ఇద్దరు సీఐల బదిలీ
● ముగ్గురి నియామకం
రాయచోటి: పొలీస్ శాఖలో సీఐల బదిలీలు, నియామకాలు చేపట్టారు. మంగళవారం రాత్రి కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ అన్నమయ్య జిల్లా పరిధిలో ఇద్దరిని బదిలీ చేస్తూ, ముగ్గురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాయచోటి అర్బన్ సీఐ పి.చంద్రశేఖర్‌ను కర్నూలు వీఆర్‌కు బదిలీ చేశారు. కర్నూలు జిల్లా ఆలూరు సీఐగా పని చేస్తున్న బి.వి.చలపతిని రాయచోటి అర్బన్ సీఐగా నియామకం చేశారు. రాజంపేట మన్నూరు సీఐగా పని చేస్తున్న కె.మహమ్మద్ అలీని అన్నమయ్య సైబర్ సెల్ సీఐగా, కడప వీఆర్‌లో పని చేస్తున్న ఎస్.కులాయప్పను మన్నూరు సీఐగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పని చేస్తున్న సీఐ జి.శంకరమల్లయ్యను అన్నమయ్య జిల్లా ఉమెన్స్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment