రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడి మృతి
మదనపల్లె : గుర్తు తెలియని యువకుడు రైలు కింద పడి మృతి చెందిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. ధర్మవరం నుంచి నరసాపురం వెళుతున్న రైలు కిందపడి సీటీఎం వద్ద యువకుడు మృతి చెందడంతో గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వివరాలు తెలియలేదు. కాగా, మృతుడు గళ్లచొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించి సుమారు 25 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు కదిరి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ రహీం తెలిపారు.
దేవతానగర్‌లో చోరీ
మదనపల్లె : పట్టణంలోని దేవతానగర్‌లో చోరీ జరిగింది. మంగళవారం చోరీపై బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న చిన్నరెడ్డెప్ప దేవతానగర్‌లో భార్య అరుణతో కలిసి నివసిస్తున్నాడు. ఈనెల 9న గుర్రంకొండ మండలం శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు భార్యతో కలిసి వ్యక్తిగత పనులపై వెళ్లారు. పనులు ముగించుకుని పదోతేదీ ఉదయం ఇంటికి రాగా, ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువా తలుపులు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని నిర్ధారించుకున్నారు. 74 గ్రాముల బంగారు ఆఽభరణాలు చోరీకి గురయ్యాయని తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. క్లూస్‌టీమ్ సభ్యులు ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు.
టీడీపీ మండల అధ్యక్షుడి కారు దగ్ధం
రామసముద్రం : మండల టీడీపీ అధ్యక్షుడు విజయగౌడ్ కారును సోమవారం అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు కాల్చివేశారు. సమాచారం అందుకున్న మదనపల్లె రూరల్ సీఐ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకుని ఎస్‌ఐ రవికుమార్‌తో కలిసి పరిశీలించి వివరాలు సేకరించారు. అర్థరాత్రి కారుకు నిప్పు పెట్టడంతో టైర్లు పగిలిన శబ్దానికి మెలకువ వచ్చి చూడగా కారు కాలుతోందని బాధితుడు తెలిపారు. వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ సత్యనారాయణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఎమ్మెల్యే తనయుడు జునైద్ అహ్మద్, టీడీపీ రాజంపేట అధికార ప్రతినిధి ఆర్.జె. వెంకటేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానితులపై కేసు నమోదు చేశామని, త్వరలో నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు.
రైలుకింద పడి గుర్తుతెలియని యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment