●మనుషులు, పాడి ఆవులు మృత్యువాత
వేటగాళ్లు వినియోగించే నాటుబాంబులు, విద్యుత్ తీగెల వల్ల మనుషులతోపాటు పాడిఆవులు బలి అవుతున్న సంఘటనలు ఉన్నాయి. మండలంలోని మర్రిపాడు గ్రామ కస్పాకు చెందిన నందమహారెడ్డి గ్రామానికి సమీపంలోని తన పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. ఆయన రెండేళ్ల క్రితం రాత్రి వేళ పొలానికి కాపలాగా వెళ్తుండగా.. పరిసరాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగెల్లో చిక్కుకొని మృతి చెందాడు. కలకడ మండలం ఎనుగొండ పాళెం తండాకు చెందిన సిద్దులు నాయక్, లీలాభాయ్‌లు గుర్రంకొండకు పక్కనున్న సుంకర వాండ్లపల్లెకు నడకదారిన వెళుతూ.. విద్యుత్ తీగెల మధ్యలో చిక్కుకొని మృతి చెందారు. వారం రోజుల క్రితం చెర్లోపల్లె పంచాయతీ కిలారివాండ్లపల్లె సమీప పొలాల్లో విద్యుత్ తీగెల వల్ల రమేష్‌నాయడు అనే వ్యవసాయ కూలీ మృత్యువాత పడ్డాడు. యల్లంపల్లెలో ఇరువురు వ్యక్తులు రక్తగాయాలతో బయట పడి ఆస్పత్రుల పాలయ్యారు. మామిళ్లవారిపల్లె నాగరాజుకు చెందిన పాడిఆవు పొలాల వద్ద ఉన్న నాటుబాంబును నమిలి నోరు మొత్తం పేలిపోయి మృతి చెందింది. యల్లంపల్లె, సరిమడుగు, నడిమిఖండ్రిగ గ్రామాల్లో విద్యుత్ తీగెల్లో చిక్కుకొని నాలుగు పాడిఆవులు మృతి చెందాయి.
●మనుషులు, పాడి ఆవులు మృత్యువాత
Comments
Please login to add a commentAdd a comment