పేద విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం చేయడం వల్ల వారు చదువులు ఆపాల్సి వస్తోంది. దీని ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. పిల్లల ఫీజులకు డబ్బులు లేక తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. గతంలో 2018–19లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం బకాయి పెట్టిన 1800 కోట్ల రూపాయలను వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. అదే విధంగా 2023–24లో ఎన్నికల కోడ్ కారణంగా ఏర్పడిన బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత నుంచి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పక్కకు తప్పుకోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడమే. ఆ బకాయిలతో కలిపి, ఇప్పటి వరకు 3900 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. లక్షలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సంబంధించిన ఈ అంశంలో ఇంకా జాప్యం చేయకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – జంగంరెడ్డి కిశోర్, విద్యార్థి
విభాగం అధ్యక్షుడు, అన్నమయ్య జిల్లా
నిరుద్యోగులపై నిర్లక్ష్య వైఖరి
కూటమి సర్కారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకపోగా, సీఎం చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార సమయంలో మొదటి సంతకం పెట్టిన మెగా డీఎస్సీ ఇంత వరకు అతీ గతీ లేదు. ఏవేవో సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. మరోపక్క 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి.. కల్పించని సమయంలో నిరుద్యోగ భతి ఇస్తామని కబుర్లు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు పట్ల నిర్లక్ష్య వైఖరి కనబరుస్తున్నారు. నిరుద్యోగ భృతికి అవసరమైన డబ్బులను బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు. – శివప్రసాద్‌రెడ్డి,
యువజన విభాగం అధ్యక్షుడు
న్యూస్‌రీల్
పేద విద్యార్థులను విస్మరించిన ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment