అభ్యసన సామర్థ్యాల పెంపునకే సాల్ట్ కార్యక్రమం
రాయచోటి అర్బన్: విద్యార్థుల్లో ప్రాథమిక దశలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం అన్నారు. మంగళవారం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ‘సాల్ట్’ పేరుతో అంగన్‌వాడీలకు 120 రోజుల సర్టిఫికెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రాథమిక దశలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు అంగన్‌వాడీ వర్కర్లు కృషి చేయాలన్నారు. ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రమాదేవి మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను పిల్లల అభివృద్ధికి వినియోగించాలన్నారరు. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, మండల విద్యాశాఖాధికారులు బాలాజీ నాయక్, వెంకటశివారెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక దశలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచడం ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో డీఆర్‌పీలు రాజారమేష్, వెంకటసుబ్బయ్య, సికిందర్, నాగమణి, సుగుణ, శివజ్యోతి, ఎఫ్‌ఎల్‌ఎస్ కో–ఆర్డినేటర్ రాజశేఖర్, సీఆర్‌పీలు అరుణ్‌బాబు, రవిప్రకాష్, మండల పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment