదారులు, వంతాటిపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నేడు సబ్ కలెక్టరేట్
ప్రారంభోత్సవం
మదనపల్లె: పట్టణంలో నూతనంగా ఆధునికీకరించిన సబ్ కలెక్టరేట్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా బుధవారం ప్రారంభించనున్నట్లు సబ్ కలెక్టరేట్ ఏఓ రాఘవేంద్ర తెలిపారు. గత ఏడాది జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, కార్యాలయ ప్రాంగణంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్–2 భవనంలో తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పాలన సాగిస్తున్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి భవనానికి మరమ్మతులు చేసేందుకు అనుమతులు రావడంతో ఆధునికీకరణ పనులు చేపట్టారు. కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ముస్తాబుచేసి, ఫిబ్రవరి 19న ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10.30 గంటలకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా ఆధునికీకరించిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని సబ్ కలెక్టరేట్ అధికారులు తెలిపారు.
ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట రామయ్య హుండీ ఆదాయం లెక్కింపు
Comments
Please login to add a commentAdd a comment