పంచాయతీ నిధులు కాజేస్తూ.. గన్‌తో బెదిరింపులు
రాయచోటి: పీలేరు పంచాయతీ ఈఓ గురుమోహన్ అవినీతి అక్రమాలకు పాల్పడడమే కాకుండా సమస్యలపై ప్రశ్నించిన వారికి తనవద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారంటూ పీలేరు సర్పంచ్, పాలకవర్గం సభ్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను సర్పంచ్ హబీబ్ బాషా, వార్డు సభ్యులు కలిసి ఫిర్యాదు చేశారు. కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వకపోగా కొన్ని నెలలుగా వారికి ఇవ్వాల్సిన ఈపీఎఫ్ డబ్బులు డిపాజిట్ చేయలేదన్నారు. అలాగే జనరల్ ఫండ్ నిధులను ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారన్న విషయాన్ని కూడా చూపించడం లేదన్నారు. పంచాయతీకి జమ అవుతున్న నిధులు వివరాల గురించి సర్పంచ్, వార్డు సభ్యులు అడిగితే తమవద్ద ఉన్న గన్ చూపించి బెదిరిస్తున్నారని, గన్ విషయంపై విచారణ చేసి పీలేరులో గొడవలకు కారణం అవుతున్న ఈఓ గురుమోహన్‌పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఈఓ గురు మోహన్, డీఎల్‌పీఓ నాగరాజ వారికి ఇష్టం వచ్చిన రీతిలో నిధులను డ్రా చేసి స్వాహా చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో వార్డు సభ్యులు లలితమ్మ, వెంకటరమణ, మల్లికార్జున రెడ్డి, కళావతి, పరమేష్ తదితరులు ఉన్నారు.
పీలేరు పంచాయతీ ఈఓ అవినీతిపై
కలెక్టర్‌కు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment