ప్రకృతి వ్యవసాయం.. లాభదాయకం
రాజంపేట రూరల్: ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతో లాభదాయకమని జిల్లా డీఆర్‌సీ ఏడీఏ అశోక్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఊటుకూరు గ్రామ సచివాలయంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా మంగళవారం వీఏఏ, వీహెచ్‌ఏ, వీఏఓలతోపాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి జి.రాజకుమారి, వెలుగు ఏపీఎం గంగాధర్, ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ వేల్పుల సిద్దయ్య, డీఆర్‌సీ ఏఓ సుచరిత, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి పాఠశాలలో స్కౌట్స్ ఏర్పాటు
రాయచోటి అర్బన్: అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అన్నారు. పట్టణంలోని అర్చన కళాశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నిర్వహిస్తున్న పెట్రోల్ లీడర్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన మంగళవారం ఉదయం పరిశీలించారు. పీఎంశ్రీ పాఠశాలల నుంచి వచ్చిన 250 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో 5 రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అర్చన విద్యాసంస్థల కరస్పాండెంట్ మదనమోహన్‌రెడ్డి, హెచ్‌డబ్ల్యూ బి.నిర్మల, స్కౌట్స్ మాస్టర్ నాగరాజ, గైడ్ కెప్టెన్‌లు సుజాత, గోవిందమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
మిట్స్ కళాశాలకు
అరుదైన గౌరవం
కురబలకోట: అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు అరుదైన గౌరవం దక్కింది. సివిల్ విభాగానికి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ ల్యాబొరెటరీస్ (ఎన్‌ఎబీఎల్) గుర్తింపు నాలుగేళ్ల పాటు లభించింది. ఇందుకు సంబంధించిన పత్రాన్ని ప్రిన్సిపాల్ యువరాజ్‌తోపాటు ప్రొఫెసర్లు మంగళవారం మీడియాకు విడుదల చేశారు. ఉన్నత విద్యా ప్రమాణాలకు ఎన్‌ఎబీఎల్ మార్గదర్శకమవుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. దీని ద్వారా పరిశోధన సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చన్నారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment